Rishabh Pant: మూడేళ్లుగా తిరుగుతున్నా, ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఇప్పించండి- సీఎంను అర్థరాత్రి వేడుకున్న రిషబ్ పంత్
Rishabh Pant Plea To CM Pushkar Singh Dhami: సొంతూరులో ఇల్లు కట్టుకునేందుకు భారత్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీని భూ సేకరణ విషయంలో సాయం కోరారు. మూడేళ్లుగా తిరుగుతున్నా సరైన ల్యాండ్ దొరకట్లేదని, కొనేందుకు అనుమతి అయినా ఇప్పించండని సీఎంను రిషబ్ పంత్ వేడుకున్నారు.
Rishabh Pant Plea To CM Pushkar Singh Dhami: భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన సొంతూరిపై ప్రేమను చాటుకున్నారు. ఢిల్లీలోని నివాసాన్ని ఖాళీ చేసి, తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో మొదటి ఇల్లు నిర్మించుకోవాలని భావిస్తున్నారు.

అర్థరాత్రి వేళ విజ్ఞప్తి
ఈ మేరకు స్థలం కొనుగోలుకు సాయం చేయాలంటూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి అర్థరాత్రి వేళ విజ్ఞప్తి చేశారు రిషబ్ బంత్. ప్రస్తుతం శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ కోసం లంకలో ఉన్న పంత్, సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకున్నారు.
మూడేళ్లుగా వెతుకుతున్నా.. కల నెరవేరడం లేదు!
గత మూడేళ్లుగా ఉత్తరాఖండ్‌లో సరైన స్థలం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఏదీ కొలిక్కి రావడం లేదని పంత్ తెలిపారు. ఈ విషయమై రాత్రి 12:46 గంటలకు సుదీర్ఘమైన పోస్ట్ చేస్తూ సీఎం ధామీకి ట్యాగ్ చేశారు.
ఉత్తరాఖండ్‌ను ఎంతో ప్రేమిస్తున్నా
"హలో సర్, ఎలా ఉన్నారు? సొంత రాష్ట్రం నుంచి వచ్చి చాలా కాలమైంది. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌కి నా నివాసాన్ని మార్చేందుకు స్థలం కొందామని మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా. కానీ ఇల్లు కట్టుకునేందుకు పెద్ద స్థలమేదీ దొరకడం లేదు. ప్రభుత్వం ఇస్తానన్న భూమి కూడా రాలేదు. నేను నా ఉత్తరాఖండ్‌ను ఎంతో ప్రేమిస్తున్నా. స్థల సేకరణలో దయచేసి నాకు సాయం చేయండి" అని రిషబ్ పంత్ కోరారు.
రాష్ట్ర అభివృద్ధికి సహాయపడాలని
భారత జట్టుకు ఏళ్లుగా ప్రాతినిధ్యం వహించిన తాను, ఇప్పుడు సొంత కొండ ప్రాంత (పహాడీ) ప్రజల వద్దకు తిరిగి వచ్చి, రాష్ట్ర అభివృద్ధికి సహాయపడాలని అనుకుంటున్నట్లు పంత్ రాసుకొచ్చారు.
గిఫ్ట్‌గా ఇస్తే సంతోషమే
ఇదే అంశంపై పంత్ మరొక ట్వీట్ చేస్తూ, తాను ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉచిత కానుకలు కోరడం లేదని స్పష్టం చేశారు. ఒక అంతర్జాతీయ క్రీడాకారుడిగా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినందుకు గిఫ్ట్‌గా ఇస్తే సంతోషమేనని, అయితే తాను మాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత ధర చెల్లించే స్థలాన్ని కొనుగోలు చేస్తానని చెప్పారు.
ప్రభుత్వ ధరల ప్రకారమే
"ప్రభుత్వ ధరల ప్రకారమే ఆ భూమిని కొనుగోలు చేయడానికి నాకు అనుమతివ్వండి. కనీసం నా సొంత రాష్ట్రంలో నా మొదటి ఇల్లు నిర్మించుకోవడానికి సహాయం చేయండి. నిజంగా ఇది ఎలా చేయాలో నాకు తోచడం లేదు" అని పంత్ ముఖ్యమంత్రిని వేడుకున్నారు.
మైదానంలో పంత్ పరిస్థితి ఏంటి?
మరోవైపు పంత్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నారు. ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు శ్రీలంక బోర్డు ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో పంత్ పాల్గొన్నారు. మొదటి రోజు వికెట్ కీపింగ్ చేసిన తర్వాత పంత్ మైదానాన్ని వీడగా, ధ్రువ్ జురెల్ కీపింగ్ బాధ్యతలు చేపట్టారు.
ఎలాంటి గాయం కాలేదని
ఉక్కపోత, తీవ్రమైన వేడి కారణంగా ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే క్రమంలోనే ఈ మార్పు చేశారని, పంత్‌కు ఎలాంటి గాయం కాలేదని టీమ్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. ఇక ఇటీవలి కాలంలో పంత్ కేవలం టెస్టు ఫార్మాట్‌కే పరిమితమవుతున్నారు.
వన్డేలు, టీ20ల నుంచి పక్కకు
ఇదిలా ఉంటే, పరిమిత ఓవర్ల ఫార్మాట్లు అయిన వన్డేలు, టీ20ల నుంచి సెలెక్టర్లు ఆయనను పక్కనబెట్టిన సంగతి తెలిసిందే.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


