...
...
Next Story

SBI PO Prelims 2026 : ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

SBI PO Prelims 2026 Admit Card : ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అలర్ట్! పీఓ ప్రిలిమ్స్ 2026 అడ్మిట్​ కార్డులను సంస్థ విడుదల చేసింది. ఎలా డౌన్​లోడ్​ చేసుకోవాలి? ఎగ్జామ్ సెంటర్​కి ఏ డాక్యుమెంట్లు పట్టుకెళ్లాలి? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

Published on: Jul 23, 2026, 10:30:36 IST
Advertisement

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. ప్రోబేషనరీ ఆఫీసర్ (పీఓ) ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులను అధికారికంగా విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసిన అభ్యర్థులు తమ హాల్ టికెట్లను బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జులై 22, 2026 నుంచి ఆగస్టు 2, 2026 వరకు అడ్మిట్ కార్డులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్​ అడ్మిట్​ కార్డు విడుదల..
ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్​ అడ్మిట్​ కార్డు విడుదల..

బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువతకు ఇది ఎంతో కీలకమైన ఘట్టం. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 1,500 ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీలను ఎస్‌బీఐ భర్తీ చేయనుంది.

ఆగస్ట్ 1,2 తేదీల్లో ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ పరీక్షలు జరగనున్నాయి.

పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు ఇవి తప్పనిసరి..

ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ 2026 పరీక్ష కేంద్రానికి వెళ్లే ముందే అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన పత్రాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

ఫోటో అతికించిన అడ్మిట్ కార్డ్: డౌన్‌లోడ్ చేసుకున్న కాల్ లెటర్‌పై నిర్దేశించిన స్థలంలో అభ్యర్థి తన ఇటీవలి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను సరిగ్గా అతికించాలి.

అదనపు ఫోటోలు: పరీక్ష కేంద్రానికి వస్తున్నప్పుడు అభ్యర్థులు తమ వెంట మరో 2 అదనపు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను ఖచ్చితంగా తెచ్చుకోవాలి.

గుర్తింపు కార్డు : ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డుతో పాటు దాని ఒరిజినల్ ఫోటోకాపీ (జిరాక్స్) తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

ప్రిలిమినరీ పరీక్షా సరళి వివరాలు..

ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ పరీక్షను ఆన్‌లైన్ మార్గంలో నిర్వహించనున్నారు. పరీక్ష సరళి ఈ కింది విధంగా ఉంటుంది:

  • పరీక్ష సమయం: 1 గంట (60 నిమిషాలు)
  • మొత్తం మార్కులు: 100 మార్కులు (ఆబ్జెక్టివ్ టైప్)

అభ్యర్థులు కింద పేర్కొన్న సులువైన మెట్ల ద్వారా తమ హాల్ టికెట్లను పొందవచ్చు:

ముందుగా ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.inని సందర్శించండి.

హోమ్ పేజీలో కనిపిస్తున్న "Careers" ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

తెరుచుకున్న కొత్త పేజీలో "Join SBI" ఆప్షన్ కింద ఉన్న "Current Openings" విభాగంలోకి వెళ్లి, "Prelims Admit Card" లింక్‌ను ఎంచుకోండి.

మీ రిజిస్ట్రేషన్ నంబర్ / రోల్ నంబర్, పాస్‌వర్డ్ / పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయండి.

మీ స్క్రీన్‌పై ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ హాల్ టికెట్ ప్రత్యక్షమవుతుంది.

అన్ని వివరాలను ఒకసారి సరిచూసుకుని అడ్మిట్ కార్డును ప్రింట్ తీసుకోండి.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు ఆన్‌లైన్ శిక్షణ..

భారత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థుల కోసం ఎస్‌బీఐ ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్​ని ఆన్‌లైన్ మోడ్‌లో ఏర్పాటు చేస్తోంది.

దరఖాస్తు సమయంలో ఆన్‌లైన్ ఫారమ్‌లో పీఈటీ ఆప్షన్ ఎంచుకున్న అర్హులైన అభ్యర్థులు బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా శిక్షణ తరగతులకు లాగిన్ కావచ్చు.

దీని కోసం అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఉపయోగించాల్సి ఉంటుంది.

శిక్షణకు సంబంధించిన షెడ్యూల్ సమాచారాన్ని దరఖాస్తుదారుల రిజిస్టర్డ్ ఈమెయిల్, ఎస్​ఎంఎస్​ల ద్వారా తెలియజేస్తారు. ఎటువంటి భౌతిక కాపీలు తపాలా ద్వారా పంపరు.

మరిన్ని పూర్తి వివరాలు, పరీక్షా కేంద్రాల సమాచారం కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే పరిశీలించాలని సూచించడమైనది.

ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ అడ్మిట్​ కార్డు 2026ని డౌన్​లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe