FASTag : మీ ఫాస్టాగ్‌లో ఉచితంగా రూ. 1000 క్రెడిట్ చేస్తారు! ఇలా చేస్తే చాలు..
FASTag updates : భారతదేశంలో ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం వేగంగా జరుగుతున్నప్పటికీ, హైవేలపై ఉండే టాయిలెట్ల పరిశుభ్రత అనేది ప్రయాణికులకు పెద్ద సవాలుగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదేంటంటే..
భారతదేశంలో హైవే ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు, ప్రజల సౌకర్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజాల దగ్గర ఉన్న అపరిశుభ్ర టాయిలెట్లను రిపోర్టు చేసిన వారికి, వారి ఫాస్టాగ్‌లో రూ. 1000 రివార్డు లభించే విధంగా చర్యలు తీసుకోనుంది.

అపరిశుభ్ర టాయిలెట్లపై ఫిర్యాదు చేస్తే..
మంత్రిత్వ శాఖ తాజాగా ‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’ను ప్రకటించింది. టోల్ ప్లాజాల వద్ద టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉంటే, ప్రయాణికులు వాటిని నివేదించాలని కోరింది.
ఎలా ఫిర్యాదు చేయాలి?: ప్రయాణికులు అపరిశుభ్రమైన టాయిలెట్ ఫోటోను తీసి 'రాజమార్గయాత్ర' (Rajmargyatra) యాప్‌లో అప్‌లోడ్ చేయాలి.
బహుమతి: అధికారులు ఆ ఫోటోను వెరిఫై చేసిన తర్వాత, ఫిర్యాదు చేసిన యూజర్ ఫాస్టాగ్ అకౌంట్‌లో రూ. 1,000 క్రెడిట్ జమ అవుతుంది.
పౌరులను భాగస్వామ్యం చేయడం ద్వారా హైవేలపై పారిశుధ్య ప్రమాణాలను మెరుగుపరచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
ఏప్రిల్ 10 నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు బంద్!
మరోవైపు.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 10 నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు తీసుకోరు1
కేవలం ఫాస్టాగ్, యూపీఐ ద్వారా మాత్రమే టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
నగదు లావాదేవీలను పూర్తిగా నియంత్రించడం ద్వారా టోల్ గేట్ల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించి, ట్రాఫిక్ ఫ్లోను మెరుగుపరచాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది.
యూపీఐ చెల్లింపులపై జరిమానా జాగ్రత్త!
ఇక్కడ ప్రయాణికులు ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. టోల్ ట్యాక్స్‌ను యూపీఐ ద్వారా చెల్లిస్తే, అసలు టోల్ ధరపై 25 శాతం పెనాల్టీ పడుతుంది!
ఉదాహరణకు: మీ టోల్ ధర రూ. 100 అనుకుంటే, మీరు యూపీఐ ద్వారా చెల్లిస్తే రూ. 125 కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఫాస్టాగ్ వాడటమే అత్యంత లాభదాయకం.
మరికొన్ని కీలక మార్పులు..
టోల్ మినహాయింపులు: ప్రభుత్వ ఐడెంటిటీ కార్డులు చూపించి ప్రైవేట్ వాహనాలపై టోల్ మినహాయింపు పొందడంపై ఆంక్షలు విధించారు. ఇకపై కేవలం 'ఎగ్జెంప్టెడ్ ఫాస్టాగ్' ఉన్న వాహనాలకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది.
ఫాస్టాగ్ యాన్యువల్ పాస్: తరచుగా హైవేలపై ప్రయాణించే వారి కోసం డిజిటల్ 'ఫాస్టాగ్ యాన్యువల్ పాస్'ను ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల ప్రయాణం మరింత వేగంగా, సులభంగా మారుతుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












