హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ సాయి పేరెంటరల్స్ లిమిటెడ్ 2026 జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో (Q1 FY27) అద్భుతమైన ఆర్థిక ఫలితాలను సాధించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ రాబడి రూ.182.4 కోట్లకు చేరింది. క్రితం ఏడాదితో పోలిస్తే కార్యకలాపాలు వేగవంతమవ్వడమే కాకుండా, వ్యూహాత్మక కొనుగోళ్లతో కంపెనీ తన ఉనికిని మరింత బలపరుచుకుంటోంది.

కంపెనీ ఆర్థిక నివేదిక ప్రకారం, ఈ త్రైమాసికంలో స్థూల లాభం రూ.76.2 కోట్లుగా (41.8% మార్జిన్) నమోదైంది. గత నాలుగో త్రైమాసికంలో ఉన్న 38.1 శాతం స్థూల మార్జిన్‌తో పోలిస్తే ఇది 370 బేసిస్ పాయింట్లు పెరిగింది. కంపెనీ EBITDA రూ.27.3 కోట్లకు (14.9% మార్జిన్) పెరగ్గా , పన్నుల తర్వాతి నికర లాభం (PAT) రూ.7.9 కోట్లను తాకింది. ముడిసరుకుల ధరల భారాన్ని తగ్గించుకోవడానికి చేసిన ఒప్పందాల సవరణలు కంపెనీకి కలసివచ్చాయి.
మరోవైపు, స్టాండ్‌అలోన్ ప్రాతిపదికన సాయి పేరెంటరల్స్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. స్టాండ్‌అలోన్ రాబడి రూ.56.2 కోట్లుగా నమోదై, ఏడాది ప్రాతిపదికన 174.8 శాతం వృద్ధిని సాధించింది. నికర లాభం ఏకంగా 975.1 శాతం ఎగబాకి రూ.8.9 కోట్లకు చేరింది.
IPO నిధుల వినియోగంలో మార్పులు.. కీలక కొనుగోళ్లు
వ్యాపార విస్తరణను మరింత వేగవంతం చేసేందుకు సాయి పేరెంటరల్స్ డైరెక్టర్ల బోర్డు ఐపీఓ (IPO) ద్వారా సమీకరించిన నిధుల వినియోగంలో కీలక మార్పులకు ఆమోదం తెలిపింది. రూ.83.83 కోట్ల తయారీ సామర్థ్యం విస్తరణ నిధులను, రూ.18.02 కోట్ల పరిశోధన నిధులను రెండు నూతన ఫార్మా కంపెనీల కొనుగోలుకు మళ్లించాలని నిర్ణయించారు.
- గుమ్మడిదలలో నూతన ఇంజెక్టబుల్ ప్లాంట్ నిర్మాణం కోసం సాయికృతి ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్‌లో 60 శాతం ఈక్విటీ వాటాను రూ.83.83 కోట్లతో కొనుగోలు చేయనున్నారు.
- ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.215 కోట్లు కాగా , 15,000 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మాణం సాగుతోంది.
- జీడిమెట్లలోని యూనిట్ 1, 2 స్థలాలు ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలోకి రావడం , అక్కడ విస్తరణకు అనుమతులు లేకపోవడంతో గుమ్మడిదలలో పెద్ద ప్లాంట్ వైపు మొగ్గు చూపారు.
- కొత్త ప్లాంట్ ద్వారా వార్షికంగా 154.66 మిలియన్ యూనిట్ల ఇంజెక్టబుల్ సామర్థ్యం అందుబాటులోకి వస్తుంది. ఇది పాత ప్రణాళిక కంటే 47 శాతం అధికం.
- ఆర్‌అండ్‌డీ విభాగాన్ని బలోపేతం చేసేందుకు జీనోమ్ వ్యాలీలోని ప్రత్యాక్ ల్యాబోరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 60 శాతం వాటాను రూ.18.02 కోట్లతో సాయి పేరెంటరల్స్ సబ్సిడీ సంస్థ అయిన SP అనలిటిక్స్ కొనుగోలు చేయనుంది.
- ఈ ఒప్పందం 2026 సెప్టెంబర్ 30 నాటికి పూర్తి కానుంది.
ఆస్ట్రేలియా, అమెరికా మార్కెట్లలో విస్తరణ
ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో నిర్మాణంలో ఉన్న AUD 53 మిలియన్ల ప్రాజెక్టుకు అవసరమైన చివరి విడత నిధుల సేకరణ పూర్తయింది. 2027 జనవరి నాటికి భౌతిక నిర్మాణం పూర్తి చేసి, ఏప్రిల్ 2027 నాటికి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
{{/usCountry}}ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో నిర్మాణంలో ఉన్న AUD 53 మిలియన్ల ప్రాజెక్టుకు అవసరమైన చివరి విడత నిధుల సేకరణ పూర్తయింది. 2027 జనవరి నాటికి భౌతిక నిర్మాణం పూర్తి చేసి, ఏప్రిల్ 2027 నాటికి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
{{/usCountry}}అంతేకాకుండా, అమెరికా మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు వీలుగా సింగపూర్ సబ్సిడీ సంస్థ ద్వారా అమెరికాలో కొత్త సబ్సిడీ సంస్థను ఏర్పాటు చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది.
రూ.750 కోట్ల వార్షిక లక్ష్యం
ఫలితాలపై మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ కరుసాల స్పందిస్తూ .. "ద్వితీయార్థంలో ఆర్డర్లు మరింత పెరిగే అవకాశం ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.750 కోట్ల రాబడి, 17 శాతం EBITDA మార్జిన్ లక్ష్యాన్ని చేరుకోవడానికి శరవేగంగా అడుగులు వేస్తున్నాం" అని తెలిపారు.