భారతదేశం తన అస్తిత్వాన్ని, సార్వభౌమాధికారాన్ని చాటుకునే మరో చారిత్రాత్మక ఘట్టానికి సర్వం సిద్ధమైంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం దేశం ముస్తాబవుతోంది. 2026లో మన రాజ్యాంగం ఆమోదం పొంది 77వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో.. దేశ ప్రజలు గర్వంతో, దేశభక్తితో ఈరోజున 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. దిల్లీ వీధుల్లో జరిగే అద్భుతమైన పరేడ్, దేశవ్యాప్త సంబరాలు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

గణతంత్ర దినోత్సవం అనేది కేవలం ఒక జాతీయ వేడుక మాత్రమే కాదు.. 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమలులోకి వచ్చి, భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మార్చిన రోజుకు ఇది ఘనమైన నివాళి.
77వ గణతంత్ర దినోత్సవం: ప్రాముఖ్యత..
భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, మన సొంత రాజ్యాంగం పరిపాలన సాగించడం 1950 జనవరి 26 నుంచే ప్రారంభమైంది. ఇందుకు గుర్తుగా ప్రతియేటా దిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో ఉన్న 'కర్తవ్య పథ్' వేదికగా పరేడ్‌ను ఘనంగా నిర్వహిస్తారు. కోట్లాది మంది ఈ రిపబ్లిక్ డే పరేడ్‌ని భారతీయులు వీక్షిస్తారు. ఇది దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రజాస్వామ్య విలువలను, పురోగతిని గౌరవించడమే కాకుండా.. మన సైనిక పటిమను, వివిధ రాష్ట్రాల సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతుంది.
రిపబ్లిక్ డే 2026- దేశభక్తిని రగిలించే నినాదాలు..
మన స్వాతంత్ర్య సమరయోధుల మాటలు నేటికీ మనలో స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాయి. గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో వాటిల్లో కొన్నింటిని ఇక్కడ తెలుసుకోండి..
"స్వేచ్ఛ అనేది ఎవరూ ప్రసాదించేది కాదు.. దానిని మనమే సాధించుకోవాలి" - నేతాజీ సుభాష్ చంద్రబోస్.
"స్వరాజ్యం నా జన్మహక్కు.. దానిని నేను పొంది తీరుతాను" - బాలగంగాధర తిలక్.
{{/usCountry}}"స్వరాజ్యం నా జన్మహక్కు.. దానిని నేను పొంది తీరుతాను" - బాలగంగాధర తిలక్.
{{/usCountry}}"రాజ్యాంగం అనేది కేవలం న్యాయవాదుల పత్రం కాదు, అది మన జీవిత వాహనం," - డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్.
"ఒక దేశ సంస్కృతి ప్రజల హృదయాల్లో, వారి ఆత్మల్లో నివసిస్తుంది" - మహాత్మా గాంధీ.
"నిజమైన దేశభక్తి అంటే చట్టాన్ని గౌరవించడం, న్యాయం కోసం నిలబడటం."
"సమానత్వం, ఐక్యతను నమ్మే వారి హృదయాల్లోనే భారతదేశ స్వేచ్ఛ సజీవంగా ఉంటుంది."
'వందేమాతరం' థీమ్‌తో 2026 పరేడ్..
దేశంలోని అన్ని ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా గణతంత్ర దినోత్సవం పరేడ్‌లో శకటాల ప్రదర్శన ఉంటుంది. అయితే ఈ ఏడాది వేడుకలకు ఒక ప్రత్యేకమైన, కేంద్ర ఇతివృత్తం ఉంది. అదే.. 'వందేమాతరం'. ఈ జాతీయ గేయం రూపొంది 150 ఏళ్లు పూర్తికావడంతో ఈసారి రిపబ్లిక్ డేకి ఈ థీమ్‌ని నిర్ణయించారు.
అంతేకాదు, ఈ ఏడాది కర్తవ్య పథ్‌లో జరిగే వేడుకలు భారత సైనిక శక్తికి, సాంస్కృతిక వైవిధ్యానికి అద్దం పట్టనున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ పరేడ్‌కు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
రిపబ్లిక్ డే 2026- వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణలు..
పరేడ్ జరుగుతున్న సమయంలో, 1923లో తేజేంద్ర కుమార్ మిత్ర గీసిన 'వందేమాతరం' చిత్రాలను కర్తవ్య పథ్ పొడవునా వ్యూ-కట్టర్స్‌గా ప్రదర్శిస్తారు. ఇవి 1923 నాటి 'బందే మాతరం ఆల్బమ్'లో ప్రచురితమైన శ్లోకాల ఆధారంగా రూపొందించినవి. పరేడ్ ముగింపులో వందేమాతరం బ్యానర్‌ను ఆవిష్కరించడంతో పాటు రంగురంగుల బెలూన్లను గాలిలోకి వదులుతారు.
అంతేకాకుండా, ప్రధాన వేదిక ముందు ఉండే పూల అలంకరణలు, ఆహ్వాన పత్రికలు, పరేడ్ టిక్కెట్లపై కూడా ఈ థీమ్ ప్రతిబింబించేలా డిజైన్ చేశారు. పరేడ్ మధ్యలో వందేమాతరం విశిష్టతను తెలిపే వీడియోలను కూడా భారీ స్క్రీన్లపై ప్రదర్శిస్తారు. కేంద్ర సాంస్కృతిక శాఖ తరపున ప్రదర్శించే శకటం, ఈ జాతీయ గేయ ప్రస్థానాన్ని దృశ్యరూపంలో చూపిస్తూ, పూర్తి స్థాయి వందేమాతరం గీతాన్ని వినిపిస్తుంది.