పిల్లల పెంపకం, ఉన్నత విద్య, వివాహం, ఆస్తి కొనుగోలు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు ముందస్తు ప్రణాళిక ఎంతో అవసరం. ఇందులో భాగంగానే చాలా మంది రిస్క్-ఫ్రీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి చూస్తుంటారు. మార్కెట్ నష్టభయం లేని సురక్షితమైన కేంద్ర ప్రభుత్వ పొదుపు పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్). గ్యారెంటీ రాబడిని అందించే ఈ పథకం ద్వారా పిల్లల భవిష్యత్తును సురక్షితం చేయడమే కాకుండా, కాంపౌండింగ్ శక్తిన ఉపయోగించి వారిని కోటీశ్వరులుగా మార్చే అవకాశం ఉంది.
పీపీఎఫ్ ఖాతా తెరిచే విధానం..

భారతదేశంలోని ఏ పోస్టాఫీసు లేదా ప్రముఖ బ్యాంక్ శాఖలోనైనా సులభంగా పీపీఎఫ్ ఖాతాను ప్రారంభించవచ్చు. మైనర్ పిల్లల పేరిట తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులు ఖాతాను తెరిచి నిర్వహించవచ్చు. చిన్నారికి 18 ఏళ్లు నిండిన తర్వాత ఈ ఖాతాను మేజర్ ఖాతాగా మార్చాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి కింద ఏడాదికి రూ.1.50 లక్షల వరకు చేసే పెట్టుబడులకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
రూ.2,000 పొదుపుతో రూ.1.08 కోట్ల కార్పస్!
పాప లేదా బాబు జన్మించిన తొలి ఏడాది నుంచే ఈ పొదుపు ప్రణాళికను ప్రారంభిస్తే కాంపౌండింగ్ వడ్డీ వల్ల గరిష్ఠ ప్రయోజనం లభిస్తుంది. ప్రస్తుతం పీపీఎఫ్‌పై కేంద్ర ప్రభుత్వం 7.1 శాతం వడ్డీని అందిస్తోంది.
పుట్టిన వెంటనే (0 ఏళ్లు): నెలకు రూ.2,000 (ఏడాదికి రూ.24,000) చొప్పున 50 ఏళ్ల పాటు నిరంతరాయంగా పొదుపు చేస్తే, మొత్తం జమ చేసే పెట్టుబడి రూ.12 లక్షలు మాత్రమే. అయితే కాంపౌండింగ్ వడ్డీ రూపంలో ఏకంగా రూ.96.12 లక్షలకు పైగా లభిస్తుంది. తద్వారా బిడ్డకు 50 ఏళ్లు వచ్చేసరికి ఖాతాలో రూ.1.08 కోట్లకు పైగా నిధి సమకూరుతుంది.
ఆలస్యమయ్యే కొద్దీ పెరిగే పెట్టుబడి భారం!
పొదుపు, ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభించడంలో కాలయాపన చేసే కొద్దీ కోటి రూపాయల లక్ష్యాన్ని చేరుకోవడానికి నెలనెలా ఎక్కువ మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది. పీపీఎఫ్ ప్రాథమిక కాలపరిమితి 15 సంవత్సరాలు అయినప్పటికీ, ఆ తర్వాత ఐదేళ్ల బ్లాకుల చొప్పున కోరుకున్నంత కాలం ఖాతాను విస్తరించుకునే సదుపాయం ఉంది.
{{/usCountry}}పొదుపు, ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభించడంలో కాలయాపన చేసే కొద్దీ కోటి రూపాయల లక్ష్యాన్ని చేరుకోవడానికి నెలనెలా ఎక్కువ మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది. పీపీఎఫ్ ప్రాథమిక కాలపరిమితి 15 సంవత్సరాలు అయినప్పటికీ, ఆ తర్వాత ఐదేళ్ల బ్లాకుల చొప్పున కోరుకున్నంత కాలం ఖాతాను విస్తరించుకునే సదుపాయం ఉంది.
{{/usCountry}}వయస్సు ఆధారంగా అయ్యే వ్యయాలు ఇవే:
5 ఏళ్ల వయస్సులో ప్రారంభిస్తే: 45 ఏళ్ల పాటు నెలకు కనీసం రూ.2,900 చొప్పున మొత్తం రూ.15.66 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, రూ.94.07 లక్షల వడ్డీతో కలిపి రూ.1.09 కోట్ల మెచ్యూరిటీ నిధి లభిస్తుంది.
10 ఏళ్ల వయస్సులో: 40 ఏళ్ల పాటు నెలకు రూ.4,200 (మొత్తం రూ.20.16 లక్షలు) పొదుపు చేస్తే, రూ.90.41 లక్షల వడ్డీతో కలిపి రూ.1.10 కోట్లు సమకూరుతాయి.
15 ఏళ్ల వయస్సులో: 35 ఏళ్ల పాటు నెలకు రూ.6,000 చొప్పున రూ.25.20 లక్షలు డిపాజిట్ చేస్తే, రూ.83.74 లక్షల వడ్డీతో రూ.1.08 కోట్ల నిధి సిద్ధమవుతుంది.
18 ఏళ్ల వయస్సులో: 32 ఏళ్ల పాటు నెలకు రూ.7,500 డిపాజిట్ చేయడం ద్వారా రూ.28.80 లక్షల పెట్టుబడికి రూ.79.53 లక్షల వడ్డీతో కలిపి రూ.1.08 కోట్లు అందుతాయి.
20 ఏళ్ల వయస్సులో: 30 ఏళ్ల పాటు నెలకు రూ.8,800 చొప్పున రూ.31.68 లక్షలు పొదుపు చేస్తే, రూ.77.09 లక్షల వడ్డీతో మొత్తం రూ.1.08 కోట్లు లభిస్తాయి.
25 ఏళ్ల వయస్సులో: 25 ఏళ్ల పాటు నెలకు రూ.13,100 చొప్పున రూ.39.30 లక్షలు డిపాజిట్ చేస్తే రూ.1.08 కోట్లు లభిస్తాయి. అయితే పన్ను మినహాయింపు పరిమితి ప్రకారం ఏడాదికి రూ.1.5 లక్షలు (నెలకు రూ.12,000) దాటకూడదు కాబట్టి, ఈ పరిమితిలో ఇన్వెస్ట్ చేస్తే రూ.98.95 లక్షల నిధి చేరుకుంటుంది.
పెట్టుబడిలో కాంపౌండింగ్ మ్యాజిక్..
పిల్లల భవిష్యత్ ఆర్థిక అవసరాల కోసం ఎంత త్వరగా పొదుపు ప్రారంభించామనేదే ఇక్కడ అత్యంత ప్రధానమైన అంశం. ఆదాయం పెరిగే కొద్దీ పెట్టుబడి మొత్తాన్ని పెంచుకునే వెసులుబాటు పీపీఎఫ్‌లో ఉంటుంది. చిన్న మొత్తంతోనైనా క్రమం తప్పకుండా సుదీర్ఘకాలం పొదుపు చేయడం వల్ల చక్రవడ్డీ ప్రభావంతో భారీ సంపద సృష్టి సాధ్యమవుతుంది.