OnePlus N6x : వన్​ప్లస్​ కొత్త స్మార్ట్​ఫోన్ లాంచ్- 7000ఎంఏహెచ్​ బ్యాటరీతో..

వన్‌ప్లస్ భారతదేశంలో తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 'వన్‌ప్లస్ ఎన్6ఎక్స్'ని ఆవిష్కరించింది. 7,000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆక్సిజన్ ఓఎస్ 16, ఏఐ కెమెరా ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ధర, డిస్కౌంట్లు, అమ్మకాల వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jul 31, 2026, 14:41:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ భారత మార్కెట్లోకి మరో కొత్త బడ్జెట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. 'వన్‌ప్లస్ ఎన్6ఎక్స్' పేరుతో ఈ ఫోన్‌ను శుక్రవారం లాంచ్ చేసింది. గత నెలలోనే భారత మార్కెట్లో విడుదలైన వన్‌ప్లస్ ఎన్6 మోడల్‌క సరసన ఇది చేరింది. గత మోడల్‌లో 8,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించగా, ఈ కొత్త వన్‌ప్లస్ ఎన్6ఎక్స్ ఫోన్‌ను 7,000ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతో రూపొందించారు.

వన్​ప్లస్​ కొత్త స్మార్ట్​ఫోన్ ధర, ఫీచర్లు.. (OnePlus)
వన్​ప్లస్​ కొత్త స్మార్ట్​ఫోన్ ధర, ఫీచర్లు.. (OnePlus)

ఆక్సిజన్ ఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, దీని పూర్తి ఫీచర్లు, ధర, ఆఫర్ల వివరాలు మీకోసం..

వన్‌ప్లస్ ఎన్6ఎక్స్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..

డిజైన్ పరంగా ఈ స్మార్ట్​ఫోన్ పాలి కార్బోనేట్ బాడీతో వస్తుంది. దుమ్ము, వాటర్ డ్రాప్స్ నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్‌తో పాటు మిలిటరీ గ్రేడ్ మన్నిక ప్రమాణాలను కలిగి ఉంది. ఇది మార్కెట్లో 'ఐసీ బ్లూ', 'బర్గుండి రెడ్' రంగుల్లో లభించనుంది.

డిస్‌ప్లే: 6.8 అంగుళాల హెచ్​డీ+ ఎల్​సీడీ స్క్రీన్‌ను ఇందులో అందించారు. ఇది 120హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్, 1570 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్, 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది.

ప్రాసెసర్ అండ్ పనితీరు: ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ చిప్‌సెట్‌ను వాడారు. 4జీబీ ర్యామ్, 128జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్ అండ్ ఏఐ ఫీచర్లు: ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 16పై ఈ ఫోన్ నడుస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి 13280 mm² వైశాల్యం గల వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను అమర్చారు. ఫొటోగ్రఫీ కోసం ఏఐ ఎరేజర్, ఏఐ పోర్ట్రెయిట్ గ్లో, ఏఐ అన్‌బ్లర్, ఏఐ రిఫ్లెక్షన్ ఎరేజర్ వంటి అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

బ్యాటరీ & ఛార్జింగ్: ఈ ఫోన్‌లో అత్యంత ప్రధానమైనది దీని 7,000ఎంఏహెచ్ బ్యాటరీ. ఇది 15డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే దీని ద్వారా వేరే డివైజ్‌లను ఛార్జ్ చేసుకునేలా 6డబ్ల్యూ రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.

కెమెరా: ఫోన్ వెనుక వైపు పిల్-షేప్ (మాత్ర ఆకారపు) మాడ్యూల్‌లో 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఇది ఆటో ఫోకస్, 10ఎక్స్ డిజిటల్ జూమ్, డ్యూయల్-వ్యూ వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరాను కేటాయించారు.

వన్‌ప్లస్ ఎన్6ఎక్స్ ధర, డిస్కౌంట్లు..

భారత్‌లో వన్‌ప్లస్ ఎన్6ఎక్స్ స్మార్ట్​ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

4GB RAM + 64GB స్టోరేజ్ ప్రారంభ ధర: రూ. 18,999

4GB RAM + 128GB స్టోరేజ్ ధర: రూ. 20,499

లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా నిర్దిష్ట బ్యాంక్ క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై రూ. 1,500 వరకు తక్షణ డిస్కౌంట్‌ను వన్‌ప్లస్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత 64GB వేరియంట్ రూ. 17,499 కే, అలాగే 128GB వేరియంట్ రూ. 19,499 కే లభిస్తాయి. అంతేకాకుండా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ విక్రయాలు ఆగస్టు 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. అధికారిక వెబ్‌సైట్ (OnePlus.in), వన్‌ప్లస్ స్టోర్ యాప్, అమెజాన్​లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్లు, ప్రముఖ రిటైల్ షాపుల్లో దీనిని కొనుగోలు చేయవచ్చు.

మరి మీరు ఈ వన్‌ప్లస్ ఎన్6ఎక్స్ స్మార్ట్​ఫోన్​ని కొంటున్నారా?

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More