దిగ్గజ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి తక్కువ ధరలో, అదిరిపోయే మైలేజీ ఇచ్చే సరికొత్త మోడల్ రాబోతోంది! గతేడాది వార్తల్లో నిలిచి, ఆ తర్వాత కేవలం పుకారుగానే మిగిలిపోయిందనుకున్న '250సీసీ హైబ్రిడ్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కింది. మీడియా నివేదిక ప్రకారం, రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ఈ ఎంట్రీ-లెవల్ బైక్‌ను 2027-28 ఆర్థిక సంవత్సరంలో భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. హంటర్ 350 కంటే తక్కువ స్థానంలో నిలిచే ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.20 లక్షల స్థాయిలో ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ల ధరలు రూ. 2 లక్షల మార్కును దాటడం, మైలేజీ లీటరుకు 30 నుంచి 35 కిలోమీటర్లకే పరిమితం కావడంతో సాధారణ మధ్యతరగతి ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు వెనకడుగు వేస్తున్నారు. రోజువారీ ఆఫీసు ప్రయాణాలకు అనువుగా 50 కిలోమీటర్లకు పైగా మైలేజీ, అందుబాటు ధరలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వస్తే మార్కెట్లో సంచలనం సృష్టించడం ఖాయం.
ఈ నేపథ్యంలో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ 250సీసీ హైబ్రిడ్ బైక్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
రాయల్ ఎన్ఫీల్డ్ 250సీసీ హైబ్రిడ్ బైక్- యువతే టార్గెట్!
గతేడాది చైనాకు చెందిన ‘సీఎఫ్మోటో’ సంస్థ నుంచి 250సీసీ ఇంజిన్‌ను సేకరించి రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త హైబ్రిడ్ బైక్ తెస్తోందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఎలాంటి వార్తలు లేకపోవడంతో అదంతా మీడియా సృష్టించిన పుకారు మాత్రమేనని భావించారు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు తిరిగి జోరందుకుంది. సాధారణ 100సీసీ, 150సీసీ కమ్యూటర్ బైక్‌ల నుంచి శక్తిమంతమైన బైక్‌లకు మారాలనుకునే యువ కొనుగోలుదారులను ఆకర్షించడంపై సంస్థ ప్రధానంగా దృష్టి పెట్టింది. పెరుగుతున్న ఆకాంక్షలు, సులభమైన ఫైనాన్స్ సదుపాయాల వల్ల నేడు 250సీసీ బైక్ కొనడం యువతకు మరింత సులభమైంది.
"గత ఐదేళ్లలో మిడ్-వెయిట్ మోటార్ సైకిల్ మార్కెట్ (250 సీసీ నుంచి 800 సీసీ వరకు) 5.50 లక్షల యూనిట్ల స్థాయి నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 12.7 లక్షల యూనిట్లకు పైగా ఎగబాకింది. వినియోగదారుల ఆకాంక్షలు భారీగా పెరుగుతున్నాయి. భారతీయ కొనుగోలుదారులు ఇకపై సాధారణ ప్రాథమిక బైక్‌లను కోరుకోవడం లేదు. దేశంలో కమ్యూటర్ బైక్ విభాగం నుంచి అప్‌గ్రేడ్ అవుతున్న ఈ భారీ వినియోగదారుల వర్గాన్ని తమ కొత్త ప్లాట్‌ఫామ్‌తో ఆకట్టుకోవాలని రాయల్ ఎన్ఫీల్డ్ చూస్తోంది," అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి.
50 కి.మీ. పైగా మైలేజీ.. బీఎస్7 నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్!
{{/usCountry}}"గత ఐదేళ్లలో మిడ్-వెయిట్ మోటార్ సైకిల్ మార్కెట్ (250 సీసీ నుంచి 800 సీసీ వరకు) 5.50 లక్షల యూనిట్ల స్థాయి నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 12.7 లక్షల యూనిట్లకు పైగా ఎగబాకింది. వినియోగదారుల ఆకాంక్షలు భారీగా పెరుగుతున్నాయి. భారతీయ కొనుగోలుదారులు ఇకపై సాధారణ ప్రాథమిక బైక్‌లను కోరుకోవడం లేదు. దేశంలో కమ్యూటర్ బైక్ విభాగం నుంచి అప్‌గ్రేడ్ అవుతున్న ఈ భారీ వినియోగదారుల వర్గాన్ని తమ కొత్త ప్లాట్‌ఫామ్‌తో ఆకట్టుకోవాలని రాయల్ ఎన్ఫీల్డ్ చూస్తోంది," అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి.
50 కి.మీ. పైగా మైలేజీ.. బీఎస్7 నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్!
{{/usCountry}}భవిష్యత్ ఉత్పత్తుల ప్రణాళికలపై స్పందించడానికి రాయల్ ఎన్ఫీల్డ్ అధికారికంగా నిరాకరించింది. అయితే ఈ 250సీసీ హైబ్రిడ్ మోడల్ ద్వారా దేశీయ మోటార్ సైకిల్ మార్కెట్లో తమ వాటాను మూడు రెట్లు పెంచుకోవాలనే మధ్యకాలిక, దీర్ఘకాలిక వ్యూహంతో సంస్థ పనిచేస్తోంది. హైబ్రిడ్ టెక్నాలజీ సాయంతో ఈ కొత్త 250సీసీ బైక్ లీటరుకు 50 కిలోమీటర్లకు పైగా మైలేజీని అందిస్తుందని అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో అమల్లోకి రానున్న కఠినమైన బీఎస్7 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు సైతం తట్టుకునేలా ఈ ఇంజిన్‌ను రూపొందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో భారీ ప్లాంట్.. 24 లక్షల బైక్‌ల ఉత్పత్తి లక్ష్యం!
కొత్త మోడళ్లను ఆటంకం లేకుండా మార్కెట్లోకి విడుదల చేసేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ తన తయారీ సామర్థ్యాన్ని యుద్ధప్రాతిపదికన విస్తరిస్తోంది. ప్రస్తుతం చెన్నైలోని ఉత్పత్తి కేంద్రం ఏటా 15 లక్షల మోటార్ సైకిళ్లను తయారు చేయగలదు. ఈ సామర్థ్యాన్ని 20 లక్షల యూనిట్లకు పెంచడానికి సంస్థ రూ. 958 కోట్లు పెట్టుబడి పెడుతోంది. క్లాసిక్ 350, బుల్లెట్ 350, హిమాలయన్ 450, హంటర్ 350, ఫ్లయింగ్ ఫ్లీ సీ6, సూపర్ మీటియర్ 650, షాట్‌గన్ 650, గొరిల్లా 450 వంటి ప్రజాదరణ పొందిన మోడళ్లన్నీ ఇక్కడే తయారవుతున్నాయి.
వీటికి తోడు ఆంధ్రప్రదేశ్‌లో 230 మిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో రాయల్ ఎన్ఫీల్డ్ సరికొత్త తయారీ కర్మాగారాన్ని ప్రారంభిస్తోంది. 2032 నాటికి ఈ ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాక, ఏటా 9 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం దీనికి ఉంటుంది. చెన్నై, ఆంధ్రప్రదేశ్ ప్లాంట్లు కలిపితే రాయల్ ఎన్ఫీల్డ్ మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 24 లక్షల మోటార్ సైకిళ్లకు చేరుకుంటుంది. తక్కువ ధర, అధిక మైలేజీతో రానున్న 250సీసీ హైబ్రిడ్ బైక్ దేశీయ ద్విచక్ర వాహన రంగంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.