రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కి బిగ్ అప్డేట్! సరికొత్త హిమాలయన్ 750 బైక్ వచ్చేసింది. గోవాలో జరుగుతున్న మోటోవర్స్ 2026 ఈవెంట్లో సంస్థ ఈ బైక్‌ని విడుదల చేసింది. బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 4,89,490గా నిర్ణయించారు. ట్యూబ్‌లెస్ స్పోక్ వేరియంట్ ధర రూ. 5,13,495 కాగా, పూర్తి యాక్సెసరీలతో వచ్చే వెర్షన్ ధర రూ. 6.29 లక్షలుగా ఉంది.

మిలన్‌లో జరిగిన ఈఐసీఎంఏ 2026 ప్రదర్శనలో తొలుత చూపించిన ఈ అడ్వెంచర్ బైక్‌తో కంపెనీ 750సీసీ విభాగంలోకి అడుగుపెట్టింది. కొత్త 743సీసీ ఎయిర్-ఆయిల్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజిన్, మెరుగైన సస్పెన్షన్, అధునాతన రైడర్ ఎయిడ్స్, టూరింగ్ హంగులతో దీన్ని తీర్చిదిద్దారు. పదేళ్ల హిమాలయన్ వారసత్వాన్ని కొనసాగిస్తూనే, అడ్వెంచర్ టూరింగ్ అనుభవాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా దీన్ని రూపొందించారు.
ఈ నేపథ్యంలో ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750 బైక్ విశేషాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750- ఇంజిన్..
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750 బైక్‌కు కొత్త 743సీసీ, ఎయిర్-ఆయిల్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్ శక్తినిస్తుంది. ఇది 7,000 ఆర్‌పీఎం వద్ద 55 పీఎస్ పవర్‌ను, 5,000 ఆర్‌పీఎం వద్ద 63 ఎన్ఎమ్ గరిష్ఠ టార్క్‌ను అందిస్తుంది. 3,500 ఆర్‌పీఎం వద్దే 90 శాతం టార్క్ అందుబాటులోకి వస్తుంది. ఆరు స్పీడ్ గేర్‌బాక్స్, వెట్ మల్టీ-ప్లేట్ క్లచ్‌తో ఈ ఇంజిన్ పనిచేస్తుంది.
హైవేలపై వేగంగా ప్రయాణించడానికి, కఠినమైన రహదారులపై సాగేందుకు ఈ ఇంజిన్ మెరుగైన పనితీరు ఇస్తుందని అంచనాలు ఉన్నాయి. ఇక బాక్స్-సెక్షన్ స్పైన్ ఫ్రేమ్, ప్రెస్డ్-స్టీల్ అవుట్‌రిగ్గర్లతో దీన్ని నిర్మించారు. ఇందులో ఇంజిన్ కూడా నిర్మాణంలో కీలక భాగంగా పనిచేస్తుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750- సస్పెన్షన్, బ్రేకింగ్..
ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ ముందు భాగంలో అడ్జస్టబుల్ డ్యాంపింగ్, కంప్రెషన్, రీబౌండ్‌తో కూడిన 43ఎంఎం షోవా అప్‌సైడ్-డౌన్ ఫోర్కులు ఉన్నాయి; ముందు వీల్ ట్రావెల్ 190ఎంఎం కాగా, వెనుక షోవా మోనోషాక్కు లింకేజ్‌తో పాటు 175ఎంఎం ట్రావెల్, అడ్జస్టబుల్ ప్రీలోడ్, రీబౌండ్ సదుపాయం కల్పించారు. ముందు వైపు జంట 280ఎంఎం ఫ్లోటింగ్ డిస్క్‌లు, వెనుక 255ఎంఎం డిస్క్ బ్రేక్‌లు ఇచ్చారు. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ (వెనుక ఏబీఎస్ స్విచబుల్), కార్నరింగ్ ఏబీఎస్, లీన్-సెన్సిటివ్ ట్రాక్షన్ కంట్రోల్ భద్రతను పెంచుతాయి.
{{/usCountry}}ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ ముందు భాగంలో అడ్జస్టబుల్ డ్యాంపింగ్, కంప్రెషన్, రీబౌండ్‌తో కూడిన 43ఎంఎం షోవా అప్‌సైడ్-డౌన్ ఫోర్కులు ఉన్నాయి; ముందు వీల్ ట్రావెల్ 190ఎంఎం కాగా, వెనుక షోవా మోనోషాక్కు లింకేజ్‌తో పాటు 175ఎంఎం ట్రావెల్, అడ్జస్టబుల్ ప్రీలోడ్, రీబౌండ్ సదుపాయం కల్పించారు. ముందు వైపు జంట 280ఎంఎం ఫ్లోటింగ్ డిస్క్‌లు, వెనుక 255ఎంఎం డిస్క్ బ్రేక్‌లు ఇచ్చారు. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ (వెనుక ఏబీఎస్ స్విచబుల్), కార్నరింగ్ ఏబీఎస్, లీన్-సెన్సిటివ్ ట్రాక్షన్ కంట్రోల్ భద్రతను పెంచుతాయి.
{{/usCountry}}ముందు 19-అంగుళాలు, వెనుక 17-అంగుళాల వీల్స్‌పై ట్యూబ్‌లెస్ టైర్లతో ఇది వస్తోంది. కాస్ట్-అల్లాయ్, స్పోక్డ్ వీల్ ఆప్షన్లతో పాటు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ను అన్నింటిలో ప్రామాణికంగా అందించారు.
రోడ్, రోడ్ స్పోర్ట్, రెయిన్, ట్రయల్, కస్టమ్ అనే ఐదు రైడింగ్ మోడ్‌లు ఇందులో ఉన్నాయి. వివిధ రహదారి పరిస్థితులకు అనుగుణంగా ఇవి ఇంజిన్ మ్యాపింగ్, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ సెట్టింగ్‌లను మారుస్తాయి. కస్టమ్ మోడ్‌లో థ్రాటిల్ మ్యాప్‌లు, ఏబీఎస్‌ను రైడర్ తనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్‌ను లో, మీడియం, హై, ఆఫ్ స్థాయిల్లో సెట్ చేసుకోవచ్చు. సిక్స్-యాక్సిస్ ఇనర్షియల్ మెజర్‌మెంట్ యూనిట్, క్రూయిజ్ కంట్రోల్, వై-ఫై-బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 4-అంగుళాల టీఎఫ్‌టీ కన్సోల్, నావిగేషన్, ఫోన్-మ్యూజిక్ నియంత్రణలు ఇందులో ఉన్నాయి.
4జీ కనెక్టివిటీ, జీపీఎస్‌తో పనిచేసే రాయల్ ఎన్‌ఫీల్డ్ వింగ్‌మ్యాన్ 2.0, 7-అంగుళాల ఎల్ఈడీ హెడ్‌లైట్, సెల్ఫ్-క్యాన్సలింగ్ టర్న్ ఇండికేటర్లు, ఎమర్జెన్సీ బ్రేక్ ల్యాంప్, 27డబ్ల్యూ, 10డబ్ల్యూ టైప్-సీ యూఎస్‌బీ పోర్ట్‌లను కూడా ఈ హిమాలయన్ 750 బైక్‌లో చేర్చారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750- డిజైన్, కలర్స్..
సుదూర ప్రయాణాల కోసం ఐదు స్థానాలలో, 60ఎంఎం వరకు సర్దుబాటు చేసుకునే విండ్‌స్క్రీన్‌ని ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750 అడ్వెంచర్ టూరర్‌లో ఇచ్చారు. బండి ఆపకుండానే గాలి రక్షణను మార్చుకోవచ్చు. విడివిడిగా ఉండే రైడర్, పిలియన్ సీట్లు ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేస్తాయి. సీటు ఎత్తు 815ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 205ఎంఎం, వీల్‌బేస్ 1,522ఎంఎం కాగా, 90 శాతం ఇంధనం-ఆయిల్‌తో బైక్ బరువు 224 కిలోలుగా ఉంది. 17.8 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 194 కిలోల పేలోడ్ సామర్థ్యంతో ఇది వస్తోంది.
ఎత్తైన విండ్‌స్క్రీన్, నిటారుగా ఉండే రైడింగ్ భంగిమ, ఎత్తులో అమర్చిన ముందు భాగం, మలచిన ఫ్యూయల్ ట్యాంక్‌తో అడ్వెంచర్ బైక్ తీరును నిలుపుకుంది. కొత్త ఎల్ఈడీ లైటింగ్, ప్రత్యేకమైన ఫ్రంట్ ఫేషియా, కొత్త బాడీవర్క్ ఆకట్టుకుంటాయి. అంటార్కిటిక్ సిల్వర్, సైబీరియా వైట్, అజ్టెక్ గ్రీన్, వైకింగ్ బ్రాంజ్, టెక్టోనిక్ బ్లాక్ రంగుల్లో ఇది లభిస్తుంది. గివి ప్యానియర్లు, టాప్ బాక్స్, హీటెడ్ గ్రిప్స్, హ్యాండ్ గార్డ్స్, అల్యూమినియం సంప్ గార్డ్ వంటి యాక్సెసరీలను కూడా ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750లో కంపెనీ అందుబాటులో ఉంచింది.
ABOUT THE AUTHOR
శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.