కాక్రోచ్ జనతా పార్టీ (CJP) డిజిటల్ వేదికగా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తదనంతర పరిణామాల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో మరో తీవ్రమైన అంశంపై ప్రచారం వేగంగా విస్తరిస్తోంది. 'రిజర్వేషన్ హఠావో ఆందోళన్' (RHA) పేరుతో కొద్దిరోజుల క్రితం ప్రారంభమైన ఒక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఏకంగా 55 లక్షల (5.5 మిలియన్లు) ఫాలోవర్ల మార్కును దాటేసింది.

reservationhataomovement అనే ఐడీతో నడుస్తున్న ఈ ఖాతాలో ఇప్పటివరకు 100కు పైగా పోస్టులను ఉంచారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ ఖాతా కేవలం భారత సైన్యం (Indian Army) అధికారిక ఖాతాను మాత్రమే ఫాలో అవుతోంది. తమకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, ఇది పూర్తిగా పౌరుల మద్దతుతో సాగుతున్న స్వచ్ఛంద ఉద్యమమని ఖాతా నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఈ ఉద్యమం వెనుక ఉన్న ముఖ్య సూత్రధారి ఎవరనేది ఇప్పటివరకు వెల్లడి కాలేదు.
'ప్రతిభకే ప్రాధాన్యం' - డిమాండ్లు ఏంటి?
బి.ఆర్. అంబేద్కర్ ఇచ్చిన "చదువుకో-పోరాడు-సమకూరు" (Educate-Agitate-Organize) పిలుపుతో పాటు "కులాలు వేరైనా మనుషులంతా ఒక్కటే, దేశ ప్రగతియే మా లక్ష్యం" అనే అర్థం వచ్చేలా ఉన్న వ్యాక్యాన్ని ప్రొఫైల్ వివరాల్లో చేర్చారు.
రిజర్వేషన్ల వ్యవస్థ వల్ల ప్రతిభ (Merit) తీవ్రంగా దెబ్బతింటోందని, సమాజంలో కుల వ్యత్యాసాలు మరింత పెరుగుతున్నాయని ఈ గ్రూప్ వాదిస్తోంది. పోటీతత్వం తగ్గడం వల్ల విద్యా ప్రమాణాల నాణ్యత పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ, కులానికి బదులుగా కేవలం ప్రతిభ ఆధారంగానే సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తోంది.
సమాజంలో కుల వివక్షను పూర్తిగా రూపుమాపడమే ప్రభుత్వ లక్ష్యమైతే, రోజువారీ అధికారిక లావాదేవీలలోనూ లేదా ప్రభుత్వ ప్రక్రియలలోనూ కుల గుర్తింపును అడగడం, గుర్తించడం తక్షణమే నిలిపివేయాలని ఉద్యమ నిర్వాహకులు తమ ప్రణాళికలో స్పష్టం చేశారు.
సీజేపీ, E20 జనతా పార్టీల వరుసలో..
ఇటీవల అభిజీత్ దిప్కే నేతృత్వంలో వ్యంగ్యాత్మకంగా ప్రారంభమైన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించింది. వివిధ పోటీ పరీక్షల్లో అక్రమాలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువత చేపట్టిన నిరసనలకు ఈ డిజిటల్ ఉద్యమమే వేదికగా నిలిచింది. ఆ నిరసనల పరిణామాల క్రమంలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
{{/usCountry}}ఇటీవల అభిజీత్ దిప్కే నేతృత్వంలో వ్యంగ్యాత్మకంగా ప్రారంభమైన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించింది. వివిధ పోటీ పరీక్షల్లో అక్రమాలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువత చేపట్టిన నిరసనలకు ఈ డిజిటల్ ఉద్యమమే వేదికగా నిలిచింది. ఆ నిరసనల పరిణామాల క్రమంలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
{{/usCountry}}అదే తరహాలో 'E20 జనతా పార్టీ' పేరిట మరో ఖాతా కూడా సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పర్యవేక్షణలో అమలవుతున్న 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఖాతా ప్రచారం నిర్వహిస్తోంది.
ముడిచమురు దిగుమతుల భారాన్ని తగ్గించడం, వాహన ఉద్గారాలను అదుపు చేయడం, చెరకు, జొన్న రైతులకు మెరుగైన ఆదాయం అందించడమే E20 లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అయితే పాత వాహనాలు ఈ ఇంధనానికి అనుకూలంగా ఉండవని, ఇంజిన్ మైలేజ్ తగ్గడంతో పాటు ఇథనాల్ తయారీకి ఎక్కువ నీటి వినియోగం అవసరమవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.