RRB NTPC Answer Key 2026 : ఆర్‌ఆర్బీ ఎన్‌టీపీసీ ఆన్సర్ కీ ఎప్పుడు వస్తుంది? ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్‌ఆర్బీ) ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. మార్చి 27న ముగిసిన ఈ పరీక్షల తదుపరి ఘట్టం 'ఆన్సర్ కీ' విడుదల కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఆన్సర్ కీ ఎప్పుడు విడుదల అవుతుంది? ఎలా చెక్ చేసుకోవాలి? పూర్తి వివరాలు..
దేశవ్యాప్తంగా రైల్వే శాఖలోని గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన 'ఆర్‌ఆర్బీ ఎన్‌టీపీసీ సీబీటీ 1 (సీఈఎన్ 06/2025)' పరీక్షలు ముగిశాయి. మార్చి 27, 2026తో ఈ పరీక్షా ప్రక్రియ విజయవంతంగా పూర్తి కావడంతో, ఇప్పుడు అభ్యర్థులందరూ ‘ఆన్సర్ కీ’ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఆన్సర్ కీ ద్వారా అభ్యర్థులు తాము రాసిన సమాధానాలను సరిచూసుకోవడమే కాకుండా, అధికారిక ఫలితాలు రాకముందే తమ స్కోరుపై ఒక అంచనాకు రావొచ్చు.

ఆర్‌ఆర్బీ ఎన్‌టీపీసీ ఆన్సర్ కీ 2026 విడుదల తేదీ (అంచనా)..
గత రిక్రూట్‌మెంట్ సరళిని పరిశీలిస్తే, ఆర్‌ఆర్బీ సాధారణంగా పరీక్ష ముగిసిన 4 నుంచి 7 రోజుల్లోపు ఆన్సర్ కీని విడుదల చేస్తోంది. ఆ లెక్కన చూస్తే, మార్చి 31 నుంచి ఏప్రిల్ 3, 2026 మధ్య ఆన్సర్ కీ వెలువడే అవకాశం ఉంది.
ఆర్‌ఆర్బీ ఎన్‌టీపీసీ ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
అభ్యర్థులు తమ రీజినల్ ఆర్‌ఆర్బీ వెబ్‌సైట్ల నుంచి లాగిన్ వివరాలను ఉపయోగించి కీని పొందవచ్చు. ఇందులో మీ క్వశ్చన్ పేపర్, రెస్పాన్స్ షీట్, ఆన్సర్ కీ అన్నీ కలిపి ఉంటాయి.
స్టెప్ 1- మొదట అధికారిక ఆర్‌ఆర్బీ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
స్టెప్ 2- హోమ్ పేజీలో కనిపించే “RRB NTPC Answer Key 2026” లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3- మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయండి.
స్టెప్ 4- సబ్మిట్ బటన్ నొక్కగానే మీ ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
స్టెప్ 5- దానిని డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరుచుకోండి.
ఆర్‌ఆర్బీ ఎన్‌టీపీసీ మార్కింగ్ విధానం 2026..
మీ స్కోరును ఖచ్చితంగా లెక్కించుకోవడానికి ఈ కింది ఫార్మాలు పాటించండి:
సరైన సమాధానం: +1 మార్కు
తప్పుడు సమాధానం: -0.33 మార్కు (నెగటివ్ మార్కింగ్)
ప్రయత్నించని ప్రశ్నలు: 0 మార్కులు
స్కోరు లెక్కింపు ఫార్ములా : Total Score = (Correct × 1) – (Wrong × 1/3)
గమనిక: తుది ఫలితాలను ప్రకటించే సమయంలో ‘నార్మలైజేషన్’ ప్రక్రియను అనుసరిస్తారు.
అభ్యంతరాల స్వీకరణ..
ఆన్సర్ కీ విడుదలైన తర్వాత, ఏదైనా సమాధానం తప్పుగా ఉందని మీరు భావిస్తే బోర్డుకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. నిర్ణీత గడువులోపు, అవసరమైన రుసుము చెల్లించి మీ అభ్యంతరాలను సమర్పించవచ్చు. ఆ ఫిర్యాదులను నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాత ‘తుది ఆన్సర్ కీ’ విడుదల చేస్తారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


