ఎన్నికల సంఘం (ECI) పనితీరు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో చోటుచేసుకున్నాయంటున్న అక్రమాలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా 'ఇండియా' (INDIA) కూటమికి చెందిన 12 మంది అగ్రనేతలు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు స్పందించింది. భారత ఎన్నికల సంఘంతో పాటు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జైమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం గురువారం (అక్టోబర్ 15) ఈ పిటిషన్ను విచారించింది.
పిటిషనర్ కామెంట్స్పై ధర్మాసనం అసంతృప్తి
విచారణ సందర్భంగా, ఈ పిటిషన్లో సహ-పిటిషనర్గా ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేత మహువా మాజీ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమెకు ప్రొవిజనల్ నోటీసు ఇస్తూ, "ఆమె చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తనపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది" అని కోర్టు స్పష్టం చేసింది.
ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారా?
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై నిర్ణీత కాలపరిమితిలో స్వతంత్ర విచారణ జరిపించాలని విపక్ష నేతలు కోరారు. త్రైమాసిక కమిషన్లో ఒక్కరే ఏకపక్ష అధికారాలు చెలాయించడం రాజ్యాంగ నిబంధనలకు, చట్టాలకు విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విచారణ పూర్తయ్యే వరకు ప్రస్తుతం సాగుతున్న 'సర్' (SIR) ప్రక్రియను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో 'సర్' ప్రక్రియ, ఈసీ పనితీరుపై తమకున్న అభ్యంతరాలను తెలిపేందుకు సీజేఐని కలవాలని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భావించారు. అయితే అందుకు సీజేఐ నిరాకరిస్తూ, న్యాయ ప్రక్రియ ద్వారానే తమ ఆందోళనలను తెలియజేయాలని సూచించడంతో నేతలు నేరుగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆశ్రయించారు.
14 సార్లు విభేదాలు వచ్చినట్లు కథనాలు
గత 10 నెలల్లో సీఈసీ జ్ఞానేష్ కుమార్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలపై మిగతా ఇద్దరు కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి ఏకంగా 14 సందర్భాల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ఒక జాతీయ పత్రిక ప్రచురించిన కథనాన్ని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2025 జూన్లో 'సర్' ప్రక్రియను ప్రారంభించడానికి తీసుకున్న వివాదాస్పద నిర్ణయంతో పాటు, ఆయా సమావేశాల ఎజెండా, మినిట్స్, ఫైళ్లు, ఆమోదించిన ప్రతిపాదనల రికార్డులన్నింటినీ కోర్టు ముందు ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీకి డిమాండ్
{{/usCountry}}గత 10 నెలల్లో సీఈసీ జ్ఞానేష్ కుమార్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలపై మిగతా ఇద్దరు కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి ఏకంగా 14 సందర్భాల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ఒక జాతీయ పత్రిక ప్రచురించిన కథనాన్ని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2025 జూన్లో 'సర్' ప్రక్రియను ప్రారంభించడానికి తీసుకున్న వివాదాస్పద నిర్ణయంతో పాటు, ఆయా సమావేశాల ఎజెండా, మినిట్స్, ఫైళ్లు, ఆమోదించిన ప్రతిపాదనల రికార్డులన్నింటినీ కోర్టు ముందు ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీకి డిమాండ్
{{/usCountry}}ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలు, విధానాలు, ప్రాసెస్, ఈవీఎంల (EVMs) సాంకేతిక వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని నేతలు విజ్ఞప్తి చేశారు. ఇందులో సాంకేతిక నిపుణులు, పౌరసమాజ ప్రతినిధులను కూడా సభ్యులుగా చేర్చాలని ప్రతిపాదించారు.
దీంతో పాటు ఓటర్ల నమోదు నిబంధనలు 1960ని సవరించకుండానే ఫారమ్-6 మార్పులు చేయడం, ఈసీఐ నెట్ (ECINET), ఈఆర్ఓ నెట్ (ERONET) డేటాబేస్ల కేంద్రీకృత నిర్వహణ, తగిన నోటీసులు ఇవ్వకుండా అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడంపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎన్నికల సంఘం స్వతంత్రత, కలెక్టివ్ నిర్ణయాల ప్రక్రియ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగమని, వీటి ఉల్లంఘనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఎస్. ప్రసన్న ద్వారా దాఖలైన ఈ పిటిషన్లో కోరారు.