6000ఎంఏహెచ్ బ్యాటరీతో Samsung Galaxy F70 Pro లాంచ్- ధర, ఫీచర్లు..
Samsung Galaxy F70 Pro price : శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ ఓఐఎస్ కెమెరా, 6 ఏళ్ల ఓఎస్ అప్‌డేట్ల హామీతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..
భారత మార్కెట్లో శాంసంగ్ తన పాపులర్ ఎఫ్-సిరీస్‌ను మరింత విస్తరించింది. ఫిబ్రవరిలో విడుదల చేసిన 'గెలాక్సీ ఎఫ్70ఈ 5జీ' సక్సెస్ తర్వాత, అదే లైనప్‌లో సరికొత్త ‘శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మిడ్-రేంజ్ విభాగంలో వినియోగదారులను ఆకట్టుకునేలా భారీ బ్యాటరీ, ఆకట్టుకునే డిస్ప్లే, సరికొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్‌ను రూపుదిద్దింది.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో 5జీ- వేరియంట్లు, ధర వివరాలు..
ఈ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది:
6GB RAM + 128GB స్టోరేజ్: రూ.25,999
8GB RAM + 128GB స్టోరేజ్: రూ.29,999
8GB RAM + 256GB స్టోరేజ్: రూ.34,999
లాంచ్ ఆఫర్లలో భాగంగా బ్యాంక్ డిస్కౌంట్లు, ఇతర ప్రయోజనాలు ఉపయోగించుకుంటే ఈ ఫోన్‌ను రూ.23,999 ప్రారంభ ధరకే సొంతం చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ 'ఆల్ఫా బ్లాక్', 'ఆరా గ్రీన్' రంగుల్లో లభిస్తుంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు సాంసంగ్ ఇండియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా వినియోగదారులు దీనిని కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో 5జీ- ఫీచర్లు..
డిస్ప్లే: గెలాక్సీ ఎఫ్70 ప్రో 5జీ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్‌తో వస్తోంది. ఇది 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ డిస్ప్లేకు రక్షణగా గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ ఇచ్చారు.
ప్రొసెసర్, పర్ఫార్మెన్స్: ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. అత్యంత వేగవంతమైన 8జీబీ వరకు LPDDR5x RAM, 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 ఇన్-బిల్ట్ స్టోరేజ్ సపోర్ట్ దీని సొంతం.
సాఫ్ట్‌వేర్- అప్‌డేట్స్ హామీ: ఆండ్రాయిడ్ 16 ఆధారిత సరికొత్త వన్ యూఐ 8.5 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ రన్ అవుతుంది. వినియోగదారులకు ఏకంగా 6 ఏళ్ల ఓఎస్ అప్‌డేట్‌లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇస్తామని సాంసంగ్ హామీ ఇచ్చింది. ఈ బడ్జెట్‌లో ఇన్ని ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇవ్వడం విశేషం.
కెమెరా సెటప్: వెనుక వైపు ట్రిపుల్ కెమెరా వ్యవస్థను అమర్చారు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు, 5 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం హెచ్‌డీఆర్ సపోర్ట్ ఉన్న 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
గెలాక్సీ ఏఐ ఫీచర్లు: స్మార్ట్ ఫోన్ అనుభవాన్ని పెంచడానికి సరికొత్త 'గెలాక్సీ ఏఐ' ఫీచర్లను జోడించారు. గూగుల్ సర్కిల్ టు సెర్చ్, జెమినీ వాయిస్ అసిస్టెంట్, ఏఐ వాయిస్ ట్రాన్స్‌క్రిప్షన్, డైరెక్ట్ వాయిస్‌మెయిల్, నౌ బార్ వంటి ఉపయోగకరమైన టూల్స్ ఇందులో లభిస్తాయి.
భారీ బ్యాటరీ - ఛార్జింగ్: ఈ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6,000ఎంఏహెచ్ సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 45డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 24 గంటలకు పైగా యూట్యూబ్ వీడియోలు చూడవచ్చని లేదా 8 గంటలకు పైగా గేమింగ్ అడుకోవచ్చని కంపెనీ పేర్కొంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


