ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే యువతకు భారతీయ రైల్వే అద్భుతమైన అవకాశం కల్పించింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన రైల్వే శాఖలో నాన్-టెక్నికల్ పాపులర్ క్యాటగిరీస్ (NTPC–గ్రాడ్యుయేట్) కింద 3,548 ఖాళీల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (RRBs) సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ (CEN) విడుదల చేశాయి. కమర్షియల్ సేవలు, రైలు ఆపరేషన్లు, అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ విభాగాలలో ఈ నియామకాలు జరగనున్నాయి.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు

రైల్వే శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం నాలుగు ప్రధాన విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు:
- చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్: 127 పోస్టులు
- గూడ్స్ ట్రైన్ మేనేజర్: 2,750 పోస్టులు
- జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 300 పోస్టులు
- సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 371 పోస్టులు
వేతన శ్రేణి వివరాలు
7వ కేంద్ర వేతన సంఘం (7th CPC) నిబంధనల ప్రకారం అభ్యర్థులకు ఆరంభ బేసిక్ పే చెల్లిస్తారు. దీనితో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు వర్తిస్తాయి.
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్: పే లెవెల్ 6 కింద నెలకు రూ.35,400 ఆరంభ బేసిక్ పే లభిస్తుంది.
గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్, సీనియర్ క్లర్క్ పోస్టులు: పే లెవెల్ 5 కింద నెలకు రూ.29,200 ఆరంభ బేసిక్ పే అందుతుంది.
అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు తేదీలు
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయోపరిమితి: 2027 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తులు: దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 2026 నవంబర్ 6 రాత్రి 11:59 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
{{/usCountry}}ఆన్లైన్ దరఖాస్తులు: దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 2026 నవంబర్ 6 రాత్రి 11:59 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
{{/usCountry}}పరీక్ష రుసుము చెల్లింపు: 2026 నవంబర్ 8 వరకు ఫీజు చెల్లించవచ్చు.
దరఖాస్తు సవరణలు (కనెక్షన్ విండో): 2026 నవంబర్ 9 నుంచి 18 వరకు మార్పులు చేసుకునే అవకాశం కల్పించారు.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT-1, CBT-2) ఉంటాయి. ఆ తర్వాత సర్టిఫికెట్ల పరిశీలన (Document Verification), వైద్య పరీక్షలు (Medical Examination) నిర్వహిస్తారు. మెరిట్, అర్హతల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. Divyang (PwBD) అభ్యర్థులకు నిబంధనల ప్రకారం స్క్రైబ్ సదుపాయం, అదనపు సమయం కల్పిస్తారు.
(ముఖ్యమైన గమనిక: జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత టైపింగ్ స్కిల్ టెస్ట్ (CBTST) నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే, అభ్యర్థులకు ప్రాథమిక కంప్యూటర్, టైపింగ్ పరిజ్ఞానం ఉండాలి. ఉద్యోగంలో చేరిన తర్వాత దీనిని పరిశీలిస్తారు. పూర్తి వివరాల కోసం ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.)