బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఆకట్టుకునేందుకు శాంసంగ్ మరో కొత్త మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎటువంటి హంగామా లేకుండా సైలెంట్‌గా 'శాంసంగ్ గెలాక్సీ ఏ08' పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ని గ్లోబల్ మార్కెట్‌లో ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ఉక్రెయిన్‌కి చెందిన శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలుకు సిద్ధంగా ఉంది. త్వరలోనే భారత్ సహా ఇతర ఆసియా మార్కెట్లలోనూ ఈ మోడల్ అడుగుపెట్టే అవకాశం ఉంది.

తక్కువ బడ్జెట్‌లో రోజంతా సజావుగా పనిచేసే పవర్‌ఫుల్ ఫోన్ కోరుకునే యూజర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనిని రూపొందించింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు నిరంతరాయంగా పనిచేసే 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది!
ఈ నేపథ్యంలో ఈ శాంసంగ్ గెలాక్సీ ఏ08 ఫీచర్లు, ధర వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..
శాంసంగ్ గెలాక్సీ ఏ08- డిస్ప్లే, ప్రాసెసర్..
గెలాక్సీ ఏ08 స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల హెచ్డీ+ (720 x 1,600 పిక్సెల్స్) పీఎల్ఎస్ ఎల్సీడీ స్క్రీన్‌తో వస్తుంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటంతో సోషల్ మీడియా స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం చాలా నునుపుగా సాగుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో మీడియాటెక్ హెలియో జీ99 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను అమర్చారు. 6ఎన్ఎం ప్రాసెసింగ్ టెక్నాలజీపై తయారైన ఈ ప్రోసెసర్ గరిష్టంగా 2.2జీహెచ్‌జెడ్ క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. రోజువారీ పనులతో పాటు మల్టీటాస్కింగ్, సాధారణ గేమింగ్‌కు ఇది సమర్థవంతంగా తోడ్పడుతుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ‘వన్ యూఐ 8’ ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. వినియోగదారులకు ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌కు 2032 వరకు (దాదాపు 6 సంవత్సరాలు) సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని సంస్థ స్పష్టమైన హామీ ఇచ్చింది.
బడ్జెట్ సెగ్మెంట్లోని ఫోన్‌కు ఇన్ని సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ లభించడం విశేషం.
శాంసంగ్ గెలాక్సీ ఏ08- కెమెరా..
{{/usCountry}}బడ్జెట్ సెగ్మెంట్లోని ఫోన్‌కు ఇన్ని సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ లభించడం విశేషం.
శాంసంగ్ గెలాక్సీ ఏ08- కెమెరా..
{{/usCountry}}ఫొటోగ్రఫీ విభాగం విషయానికి వస్తే, గెలాక్సీ ఏ08 వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఎఫ్/1.8 అపెర్చర్, ఆటోఫోకస్, 10x డిజిటల్ జూమ్ సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు డెప్త్ షాట్ల కోసం 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాను జోడించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ (ఎఫ్/2.0) కెమెరాను అందించారు. ఈ ఫోన్ ద్వారా హెచ్డీ క్వాలిటీ వీడియోలను 120 ఎఫ్‌పీఎస్ వద్ద రికార్డ్ చేయవచ్చు.
ఈ శాంసంగ్ ఫోన్లోని 6,000ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారికి, ఆఫీస్ వినియోగదారులకు ఛార్జింగ్ సమస్య లేకుండా అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. భద్రత కోసం ఫోన్ పవర్ బటన్‌కే ఫింగర్‌ప్రింట్ స్కేనర్‌ను అమర్చారు. డ్యూయల్ 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.3, యుఎస్బీ టైప్-సి పోర్ట్, జిపిఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ బరువు 197 గ్రాములుగా ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ08- ధర..
శాంసంగ్ గెలాక్సీ ఏ08 ప్రస్తుతం 4GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఏకైక వేరియంట్‌లో లభిస్తోంది. ఫోన్‌లో సరిపోయే స్పేస్ లేదనుకునే వారు మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2టీబీ వరకు ఎక్స్‌ప్యాండ్ చేసుకోవచ్చు.
ఉక్రెయిన్ మార్కెట్‌లో దీని ధర యూఏహెచ్ 10,699గా నిర్ణయించారు. మన భారతీయ కరెన్సీలో ఇది దాదాపు రూ. 23,000కు సమానం. కంపెనీ ఈ ఫోన్‌ను డార్క్ బ్లూ, గ్రీన్, సిల్వర్ అనే మూడు కంటికి ఇంపుగా ఉండే రంగుల్లో మార్కెట్లోకి తెచ్చింది.