టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళల టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ లకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. దిగ్గజ టెన్నిస్ ఆటగాడు విజయ్ అమర్ నాథ్ కు పద్మభూషణ్ అవార్డు వరించింది. హర్మన్‌ప్రీత్, రోహిత్ కంటే ముందు 40 మంది క్రికెటర్లు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. హర్మన్‌ప్రీత్ ఐసీసీ వరల్డ్ కప్ గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించింది. మరోవైపు రోహిత్ శర్మ 9 నెలల వ్యవధిలో రెండు ICC టైటిళ్లను భారత్ కు అందించాడు.
రోహిత్ శర్మకు పద్మశ్రీ

క్రీజులో నిలబడితే చాలు పరుగుల తుపాను సృష్టించే రోహిత్ శర్మకు అరుదైన ఘనత దక్కింది. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు పద్మశ్రీ పురస్కారం వరించింది. ఇండియన్ క్రికెట్ కు చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం హిట్ మ్యాన్ ను పద్మ శ్రీ పురస్కారంతో గుర్తించింది. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలను ఆదివారం (జనవరి 25) ప్రకటించింది.
రోహిత్ స్టాట్స్
రోహిత్ శర్మ 67 టెస్టుల్లో 4301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక వన్డేల్లో రోహిత్ రికార్డు ఘనంగా ఉంది. వన్డేల్లో 282 మ్యాచుల్లో 11577 రన్స్ చేశాడు. ఇందులో 33 సెంచరీలు, 61 ఫిఫ్టీస్ ఉన్నాయి. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ రోహిత్ మాత్రమే. ఇక టీ20ల పరంగా చూసుకుంటే రోహిత్ శర్మ 159 మ్యాచుల్లో 4231 రన్స్ చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
కెప్టెన్ గా
కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డు కూడా ఘనంగా ఉంది. హిట్ మ్యాన్ కెప్టెన్సీ లో టీమిండియా 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచింది. 2007 తర్వాత ఇండియా టీం టీ20 వరల్డ్ కప్ గెలవడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ ప్రపంచ కప్ తర్వాత టీ20 ఫార్మాట్ కి రోహిత్ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. 2025 లో ఛాంపియన్స్ ట్రోఫీ లోనూ రోహిత్ కెప్టెన్సీ లో ఇండియా విజేతగా నిలిచింది.
లాస్ట్ ఇయర్ రోహిత్ శర్మ టెస్టులకు కూడా వీడ్కోలు పలికాడు. ఇప్పుడు హిట్ మ్యాన్ కేవలం వన్డేల్లోనే ఆడుతున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ పై ఫోకస్ పెట్టాడు రోహిత్ శర్మ. ఇప్పుడు ఇండియా క్రికెట్ కి రోహిత్ చేసిన సేవలకు ఇప్పుడు పద్మ శ్రీ లభించింది.
ఫస్ట్ కెప్టెన్
{{/usCountry}}లాస్ట్ ఇయర్ రోహిత్ శర్మ టెస్టులకు కూడా వీడ్కోలు పలికాడు. ఇప్పుడు హిట్ మ్యాన్ కేవలం వన్డేల్లోనే ఆడుతున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ పై ఫోకస్ పెట్టాడు రోహిత్ శర్మ. ఇప్పుడు ఇండియా క్రికెట్ కి రోహిత్ చేసిన సేవలకు ఇప్పుడు పద్మ శ్రీ లభించింది.
ఫస్ట్ కెప్టెన్
{{/usCountry}}ఇండియన్ మహిళల క్రికెట్ టీమ్ కు మొట్టమొదటి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ నిలిచింది. ఆమె కెప్టెన్సీలోని ఇండియా 2025 టీ20 ప్రపంచకప్ ను సొంతం చేసుకుంది.హర్మన్ 6 టెస్టుల్లో 200 రన్స్ చేసింది. 161 వన్డేల్లో 4409 పరుగులు రాబట్టింది. ఇందులో 7 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక 187 టీ20ల్లో 3784 పరుగులు సాధించింది. ఇందులో ఓ సెంచరీ, 15 ఫిఫ్టీస్ నమోదు చేసింది.
| Name | Field | Award |
|---|---|---|
| Vijay Amritraj | Tennis | Padma Bhushan |
| Baldev Singh | Hockey | Padma Shri |
| Bhagwandas Raikwar | Martial Arts | Padma Shri |
| Harmanpreet Kaur | Cricket | Padma Shri |
| K Pajanivel | Martial Arts | Padma Shri |
| Praveen Kumar | Para-sports | Padma Shri |
| Rohit Sharma | Cricket | Padma Shri |
| Savita Punia | Hockey | Padma Shri |
| Vladimer Mestvirishvili | Wrestling | Padma Shri |