మహీంద్రా XEV 9S కొనాలా? వద్దా? ఫస్ట్ రివ్యూ చూసేయండి..
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని హెచ్‌టీ టీమ్ డ్రైవ్ చేసింది. ఈ ఈవీకి సంబంధించిన పాజిటివ్స్, నెగిటివ్స్‌ని ఇక్కడ ఇస్తున్నాము. మీరు ఈ ఈవీని కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుంది.
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ భారతదేశంలో రూ. 19.95 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదలైంది. దేశీయ ఆటోమొబైల్ తయారీదారు మహీంద్రాకు చెందిన 'బోర్న్ ఎలక్ట్రిక్' సిరీస్‌లో ఇది మూడొవ మోడల్. ఈ సిరీస్‌లో ఇప్పటికే మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ, బీఈ 6 మోడల్స్ ఉన్నాయి.

ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, ఎక్స్ఈవీ 9ఈ, బీఈ 6 మాదిరిగానే ఐఎన్జీఎల్ఓ ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారైంది. ఈ ఎక్స్ఈవీ 9ఎస్ ప్రత్యేకమైన డిజైన్, ఫీచర్లను కలిగి ఉంది. ఇది మహీంద్రా నుంచి వచ్చిన మొదటి త్రీ-రో, సెవెన్-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ముఖ్యంగా, ఇది శక్తివంతమైన మహీంద్రా ఎక్స్‌యూవీ700కి ఫుల్లీ ఎలక్ట్రిక్ వర్షెన్ అని చెప్పవచ్చు.
ఈ మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్‌ని హెచ్‌టీ టీమ్ టెస్ట్ డ్రైవ్ చేసింది. బెంగళూరు సమీపంలోని నంది హిల్స్ ప్రాంతంలో మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్‌ని డ్రైవ్ చేసే అవకాశం లభించింది. ఈ డ్రైవ్‌లో టీమ్ గమనించిన విషయాలను ఇక్కడ తెలుసుకోండి. మీరు ఈ ఈవీని కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఇది కచ్చితంగా ఉపయోగపడుతుంది.
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్- మంచి అంశాలు..
1. ఎక్స్ఈవీ 9ఎస్, ఎక్స్‌యూవీ700 డిజైన్ల సమ్మేళనం
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ డిజైన్ అట్రాక్టివ్‌గా ఉంటుంది. అయితే, ఇది ఎక్స్ఈవీ 9ఈ అంత అగ్రెసివ్‌గా ఉండదు. ముఖ్యంగా, ఇది ఎక్స్ఈవీ 9ఈ, ఎక్స్‌యూవీ700 డిజైన్ ఎలిమెంట్స్‌ని ఒకే ప్యాకేజీలో పొందినట్టు అనిపిస్తుంది. ముందు భాగంలో కనిపించే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, అచ్చం ఎక్స్ఈవీ 9ఈ నుంచి తీసుకున్నట్లు కనిపిస్తాయి. సైడ్ వ్యూ, వెనుక వైపునకు వస్తే, ఈ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ700ను పోలి ఉంటుంది, అయితే దానికి కొన్ని ఈవీ-కేంద్రీకృత అంశాలు జతచేశారు.
2. ప్రీమియం, ప్రాక్టికల్ క్యాబిన్
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ క్యాబిన్ లోపల ప్రీమియంనెస్ (అత్యుత్తమ ఎక్స్‌పీరియెన్స్), ప్రాక్టికాలిటీ రెండూ కనిపిస్తాయి. ఎక్స్ఈవీ 9ఎస్ ఇంటీరియర్‌ని డిజైన్ చేసేటప్పుడు స్పేస్‌కే ప్రధాన ప్రాధాన్యత ఇచ్చినట్టు మహీంద్రా స్పష్టం చేసింది. ఇది కచ్చితంగా కనిపిస్తుంది.
త్రీ-రో సీట్ల ఏడుగురు ప్రయాణికులు సౌకర్యంగా కూర్చోవడానికి వీలు కల్పిస్తాయి. స్లైడింగ్ సెకండ్-రో సీట్లు, ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయగలిగే బాస్ మోడ్ వంటి ఇంటెలిజెంట్ స్పేస్ మేనేజ్‌మెంట్ ఫీచర్లను ప్రవేశపెట్టడం ద్వారా సౌకర్యాన్ని పెంచింది.
ట్రిపుల్ డిజిటల్ స్క్రీన్, ఆకర్షణీయమైన గేర్ షిఫ్టర్, రిట్రాక్టబుల్ పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్ల ద్వారా ప్రీమియంనెస్ అనుభూతిని పొందొచ్చు.
3. పవర్-ప్యాక్డ్ పనితీరు
ఐఎన్జీఎల్ఓ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించిన మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అద్భుతమైన పనితీరును అందిస్తుంది. దీని పవర్‌ట్రైన్ చురుకైన, శక్తివంతమైన డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది. స్టీరింగ్ చాలా తేలికగా అనిపించడంతో, మొత్తం డ్రైవింగ్ అనుభవం చాలా సున్నితంగా ఉంటుంది.
ఎత్తు ప్రాంతాల్లో హెయిర్‌పిన్ బెండ్‌లను ఎదుర్కోవడంలో, అలాగే మామూలు రోడ్లపై వెళ్లడంలో కూడా ఎక్స్ఈవీ 9ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డ్రైవింగ్‌కు సమానంగా సౌకర్యంగా అనిపించింది.
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్: ప్రతికూల అంశాలు..
1. ఖరీదైన ప్యాకేజీ
ఫ్యామిలీ ఎస్‌యూవీ అయినప్పటికీ, రూ. 19.95 లక్షల నుంచి రూ. 29.45 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్న ఈ ధర అధికంగా అనిపిస్తుంది! కుటుంబం కోసం ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయాలనుకునే చాలా మంది వినియోగదారులకు ఈ ప్రైజ్ రేంజ్ అందుబాటులో ఉండకపోవచ్చు.
2. మూడొవ వరుస సీట్లలో ఇరుకుగా అనిపించడం
మీరు మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ మూడొవ వరుస సీట్లలో కూర్చున్నప్పుడు, అది కొంచెం ఇరుకైన ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తుంది. హెడ్‌రూమ్, లెగ్ స్పేస్, నీ (మోకాలు) రూమ్ అంతగా లేకపోవడంతో, చాలా మంది వినియోగదారులకు, ముఖ్యంగా పొడవుగా ఉండే వారికి, స్పేస్ ఇరుకుగా అనిపించవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


