రాంచీలో ఆదివారం (నవంబర్ 30) రికార్డులు బద్దలయ్యాయి. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ చెలరేగిపోయారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి సెంచరీతో రెచ్చిపోయాడు. సండే రాంచీలో దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో ఈ ఇద్దరు లెజెండ్స్ పరుగుల ఊచకోత కోశారు. కొన్ని రికార్డులను ఖాతాలో వేసుకున్నారు.
అత్యధిక మ్యాచ్ లు

భారత్ తరపున అత్యధిక మ్యాచ్ లాడిన క్రికెటర్ల జోడీగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రికార్డు నమోదు చేశారు. సౌతాఫ్రికాతో ఫస్ట్ వన్డే వీళ్లకు 392వ అంతర్జాతీయ మ్యాచ్. ఈ మ్యాచ్ తో సచిన్ టెండూల్కర్-రాహుల్ ద్రవిడ్ ల 391 అంతర్జాతీయ మ్యాచ్ ల రికార్డ్ ను రోకో బ్రేక్ చేశారు.
ద్రవిడ్-సచిన్ నుండి రో-కో వరకు...
చాలా సంవత్సరాలుగా టెండూల్కర్-ద్రవిడ్ ల భాగస్వామ్యం నిలకడ అసాధారణమైనదిగా భావించారు. వారు వివిధ ఫార్మాట్లలో, వివిధ కాలాలలో కలిసి ఆడారు. భారతదేశం తరపున 146 టెస్టులు, 245 వన్డేలు ఆడారు. రోహిత్-కోహ్లీ ల 392 మ్యాచ్ లు, చాలా భిన్నమైనవి. వీళ్లు 60 టెస్టులు, 226 వన్డేలు, 106 టీ20లు కలిసి ఆడారు.
52వ సెంచరీ
విరాట్ కోహ్లి వన్డేల్లో 52వ సెంచరీ అందుకున్నాడు. ఇప్పటికే వన్డేల్లో అత్యధిక శతకాల రికార్డు అతని ఖాతాలోనే ఉంది. ఒకే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు అతని ఖాతాలో చేరింది. ఈ మ్యాచ్ తో ఇండియాలో వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన ఆటగాడిగానూ కోహ్లి మరో హిస్టరీ క్రియేట్ చేశాడు. రాంచీలో అతను 102 బంతుల్లో ఫోర్ తో సెంచరీ అందుకున్నాడు.
రోహిత్ సిక్సర్లు
వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా రోహిత్ శర్మ రికార్డు సొంతం చేసుకున్నాడు. 38 ఏళ్ల రోహిత్ ఈ మ్యాచ్ లో షాహిద్ అఫ్రిది (351) రికార్డును బ్రేక్ చేశాడు. అఫ్రిది కంటే 100 ఇన్నింగ్స్ లు తక్కువే ఆడాడు రోహిత్. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో రోహిత్ 51 బంతుల్లో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. 5 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఇది రోహిత్ కు వరుసగా మూడో 50 ప్లస్ స్కోరు.
4, 6, 6, 4
{{/usCountry}}వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా రోహిత్ శర్మ రికార్డు సొంతం చేసుకున్నాడు. 38 ఏళ్ల రోహిత్ ఈ మ్యాచ్ లో షాహిద్ అఫ్రిది (351) రికార్డును బ్రేక్ చేశాడు. అఫ్రిది కంటే 100 ఇన్నింగ్స్ లు తక్కువే ఆడాడు రోహిత్. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో రోహిత్ 51 బంతుల్లో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. 5 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఇది రోహిత్ కు వరుసగా మూడో 50 ప్లస్ స్కోరు.
4, 6, 6, 4
{{/usCountry}}సెంచరీ తర్వాత విరాట్ కోహ్లి ఫుల్ బీస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. సుబ్రయెన్ బౌలింగ్ లో వరుసగా 4, 6, 6, 4 కొట్టాడు. చూస్తుండగానే అతని స్కోరు 130 దాటిపోయింది. 40 ఓవర్లకు టీమిండియా 264/4తో నిలిచింది.