...
...
Next Story

Shreyas Iyer: కన్ఫమ్.. సూర్యకుమార్ ఔట్.. టీ20 కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. రేపే అనౌన్స్‌మెంట్

Shreyas Iyer: కొద్ది నెలల క్రితమే టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ అందించిన సూర్యకుమార్ యాదవ్‌పై వేటు పడనుంది. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చిన శ్రేయస్ అయ్యర్ తదుపరి టీ20 కెప్టెన్‌గా ఎంపిక కావడం దాదాపు ఖరారైంది. వైస్ కెప్టెన్‌గా తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు ఛాన్స్ దక్కనుంది.

Published on: Jun 5, 2026, 12:12:40 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Shreyas Iyer: అంతా ఫిక్స్ అయిపోయింది. టీమిండియా టీ20 ఫార్మాట్‌కు కొత్త బాస్ రాబోతున్నాడు. ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్‌లకు సంబంధించి శనివారం (జూన్ 6) అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ సమావేశం కానుండగా.. శ్రేయస్ అయ్యర్‌ను అధికారికంగా టీ20 కెప్టెన్‌గా ప్రకటించబోతున్నట్లు బీసీసీఐ (BCCI) వర్గాల నుంచి పక్కా సమాచారం అందుతోంది.

Shreyas Iyer: కన్ఫమ్.. సూర్యకుమార్ ఔట్.. టీ20 కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. రేపే అనౌన్స్‌మెంట్ (HT_PRINT)
Shreyas Iyer: కన్ఫమ్.. సూర్యకుమార్ ఔట్.. టీ20 కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. రేపే అనౌన్స్‌మెంట్ (HT_PRINT)

సూర్యకుమార్ యాదవ్‌కు ఇది నిజంగా డబుల్ షాక్ అని చెప్పాలి. కెప్టెన్సీ పోవడమే కాకుండా, పేలవమైన ఫామ్ కారణంగా ఏకంగా జట్టుకే దూరం కాబోతున్నాడు. అతడి స్థానంలో యువ ఆటగాడు, తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ దక్కే ఛాన్స్ ఉంది. డిసెంబర్ 2023 తర్వాత ఇండియా తరఫున ఒక్క టీ20 కూడా ఆడని శ్రేయస్.. ఇప్పుడు ఏకంగా కెప్టెన్‌గా రీ-ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం.

కప్పు గెలిచినా తప్పిస్తున్నారా?

ఇండియన్ క్రికెట్‌లో గత రెండేళ్లుగా ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. టైటిల్స్ గెలిపించిన కెప్టెన్లను నిర్దాక్షిణ్యంగా తప్పిస్తున్నారు. గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిన కొన్ని నెలలకే రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి, శుభ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించారు.

ఇప్పుడు ఏకంగా టీ20 వరల్డ్ కప్ గెలిపించిన సూర్యకుమార్ (35 ఏళ్లు) వంతు వచ్చింది. బైలాటరల్ సిరీస్‌లలో ఒక్కసారి కూడా ఓడిపోని రికార్డ్ సూర్యకు ఉన్నా.. అతని బ్యాటింగ్ ఫామ్ దారుణంగా పడిపోవడమే ఈ వేటుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 2025లో అతను కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.

శ్రేయస్‌కే పగ్గాలు ఎందుకు?

శ్రేయస్ అయ్యర్ 498 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 168.81గా ఉంది. లక్నోపై ఓ సెంచరీ కూడా చేశాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ విషయానికి వస్తే అతడు 270 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 147.54 కాగా.. సగటు కేవలం 20.76గా ఉంది.

ఎంట్రీ ఇవ్వనున్న 15 ఏళ్ల వండర్ కిడ్

ఇదిలా ఉంటే.. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్, 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ20ల సిరీస్‌కు ఎంపిక కావడం లాంఛనమే. దీంతో టీమిండియా తరఫున ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వండర్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు.

ఐపీఎల్ 2026లో 237.31 స్ట్రైక్ రేట్‌తో 776 రన్స్ కొట్టిన వైభవ్.. ఆరెంజ్ క్యాప్‌తో పాటు 'మోస్ట్ వాల్యుయబుల్ ప్లేయర్' అవార్డును కూడా గెలుచుకున్నాడు. జూన్ 9 నుంచి శ్రీలంక-A, ఆఫ్ఘనిస్తాన్-A జట్లతో జరిగే ట్రై-సిరీస్‌లో అతను ముందుగా ఇండియా-A తరఫున బరిలోకి దిగుతాడు.

టీమిండియా తదుపరి షెడ్యూల్

ఐర్లాండ్ సిరీస్: బెల్ఫాస్ట్ వేదికగా జూన్ 26, 28 తేదీల్లో రెండు టీ20లు.

ఇంగ్లండ్ సిరీస్: జూలై 1 నుంచి 11 వరకు ఐదు టీ20ల సిరీస్.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

టీమిండియా కొత్త టీ20 కెప్టెన్ ఎవరు?

సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా ఎంపిక కానున్నాడు. వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ బాధ్యతలు చేపట్టనున్నాడు.

సూర్యకుమార్‌ను కెప్టెన్సీ నుంచి ఎందుకు తీసేశారు?

టీ20 వరల్డ్ కప్ గెలిపించినా.. గత కొంతకాలంగా సూర్యకుమార్ బ్యాటింగ్ ఫామ్ దారుణంగా పడిపోయింది. ఐపీఎల్ 2026లోనూ అతను ఘోరంగా విఫలం కావడంతో సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

వైభవ్ సూర్యవంశీ ఎవరు?

రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న 15 ఏళ్ల యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. అతను ఐర్లాండ్ టూర్‌తో టీమిండియాలో అరంగేట్రం చేయబోతున్నాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe