OTT: రిపబ్లిక్ డే స్పెషల్- ఓటీటీలో గూస్ బంప్స్ తెప్పించే దేశభక్తి సినిమాలు- తప్పక చూడాల్సిన 5 మూవీస్- ఓ లుక్కేయండి
రిపబ్లిక్ డే వచ్చేస్తోంది. దేశమంతా సంబరాలకు సిద్ధమైంది. మరి ఈ నేపథ్యంలో ఈ లాంగ్ వీకెండ్ లో ఓటీటీలో గూస్ బంప్స్ తెప్పించే ఈ సినిమాలపై ఓ లుక్కేయండి. తప్పకుండా చూడాల్సిన దేశభక్తి చిత్రాలివి.
రిపబ్లిక్ డే సంబరాలకు దేశం సిద్ధమవుతోంది. జనవరి 26న ఇండియా మొత్తం ఈ జాతీయ పండగను జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ఓటీటీ లవర్స్ తప్పకుండా చూడాల్సిన ఈ 5 దేశభక్తి సినిమాలపై ఓ లుక్కేయండి. లాంగ్ వీకెండ్ లో ఈ గూస్ బంప్స్ తెప్పించే మూవీస్ ను డిజిటల్ స్ట్రీమింగ్ చేసేయండి.

లగాన్
అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో 2001లో వచ్చిన చారిత్రాత్మక స్పోర్ట్స్ డ్రామా లగాన్ మూవీ ఇండియాలో దేశభక్తి సినిమాలకు ఓ స్టాండర్డ్ క్రియేట్ చేసింది. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ప్రస్థానాన్ని ఈ సినిమా ప్రారంభించింది. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ వాళ్లు విధించిన భారీ 'లగాన్' (పన్నులు)కు వ్యతిరేకంగా మొత్తం సమాజాన్ని ఏకం చేసిన ఒక గ్రామ యువకుడిగా ఆమిర్ ఖాన్ లగాన్ లో నటించారు.
పన్నును మాఫీ చేసే ఒప్పందంలో భాగంగా అనుభవజ్ఞులైన బ్రిటిష్ క్రికెట్ జట్టుతో తలపడేందుకు అతను ఒక క్రికెట్ టీమ్ ను ఏర్పాడు చేసి మ్యాచ్ ఆడతాడు. లగాన్ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో ఇప్పటికీ ఈ మూవీ అదరగొడుతూనే ఉంది.
రంగ్ దే బసంతి
మరో ఆమిర్ ఖాన్ మూవీ రంగ్ దే బసంతి. రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో 2006లో వచ్చిన ఈ కల్ట్ చిత్రం ఇప్పటికీ అభిమానుల ఆదరణ పొందుతోంది. అవినీతి కారణంగా భారత వైమానిక దళ పైలట్ అయిన తమ స్నేహితుడు విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత న్యాయం కోసం పోరాడే గ్యాంగ్ కథతో ఈ మూవీ సాగుతుంది. ఈ చిత్రంలో ఆమిర్, సిద్ధార్థ్, కునాల్ కపూర్, అతుల్ కులకర్ణి, షర్మాన్ జోషి, సోహా అలీ ఖాన్, వహీదా రెహమాన్, ఆర్.మాధవన్ తదితరులు నటించారు. ఇది కూడా నెట్‌ఫ్లిక్స్ లో ఉంది.
చక్ దే ఇండియా
క్లైమాక్స్ లో గూస్ బంప్స్ తో సీట్ ఎడ్జ్ పై కూర్చొబెట్టే స్పోర్ట్స్ థ్రిల్లర్ చక్ దే ఇండియా. షిమిత్ అమిన్ దర్శకత్వంలో 2007లో వచ్చిన ఈ క్రీడా చిత్రం ఐకానిక్ మూవీగా నిలిచిపోయింది. ఇండియా యువ మహిళా హాకీ జట్టుకు కోచ్‌గా తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నించే ఒక మాజీ హాకీ ఆటగాడి కథనే చక్ దే ఇండియా. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీ ప్రైమ్ వీడియోలో ఉంది.
రాజీ
మెఘనా గుల్జార్ దర్శకత్వంలో 2018లో వచ్చిన ఈ ఎస్పియోనేజ్ (గూఢచారి) థ్రిల్లర్ దేశభక్తి సినిమాలకు మరో చిరునామాగా మారింది. కశ్మీరీ గూఢచారి కుమార్తె అయిన సీమత్ పాత్రలో అలియా భట్ నటించారు. పాకిస్తానీ సైన్యం భారతదేశానికి వ్యతిరేకంగా ప్లాన్ చేస్తున్న సైనిక కుట్రను గూఢచర్యం చేయడానికి ఆమె ఒక పాకిస్తానీ సైనికుడిని వివాహం చేసుకుంటుంది. విక్కీ కౌశల్, జైదీప్ అహ్లావత్, సోని రజ్దాన్ తదితరులు నటించిన రాజీ మూవవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
షేర్షా
విష్ణువర్ధన్ దర్శకత్వంలో 2021లో నేరుగా ప్రైమ్ వీడియోలో రిలీజైన్ దేశభక్తి మూవీ షేర్షా. ఈ బయోగ్రాఫికల్ డ్రామా డైరెక్టర్ గా విష్ణువర్ధన్ కు ఫస్ట్ సినిమా. ధర్మా ప్రొడక్షన్స్ సమర్పించిన ఈ చిత్రంలో కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్రలో సిద్ధార్థ్ మల్హోత్రా, అతని భార్య పాత్రలో కియారా అద్వానీ నటించారు.

E-Paper












