Telangana Govt : ఇక మీ ఇంటికే డ్రైవింగ్ లైసెన్, RC కార్డులు - రవాణా శాఖ నిర్ణయం..! ఏం చేయబోతుందంటే..?
రాష్ట్ర రవాణా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వాహనదారుల ఇంటికే డ్రైవింగ్ లైసెన్స్ లు, ఆర్సీ కార్డులను పంపాలని నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర రవాణాశాఖలో అనేక సంస్కరణలు అమలవుతున్నాయి. ఇప్పటికే షోరూమ్ ల వద్ద రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా…. రవాణాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) కార్డులను నేరుగా ఇంటికే పంపనుంది. ప్రింటింగ్ తోపాటు డెలివరీ ప్రక్రియను మరింత సరళీకృతం చేయాలని నిర్ణయించింది.

ప్రస్తుతం రాష్ట్రంలోని 61 RTO ఆఫీసుల నుంచి ఈ కార్డులను వాహనదారులకు పంపిస్తున్నారు. కొన్ని కార్డులు సకాలంలో అందుతున్నప్పటికీ… చాలా కార్డుల డెలివరీలో ఇబ్బందులు వస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.
ఈ విధానంలో ఆలస్యంతో పాటు మధ్యవర్తుల జోక్యం ఎక్కువగా ఉంటోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఏజెంట్ల ప్రమేయమే లేకుండా…. రాష్ట్రవ్యాప్తంగా ఒకే కేంద్రం నుంచి కార్డులను ప్రింట్ చేసి నేరుగా వాహనదారుల ఇళ్లకు పంపించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందుకు సీఎం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
రాష్ట్రంలో సగటున ఏడాదికి దాదాపు 4 లక్షలకుపైగా లైసెన్స్ లు, దాదాపు 10 లక్షల వరకు వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ రెండూ కలిపి లక్షల కార్డులను వాహనదారులకు డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నెలల సమయం పడుతోంది. దీంతో వాహనదారులు కార్డుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.
కొన్నిసార్లు ఆర్టీవో కేంద్రాల వద్దకు వెళ్లి ఆరా తీస్తే… డెలివరీ అయిపోయినట్లు కనిపిస్తోంది. కానీ కార్డు మాత్రం అందటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది వాహనదారులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి... ఎఫ్‌ఐఆర్ తీసుకుంటున్నారు. దాని ఆధారంగా మళ్లీ డూప్లికేట్ కార్డుల కోసం దరఖాస్తు చేస్తున్నారు.
ప్రస్తుతం ఆయా ఆర్టీఓ కార్యాలయాల పరిధి నుంచే ఆర్సీలు, లైసెన్సులు ప్రింట్ అవుతున్నాయి. ఆ తర్వాత వాటిని డెలివరీ చేస్తున్నారు. ఇలా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఒకేచోట (సెంట్రలైజ్డ్) ప్రింటింగ్ చేసి, డెలివరీ చేసే విధానం అమల్లో వస్తే ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చని సర్కార్ భావిస్తోంది. తద్వారా వాహనదారులకు సులభంగా ఈ కార్డులు డెలివరీ అయ్యే మార్గం ఏర్పడుతుంది.
పారదర్శకంగా సేవలు - రవాణాశాఖ మంత్రి పొన్నం
"డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్‌సీ కార్డులు ఇంటికే అందించే విధంగా రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు సులభ సేవలు అందించడం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. సెంట్రలైజ్డ్ ప్రింటింగ్, స్పీడ్ పోస్టు ద్వారా పారదర్శకంగా సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాం. మధ్యవర్తులు లేకుండా, ప్రజల సమయాన్ని ఆదా చేస్తూ మెరుగైన సేవలందిస్తాం" అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటన చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

