ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కారణంగా గత 20 రోజులుగా అల్లాడిపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఇప్పట్లో ఉపశమనం కనిపించేలా లేదు! అనేక రోజులుగా నెల చూపులే చూస్తున్న సూచీలు సోమవారం మరోసారి క్రాష్ అయ్యాయి. ఓపెనింగ్‌లోనే 1500 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ 72,977 వద్దకు చేరింది. ఇక నిఫ్టీ50 సైతం 500 మేర పతనమై 22,634 మార్క్‌ని హిట్ చేసింది. బీఎస్ఈ 150 మిడ్‌క్యాప్, బీఎస్ఈ 250 స్మాల్‌క్యాప్ సూచీలు 2శాతం కన్నా ఎక్కువ పడ్డాయి.

సోమవారం ట్రేడింగ్ సెషన్ మొదలైన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇన్వెస్టర్లు రూ. 8లక్షల కోట్ల సంపదను పోగొట్టుకున్నారు. బీఎస్ఈ మార్కెట్ క్యాపిటల్ రూ. 429 లక్షల కోట్ల నుంచి రూ. 421 లక్షల కోట్లకు పడిపోయింది.
ఇక సోమవారం ఉదయం 9 గంటల 50 నిమిషాల ప్రాంతంలో.. బీఎస్ఈ సెన్సెక్స్ 1418 పాయింట్ల నష్టంతో 73,114 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ50 452 పాయింట్లు పడి 22,662 వద్ద కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 1371 పాయింట్లు పడిపోయి 52,052 వద్ద ట్రేడ్ అవుతోంది.
సెన్సెక్స్30లో హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ మినహా మిగిలిన స్టాక్స్ అన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్ ఏకంగా 4.2శాతం, బజాజ్ ఫైనాన్స్ 3.03శాతం, అదానీ పోర్ట్స్ 2.9శాతం క్రాష్ అయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఎందుకు పడుతున్నాయి?
- పశ్చిమాసియాలో అనిశ్చితులు-
ప్రపంచ స్టాక్ మార్కెట్ల పతనానికి ప్రధాన కారణం పశ్చిమాసియాలో అనిశ్చితులు. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇది ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. మరీ ముఖ్యంగా ప్రపంచ ముడి చమురు సరఫరాకి జీవనాధారంగా భావించే హర్ముజ్ జలసంధి చుట్టూ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది.
48 గంటల్లో హర్ముజ్ జలసంధిని పూర్తిగా ఓపెన్ చేయాలని, లేదా ఇరాన్ విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆ వార్నింగ్‌ని ఇరాన్ పట్టించుకోలేదు. దాడి చేస్తే, జలసంధిని మొత్తానికే మూసేస్తామని అమెరికాకే వార్నింగ్ ఇచ్చింది.
{{/usCountry}}48 గంటల్లో హర్ముజ్ జలసంధిని పూర్తిగా ఓపెన్ చేయాలని, లేదా ఇరాన్ విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆ వార్నింగ్‌ని ఇరాన్ పట్టించుకోలేదు. దాడి చేస్తే, జలసంధిని మొత్తానికే మూసేస్తామని అమెరికాకే వార్నింగ్ ఇచ్చింది.
{{/usCountry}}2. రూపాయి పతనం-
తాజా అనిశ్చితి కారణంగా రూపాయి సైతం భారీగా పతనమవుతోంది. రోజురోజుకు రికార్డు కనిష్ఠాలకు పడిపోతోంది. సోమవారం ట్రేడింగ్ సెషన్లో డాలరుతో పోల్చితే రూపాయి విలువ 93.84 వద్ద ఉంది.
రూపాయి ఇలా బలహీనపడుతూ ఉంటే, ఎఫ్ఐఐల అమ్మకాలు పెరుగుతూ ఉంటాయి.
3. ముడి చమురు ధరలు-
యుద్ధం మొదలైనప్పటి నుంచి ముడి చమురు ధరలు అతి భారీగా పెరిగిపోయాయి. ఒకప్పుడు 70 డాలర్ల దిగువన ఉండే బ్రెంట్ క్రూడ్ బ్యారెల్.. ఇప్పుడు ఏకంగా 110 డాలర్ల ఎగువన ట్రేడ్ అవుతోంది. చమురును అధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఇండియా ఉండటంతో, దీని ప్రభావం జీడీపీపై ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
4. ఎఫ్ఐఐల అమ్మకాలు-
యుద్ధం, అనిశ్చితి వంటి పదాలు స్టాక్ మార్కెట్లకు నచ్చవు! మరీ ముఖ్యంగా ఎఫ్ఐఐలకు (ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు) ఇవి అస్సలు నచ్చదు. ఇండియాపై చమురు సరఫరా అంతరాయం ప్రభావం, రూపాయి పతనం వంటి కారణాలతో ఎఫ్ఐఐలు భారత స్టాక్ మార్కెట్ల నుంచి భారీ స్థాయిలో డబ్బులను తీసేస్తున్నారు. ఇది స్టాక్ మార్కెట్ క్రాష్‌కి ఒక కారణం.
యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐలు రూ. 1లక్ష కోట్ల కన్నా ఎక్కువ విలువ చేసే స్టాక్స్‌ని అమ్మేశారు.