కోహ్లి డకౌట్.. పోరాడిన రోహిత్, శ్రేయస్, అక్షర్.. రెండో వన్డేలో టీమిండియా ఎంత స్కోరు చేసిందంటే?

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో టీమిండియా బ్యాటింగ్ లో మరోసారి తడబడ్డా పోరాడే స్కోరు సాధించింది. గురువారం జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఫైటింగ్ తో టీమ్ ఓ మోస్తారు స్కోరు చేసింది. విరాట్ కోహ్లి మళ్లీ డకౌటయ్యాడు. 

Published on: Oct 23, 2025, 12:56:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆస్ట్రేలియాతో వన్డేలో టీమిండియా మరోసారి బ్యాటింగ్ లో ఫెయిలైంది. కానీ ఈ సారి కాస్త పోరాడే స్కోరు సాధించింది. గురువారం (అక్టోబర్ 23) అడిలైడ్ లో జరుగుతున్న వన్డే లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 264 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (97 బంతుల్లో 73; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (77 బంతుల్లో 61; 7 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో పోరాడారు.

శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ (AFP)
శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ (AFP)

విరాట్ అదే సీన్

భారత్ తో రెండో వన్డేలోనూ ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. ఆ టీమ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. తొలి వన్డేలో సున్నాకే పెవిలియన్ చేరిన విరాట్ కోహ్లి మరోసారి డకౌటయ్యాడు. బార్లెట్ ఒకే ఓవర్లో కెప్టెన్ శుభ్ మన్ (9)తో పాటు కోహ్లి (0)ని ఔట్ చేశాడు. 17కే రెండు వికెట్లు పడ్డాయి. దీంతో మరోసారి ఇండియా కుప్పకూలుతుందేమో అనిపించింది.

రోహిత్, శ్రేయస్ కలిసి

విరాట్ కోహ్లిలాగే టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికి వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత చాలా ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడేందుకు చాలా గ్యాప్ వచ్చింది. ఫస్ట్ వన్డేలో రోహిత్ ఫెయిలయ్యాడు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం శ్రేయస్ అయ్యర్ (61)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు రోహిత్.

118 భాగస్వామ్యం

టపటపా రెండు వికెట్లు పడ్డా రోహిత్, శ్రేయస్ కలిసి టీమిండియాను ఆదుకున్నారు. రెండో వికెట్ కు 118 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఓ దశలో 135/2తో ఇండియా పటిష్ఠంగా కనిపించింది. అయితే రోహిత్, శ్రేయస్ స్వల్ప వ్యవధిలో ఔటైపోయారు. ఆ దశలో ఓ ఎండ్ లో అక్షర్ పటేల్ (44) పోరాడాడు.

వీళ్లు కూడా

కేఎల్ రాహుల్ (11), వాషింగ్టన్ సుందర్ (12), నితీశ్ కుమార్ రెడ్డి (8) ఫెయిల్ అయ్యారు. టీమ్ స్కోరు 220 దాటాక అక్షర్ ఔటయ్యాడు. హర్షిత్ రాణా (22), అర్ష్ దీప్ (13) కలిసి ఇండియా స్కోరును 260 దాటించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు వికెట్లు, జేవియర్ బార్లెట్ 3 వికెట్లు పడగొట్టారు.

బ్యాటింగ్ లో తడబడ్డా ఓవరాల్ గా చూస్తే టీమిండియా పోరాడే స్కోరే సాధించింది. మరి ఆసీస్ బ్యాటర్లకు మన బౌలర్లు బ్రేక్ వేస్తారా? లేదా మరో ఓటమి మూట గట్టుకుంటారా? అన్నది చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More