TG Vehicle Registration : వాహనదారులకు శుభవార్త - ఇకపై ఆ 2 శాతం ట్యాక్స్ రద్దు..! అమలు ఎప్పుడంటే..?
రాష్ట్రంలో వాహనాలు కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం తీపికబురు వచ్చేసింది.రెండో వాహనం కొనుగోలుపై విధించే 2 శాతం అదనపు ట్యాక్స్‌ను రద్దు చేయాలని రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది.
రవాణాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం… మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండో వాహనం రిజిస్ట్రేషన్ పై 2 శాతం అదనపు ట్యాక్స్‌ను రద్దు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఈ నెల 23వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

ఈ ట్యాక్స్ రద్దు చేయటానికి ప్రత్యేకంగా కొన్ని కారణాలు ఉన్నాయి. చాలా మంది వాహనదారులు ఈ ట్యాక్స్ ను తప్పించుకునేందుకు వారి ఇంట్లోని కుటుంబ సభ్యుల పేర్లపై వాహనాలను రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. తరువాత బీమా క్లెయిమ్‌ల సమయంలో యాజమాన్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఇక రాష్ట్ర రాష్ట్రంలో జరిగే రిజిస్ట్రేషన్లు కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’ పోర్టల్ ద్వారా జరగనున్నాయి. రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి వాహనం కూడా వాహన్‌తో అనుసంధానమవుతుంది. ఈ సరికొత్త విధానం ఈనెల 23వ తేదీ నుంచే అమలు కానుంది. ఈ రెండు కారణాలతో…. ఈ ట్యాక్స్ ను రద్దు చేయాలని సర్కార్ నిర్ణయించింది.
ఇకపై ‘వాహన్’ ఫ్లాట్ ఫామ్….
జాతీయ డిజిటల్ ప్లాట్‌ఫామ్ “వాహన్”లో రెండో వాహనం గుర్తించే ప్రత్యేక ఆప్షన్ కూడా లేదు. ఇది కూడా ఇబ్బందిగా మారింది. పైగా ఇతర రాష్ట్రాల్లో ఈ తరహా పన్ను లేవని ప్రభుత్వానికి నివేదికలు అందాయి. వీటన్నింటిని విశ్లేషించిన ప్రభుత్వం…. ఈ పన్నును పూర్తిగా ఎత్తివేయాలనే నిర్ణయానికి వచ్చింది. అంటే వాహన్ తో అనుసంధానం వల్ల రెండో వాహనం కొనుగోలు చేసే వారికి ఖర్చు తగ్గడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా కాస్త సులభమవుతుంది.
- కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’ పోర్టల్ తో అనుసంధానం చేయడం వల్ల రాష్ట్రంలోని వాహనాల వివరాలు జాతీయ డేటాబేస్ లోకి వెళ్తాయి.
- ఫలితంగా వాహనాలకు సంబంధించిన అన్ని సేవలు ఆన్ లైన్ లోనే అందుబాటులోకి వస్తాయి. ఈ నిర్ణయంతో వాహనదారులకు గతంలో ఉన్న ఇబ్బందులు తప్పే అవకాశం ఉంటుంది.
- ప్రస్తుత విధానంతో వాహన ఓనర్ చిరునామా, పేరు మార్పు, వాహన RC డూప్లీకేట్ కాపీ వంటి సేవలు ఆన్ లైన్ లో అందుబాటులో లేవు. ఈ సేవల కోసం ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లాల్సి ఉండేది.
- వాహన్ పోర్టల్ అనుసంధానం ద్వారా…. ఈ తరహా సేవలన్నీ ఇక ఆన్‌లైన్‌లోకి వస్తాయి. ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా…. ఇంట్లో కూర్చుని ఆన్ లైన్ లో వాహనాలకు సంబంధించిన పనులను పూర్తి చేసుకునే వీలు ఉంటుంది.
- ఈ సరికొత్త విధానం అమలుతో రవాణా శాఖ రిజిస్ట్రేషన్లు, ఇతర సేవల విషయంలో దళారుల ప్రమేయం లేకుండానే పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు.
గత కొంత కాలంగా రవాణా శాఖలో తీసుకువస్తున్న కొత్త సంస్కరణల అమలు నేపథ్యంలో ఆర్టీవో కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్, క్యూ లైన్‌లో వెయిటింగ్, కార్డు కోసం తిప్పలు తప్పినట్లు అయింది. తాజాగా రెండో వాహనంపై వించే లైఫ్ ట్యాక్స్ రద్దు నిర్ణయంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

