SBI Apprentice Recruitment : నిరుద్యోగులకు అలర్ట్- ఎస్బీఐ అప్రెంటిస్​ దరఖాస్తు గడువు పొడిగింపు..

SBI Apprentice Recruitment 2026 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 7,150 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువును పొడిగించింది. అర్హులైన అభ్యర్థులు జూన్ 15, 2026 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 9, 2026, 09:12:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

SBI Apprentice Recruitment apply online : బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే నిరుద్యోగులకు దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మంచి అవకాశం కల్పించింది. ఎస్బీఐ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2026 దరఖాస్తు గడువును పొడిగిస్తూ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు మరో సువర్ణావకాశం లభించింది. తాజా ప్రకటన ప్రకారం.. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 15, 2026 వరకు ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

ఎస్బీఐ అప్రెంటిస్ రిక్రూట్​మెంట్​ 2026 వివరాలు..
ఎస్బీఐ అప్రెంటిస్ రిక్రూట్​మెంట్​ 2026 వివరాలు..

ఎస్బీఐ అప్రెంటిస్ రిక్రూట్​మెంట్​ 2026- పోస్టుల వివరాలు..

ఎస్బీఐ అప్రెంటిస్ రిక్రూట్​మెంట్​ 2026 డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 7,150 అప్రెంటిస్ ఖాళీలను ఎస్బీఐ భర్తీ చేయనుంది. అభ్యర్థులు తమ సొంత రాష్ట్రాల్లోని ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు.

ఎస్బీఐ అప్రెంటిస్ రిక్రూట్​మెంట్​ 2026- అర్హతలు, వయోపరిమితి..

ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయోపరిమితి విషయానికి వస్తే.. ఏప్రిల్ 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే, అభ్యర్థులు ఏప్రిల్ 2, 1998 కంటే ముందుగాని, ఏప్రిల్ 1, 2006 తర్వాత గాని జన్మించి ఉండకూడదు (ఈ రెండు తేదీలు కూడా వర్తిస్తాయి).

జనరల్ (యూఆర్), ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 28 ఏళ్లుగా నిర్ణయించారు.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగుల (పీడబ్ల్యూబీడీ) వర్గాలకు చెందిన అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎస్బీఐ అప్రెంటిస్ రిక్రూట్​మెంట్​ 2026- ఎంపిక విధానం ఎలా ఉంటుంది?

ఎస్బీఐ అప్రెంటిస్ రిక్రూట్​మెంట్​ 2026 పోస్టుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదట ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి స్థానిక భాషా నైపుణ్య పరీక్ష ఉంటుంది.

ఆన్‌లైన్ పరీక్షలో జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ వంటి సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్షలో పాసైన అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న రాష్ట్ర అధికారిక స్థానిక భాషలో తమ నైపుణ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే, 10వ తరగతి లేదా 12వ తరగతిలో స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదివి, దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు సమర్పించిన అభ్యర్థులకు ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నుంచి మినహాయింపు ఇస్తారు.

ఎంపికైన అభ్యర్థులు ఎస్బీఐ నిర్దేశించిన కాలపరిమితి ప్రకారం అప్రెంటిస్‌షిప్ శిక్షణ పొందవలసి ఉంటుంది. ఈ శిక్షణా కాలంలో అభ్యర్థులకు ప్రతి నెలా నిర్ణీత స్టైపెండ్ చెల్లిస్తారు.

అయితే, అప్రెంటిస్‌లుగా చేరిన వారు కేవలం శిక్షణార్థులు మాత్రమే కాబట్టి, ఎస్బీఐ రెగ్యులర్ ఉద్యోగులకు లభించే కరువు భత్యం (డీఏ), ఇంటి అద్దె భత్యం (హెచ్​ఆర్​ఏ), ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), పెన్షన్, వైద్య సదుపాయాలు, ఇతర సర్వీస్ ప్రయోజనాలకు వీరు అర్హులు కారు. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం అభ్యర్థులకు బ్యాంకింగ్ కార్యకలాపాలు, కస్టమర్ సర్వీస్‌పై ఆచరణాత్మక అవగాహన కల్పించడమే. కాబట్టి శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఎస్బీఐలో శాశ్వత ఉద్యోగం లభిస్తుందనే గ్యారెంటీ ఎటువంటి గ్యారెంటీ ఉండదు.

ఎస్బీఐ అప్రెంటిస్ రిక్రూట్​మెంట్​ 2026పై మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More