పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలకు నిరసనగా జూలై 20న చేపట్టిన 'సన్సద్ ఛలో' ప్రదర్శనపై పోలీసుల చర్యలు, బీహార్‌లోని తీవ్ర ఉద్రిక్తతలపై దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహన సభ్యులుగా ఉన్నారు.

శాంతియుత నిరసనలు తెలిపే ప్రాథమిక హక్కును రక్షించడంతో పాటు, నిరసనకారుల హింస, పోలీసుల బలప్రయోగం రెండూ ప్రజాస్వామ్యానికి మంచివి కావని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
బీహార్‌లో ఎకే-47 (AK-47) కాల్పుల అంశం ప్రస్తావన
రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా తరఫున హాజరైన న్యాయవాది ఫౌజియా షకీల్ కోర్టు దృష్టికి కీలక విషయాలను తీసుకెళ్లారు. బీహార్‌లోని సివాన్ జిల్లాలో నిరసనకారులపై పోలీసులు ఏకే-47 తుపాకీతో కాల్పులు జరిపారని, ఈ ఘటనలో ముగ్గురు నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారని చెబుతూ సమగ్ర సమాచారాన్ని దాఖలు చేశారు. విద్యార్థులు, వారి కుటుంబాలపై జరిగిన దాడులపై వచ్చిన అన్ని పిటిషన్లను కలిపి విచారించాలని అభ్యర్థించారు.
సమగ్ర ప్రోటోకాల్, దేశవ్యాప్త మార్గదర్శకాల అవసరం
పిటిషన్లపై సిజేఐ స్పందిస్తూ, నిరసనల నిర్వహణపై దేశవ్యాప్త మార్గదర్శకాలను కోరుతున్న పిటిషన్ ఇప్పటికే కోర్టు వద్ద ఉందన్నారు. "శాంతియుత నిరసనలకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది. అనుమతి పొందిన ప్రదేశాల్లో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది. కేవలం ఆందోళన చేస్తున్నారనే కారణంతో లాఠీచార్జ్ చేయడం సరికాదు. అలాగే నిరసనల్లో హింసను కూడా సహించలేం. పోలీసులతో పాటు నిరసనకారుల్లోనూ 'స్వీయ నియంత్రణ' (Self-imposed discipline) ఉండటం చాలా ముఖ్యం" అని సీజేఐ స్పష్టం చేశారు.
జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆందోళనల్లో నిరసనకారులతో పాటు పోలీసు సిబ్బంది గాయపడటంపై కూడా కోర్టు సమానంగా ఆందోళన చెందుతోందన్నారు. ఆందోళనల సమయంలో పోలీసులకు తగిన హెల్మెట్లు, రక్షణ కవచాలు (Safety Gears) ఎందుకు అందించలేదో ప్రభుత్వాన్ని వివరణ కోరతామని వ్యాఖ్యానించారు.
అన్ని పిటిషన్లు కలిపి విచారణ
{{/usCountry}}జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆందోళనల్లో నిరసనకారులతో పాటు పోలీసు సిబ్బంది గాయపడటంపై కూడా కోర్టు సమానంగా ఆందోళన చెందుతోందన్నారు. ఆందోళనల సమయంలో పోలీసులకు తగిన హెల్మెట్లు, రక్షణ కవచాలు (Safety Gears) ఎందుకు అందించలేదో ప్రభుత్వాన్ని వివరణ కోరతామని వ్యాఖ్యానించారు.
అన్ని పిటిషన్లు కలిపి విచారణ
{{/usCountry}}ఈ వ్యవహారం కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాదని, ఇది దేశవ్యాప్త సమస్య అని పేర్కొన్న సుప్రీంకోర్టు, అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని తెలిపింది. ఢిల్లీ పోలీసుల తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా దీనికి అంగీకరించారు. దీంతో తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, తీవ్రమైన వ్యతిరేక చట్టాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడటంతో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తన ఆందోళనలను విరమించినప్పటికీ, పోలీసుల బలప్రయోగంపై న్యాయపోరాటం కొనసాగుతోంది.