...
...
Next Story

CAT 2025 : ఈ పొరపాట్లు చేస్తే అంతే! కఠిన పరీక్షలో తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు ఇవి..

క్యాట్​ 2025కి సన్నద్ధమవుతున్నారా? అయితే పరీక్షకు వెళ్లే ముందు, పరీక్ష రాస్తున్న సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే ప్రశాంతంగా పరీక్షను పూర్తి చేయగలరు. ఈ నేపథ్యంలో క్యాట్​ 2025 టిప్స్​ గురించి ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 09, 2025 03:09 PM IST
Advertisement

భారతదేశంలో నిర్వహించే అత్యంత కఠినమైన మేనేజ్‌మెంట్ ప్రవేశ పరీక్షల్లో ఒకటి కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్​). ప్రతి సంవత్సరం చాలా మంది అభ్యర్థులు ఈ కఠిన పరీక్షలో విఫలమవుతుంటారు. ఇది పరిజ్ఞానం లేక కాదు, పరీక్ష రోజున చేయకూడని పొరపాట్లు తెలియకపోవడం వల్ల! అలాంటి తప్పులను మీరు చేయకుండా ఉండేందుకు, క్యాట్​ 2025లో సాధారణంగా చేసే తప్పులను ఎలా నివారించాలో తెలిపే పూర్తి గైడ్ ఇక్కడ ఇస్తున్నాము. చెక్​ చేయండి..

పరీక్షకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

క్యాట్​ 2025 ప్రిపరేషన్​ టిప్స్​ ఇవిగో..
క్యాట్​ 2025 ప్రిపరేషన్​ టిప్స్​ ఇవిగో..

మీ అడ్మిట్ కార్డు వివరాలు సరిచూసుకోండి. ముఖ్యంగా పేరు, ఫోటో, రిజిస్ట్రేషన్ నంబర్, పరీక్ష తేదీ, సమయం, పరీక్షా కేంద్రం వంటి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించండి. చిన్నపాటి లోపం ఉన్నా, అనర్హత వేటు పడకుండా ఉండేందుకు వెంటనే క్యాట్​ హెల్ప్‌డెస్క్​ని సంప్రదించండి.

టెస్ట్ సెంటర్​కు త్వరగా చేరుకోండి. దీనివల్ల అక్కడి దారి, ప్రయాణ సమయం, లోపలికి వెళ్లే ప్రక్రియ గురించి ముందే తెలుసుకోవచ్చు. ఇది పరీక్ష రోజున ఉండే ఆందోళనను తగ్గిస్తుంది. క్యాట్​ 2025 అడ్మిట్ కార్డుతో పాటు అవసరమైన పత్రాలను తప్పక తీసుకెళ్లండి. ఫోన్ లేదా కాలిక్యులేటర్ తీసుకువెళ్లడం కూడా అనర్హతకు దారితీస్తుందని ఎన్టీఏ ముందే స్పష్టం చేసింది. కాబట్టి వాటిని తీసుకురావద్దు.

పరీక్ష మొదలు పెట్టడానికి ముందు

స్క్రీన్‌పై కనిపించే అన్ని సూచనలను చదవడానికి ఒక నిమిషం కేటాయించండి. ముఖ్యంగా మార్కింగ్ స్కీమ్ (నెగెటివ్ మార్కింగ్), నావిగేషన్ సిస్టమ్ (సమాధానాలను ఎలా సమీక్షించాలి, దాటవేయాలి, సమర్పించాలి) పూర్తిగా అర్థం చేసుకోండి.

సెక్షనల్ టైమ్ లిమిట్స్ (సాధారణంగా ప్రతి విభాగానికి 40 నిమిషాలు) కచ్చితంగా పాటిస్తూ సమయాన్ని మేనేజ్​ చేసుకోండి. తెలివిగా సమయాన్ని విభజించుకోండి. కష్టమైన ప్రశ్నపై మరీ ఎక్కువ సమయం వృథా చేయవద్దు! తదుపరి ప్రశ్నకు వెళ్లే ముందు మీరు ఎంచుకున్న సమాధానాలను ఒకసారి రీచెక్ చేసుకోండి. నాన్​-ఎంసీక్యూ విభాగంలో, మీరు నమోదు చేసిన సంఖ్యా విలువలను జాగ్రత్తగా ధృవీకరించుకోండి.

పరీక్ష జరుగుతున్నప్పుడు

ఆందోళనగా అనిపిస్తే, దీర్ఘంగా శ్వాస తీసుకోండి, మళ్లీ ఏకాగ్రతపై దృష్టి పెట్టండి. ఎందుకంటే భయాందోళనలు తప్పులు చేసే అవకాశాన్ని పెంచుతాయి. మీకు అత్యంత విశ్వాసం ఉన్న ప్రశ్నల రకాలతో ప్రారంభించడం ద్వారా ప్రతి విభాగాన్ని తెలివిగా ఎదుర్కోండి. గుర్తుంచుకోండి.. అత్యధిక ఖచ్చితత్వంతో ప్రయత్నించిన ప్రశ్నలతో కూడిన సమతుల్య వ్యూహం ఉన్నతమైన పర్సెంటైల్​ని సాధించడానికి సహాయపడుతుంది.

ముఖ్యంగా ఎంసీక్యూల్లో (తప్పు సమాధానానికి నెగటివ్ మార్కులు ఉంటాయి) గుడ్డిగా అంచనా వేయడం చేయకండి.

అడ్మిట్ కార్డు విడుదల తేదీల్లో మార్పు

గతంలో అడ్మిట్ కార్డు విడుదల తేదీని నవంబర్ 5గా నిర్ణయించగా, ఐఐఎం సంస్థ ఆ తేదీని మార్చి, నవంబర్ 12న విడుదల చేస్తామని ప్రకటించింది.

"అర్హత కలిగిన 2.95 లక్షల మంది అభ్యర్థుల అడ్మిట్ కార్డులు రూపొందించడం జరిగింది. వీటిని నవంబర్ 12 నుంచి నవంబర్ 30, 2025 మధ్య క్యాట్​ వెబ్‌సైట్ నుంచి క్యాట్​ అప్లికేషన్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు," అని వారు తెలిపారు.

క్యాట్​ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 20న ముగిసింది. క్యాట్​ 2025 పరీక్షలు నవంబర్ 30 (ఆదివారం) నాడు జరగనున్నాయి. ఫలితాలు 2026 జనవరి మొదటి వారంలో విడుదలవుతాయని అంచనా.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe