...
...
Next Story

ఆస్ట్రేలియాలో సాయి పేరెంటరల్స్ భారీ ఒప్పందం: రూ.204 కోట్ల డీల్ రెన్యూవల్

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ సాయి పేరెంటరల్స్ లిమిటెడ్ ఆస్ట్రేలియా మార్కెట్లో మరో కీలక విజయం సాధించింది. కంపెనీ ఆస్ట్రేలియా అనుబంధ సంస్థ 'నూమెడ్ ఫార్మాస్యూటికల్స్', అక్కడి అగ్రగామి ఫార్మసీ చైన్‌తో 3 ఏళ్ల కాలపరిమితి కలిగిన రూ. 204 కోట్ల ఓటీసీ మందుల సరఫరా ఒప్పందాన్ని పునరుద్ధరించుకుంది.

Published on: Aug 25, 2026, 20:41:50 IST
Advertisement

హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సీడీఎమ్‌ఓ (CDMO), బ్రాండెడ్ జెనెరిక్స్ సంస్థ సాయి పేరెంటరల్స్ లిమిటెడ్ అంతర్జాతీయ మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంది. ఆస్ట్రేలియాలోని కంపెనీ అనుబంధ సంస్థ 'నూమెడ్ ఫార్మాస్యూటికల్స్ పిటివై లిమిటెడ్', ఆస్ట్రేలియాకు చెందిన మల్టీ-బిలియన్ డాలర్ల దిగ్గజ ఫార్మసీ చైన్‌తో తన ఓటీసీ (OTC) మందుల సరఫరా ఒప్పందాన్ని పునరుద్ధరించుకున్నట్లు ప్రకటించింది.

రూ. 204 కోట్ల విలువైన ఒప్పందం వివరాలు

ఆస్ట్రేలియాలో సాయి పేరెంటరల్స్ భారీ ఒప్పందం: రూ.204 కోట్ల డీల్ రెన్యూవల్
ఆస్ట్రేలియాలో సాయి పేరెంటరల్స్ భారీ ఒప్పందం: రూ.204 కోట్ల డీల్ రెన్యూవల్

ఈ నూతన ఒప్పందం తక్షణమే అమలులోకి వస్తుంది. మూడేళ్ల కాలపరిమితి కలిగిన ఈ ఒప్పందం మొత్తం విలువ 30 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 204.0 కోట్లు) గా అంచనా వేశారు. దీనిప్రకారం ప్రతి ఏటా సరాసరి 10 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల విలువైన సరఫరా జరుగుతుంది. ఒప్పంద వ్యవధిలో కొత్త ఉత్పత్తుల అభివృద్ధి, పోర్ట్‌ఫోలియో విస్తరణకు స్పష్టమైన అవకాశం కల్పించారు.

ఈ భాగస్వామ్యం ద్వారా ఉత్పత్తుల తయారీ, సోర్సింగ్, నియంత్రణ సంస్థల ఆమోదాలు, టీజీఏ (TGA) రిజిస్ట్రేషన్లు, వేర్‌హౌసింగ్, నాణ్యతా ప్రమాణాలు, దేశవ్యాప్త పంపిణీ బాధ్యతలను నూమెడ్ నిర్వహిస్తుంది. నూమెడ్ సంస్థ ప్రాడక్ట్ రిజిస్ట్రేషన్లు, మార్కెటింగ్ అనుమతులను కలిగి ఉండగా, సదరు ఫార్మసీ చైన్ తమ సొంత కన్స్యూమర్ బ్రాండ్ పేరుతో ఉత్పత్తులను విక్రయిస్తుంది.

మొత్తం ఆర్డర్ బుక్ విలువ రూ. 1,506 కోట్లకు చేరిక

జూలై 1, 2026న 7.5 ఏళ్ల కాలానికి కుదుర్చుకున్న రూ. 1,300 కోట్ల (202 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు) ఒప్పందంతో కలిపి, ఆస్ట్రేలియా ఓటీసీ మార్కెట్లో సాయి పేరెంటరల్స్ మొత్తం కాంట్రాక్ట్ ఆర్డర్ బుక్ విలువ 232 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లకు (సుమారు రూ. 1,506 కోట్లు) చేరింది.

"నూమెడ్ సంస్థ కేవలం రెండు నెలల వ్యవధిలోనే రెండు కీలక సరఫరా ఒప్పందాలను పునరుద్ధరించుకుంది. ఇవి ఆస్ట్రేలియా ఓటీసీ మార్కెట్లో మన ఆర్డర్ బుక్‌ను రూ. 1,506 కోట్లకు చేర్చాయి. అత్యంత కఠినమైన నియంత్రణలు ఉన్న ఆస్ట్రేలియా మార్కెట్లో ఏళ్లనుంచి అందిస్తున్న నాణ్యమైన సేవలకు ఇది నిదర్శనం. అడిలైడ్ ప్లాంట్ ప్రారంభమై, భారత తయారీ సామర్థ్యం పెరిగినకొద్దీ పంపిణీ మార్జిన్ స్థానంలో తయారీ మార్జిన్ వచ్చి కంపెనీ లాభదాయకత మరింత పెరుగుతుంది" అని సాయి పేరెంటరల్స్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ కరుసాల పేర్కొన్నారు.

"మా ఉత్పత్తుల విస్తృతి, కస్టమర్లు మాపై ఉంచిన నమ్మకానికి ఈ ఒప్పంద పునరుద్ధరణ అద్దం పడుతోంది. సోర్సింగ్ నుంచి దేశవ్యాప్త పంపిణీ వరకు సమగ్ర బాధ్యతలను ఒక్క భాగస్వామే పర్యవేక్షించడాన్ని కస్టమర్లు కోరుకుంటున్నారు. అడిలైడ్‌లో స్థానిక తయారీ అందుబాటులోకి రాగానే లీడ్ టైమ్ తగ్గి, మెరుగైన సేవలు అందించడానికి వీలవుతుంది" అని నూమెడ్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ మార్క్ థుల్‌బోర్న్ వివరించారు.

సాయి పేరెంటరల్స్ ప్రస్థానం

నవంబర్ 2025లో నూమెడ్ సంస్థను స్వాధీనం చేసుకున్న సాయి పేరెంటరల్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాల్లో ప్రముఖ ప్రైవేట్-లేబుల్ ఓటీసీ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. మార్చి 2026లో ఐపీఓ పూర్తి చేసుకున్న ఈ సంస్థ, ఏప్రిల్ 2, 2026న బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈలలో లిస్టయింది. ప్రస్తుతం కంపెనీ భారత్‌లో 5, ఆస్ట్రేలియాలో 1 ప్లాంట్‌తో సహా మొత్తం 6 తయారీ కేంద్రాలు, 302 వాణిజ్య ఉత్పత్తులు, 599 ఆమోదిత రిజిస్ట్రేషన్లతో విస్తృత స్థాయిలో సేవలు అందిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe