ఆస్ట్రేలియాతో జరగబోయే అత్యంత ఆసక్తికరమైన వన్డే సిరీస్‌కు భారత్ తమ సన్నాహాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఆప్టస్ స్టేడియంలో జరిగిన రెండో ప్రాక్టీస్ సెషన్‌లో జట్టు దృష్టి మొత్తం విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మపైనే నిలిచింది. నెట్స్‌లోనూ, వెలుపల కూడా వీరి చుట్టూనే ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి.

అటు శ్రేయస్ అయ్యర్ తనదైన దూకుడుతో నెట్స్‌లో చెలరేగిపోగా, శుభ్‌మన్ గిల్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీతో గిల్ సంభాషణలు చాలా ప్రత్యేకంగా అనిపించాయి. యువ భారత కెప్టెన్ వివిధ రకాల బౌలింగ్‌ను ఎక్కువ సమయం ఎదుర్కొన్నాడు. ఈ సందర్భంగా, కొన్ని షాట్ల ఎంపికపై కోహ్లీని పదేపదే సలహా అడగడం కనిపించింది.
కోహ్లీ సూచనలు.. పాటించిన గిల్
ఎప్పుడూ చాలా పకడ్బందీగా ఉండే విరాట్ కోహ్లీ.. గిల్‌కు ఫుట్‌వర్క్, షాట్ ఎంపికపై అనేకసార్లు సూచనలు చేశాడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చాలా ఏకాగ్రతతో సాగింది. గిల్.. కోహ్లీ చెప్పిన సలహాలను శ్రద్ధగా విన్నాడు. కోహ్లీ తన బంతుల మధ్యలో గిల్ కు సైగలు చేస్తూ, టెక్నిక్స్ చెబుతూ కనిపించాడు. యాంగిల్స్, బ్యాక్‌లిఫ్ట్ టైమింగ్, ఫాలో-త్రూ గురించి గిల్‌తో చర్చించాడు. గిల్ చేస్తున్న పొరపాట్లపైనా కోహ్లి సూచనలు చేశాడు.
రోహిత్‌తో వ్యూహాత్మక చర్చ
నెట్ సెషన్ ముగిసిన తర్వాత గిల్ తన ప్యాడ్లు తీసివేసి.. మాజీ కెప్టెన్, భారత ప్రపంచకప్ గెలిచిన సారథి రోహిత్ శర్మ వద్దకు వెళ్లి చాలాసేపు మాట్లాడాడు. ఈ ఇద్దరూ ఆప్టస్ స్టేడియంలోని పిచ్ స్క్వేర్ వద్ద నిలబడి, సెంటర్ వైపు చూపిస్తూ ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌లు, షాట్ల ఎంపిక గురించి చర్చించారు. ఇది రాబోయే సిరీస్ కోసం వ్యూహాత్మక ప్రణాళికగా భావించవచ్చు.
గత దశాబ్దాన్ని శాసించిన ఇద్దరు దిగ్గజాలతో కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ లోతుగా చర్చించడం అక్కడ ఉన్నవారికి ప్రత్యేకంగా అనిపించింది. ఆ తరువాత గిల్ తన మెంటార్ గౌతమ్ గంభీర్‌తో కూడా క్లుప్తంగా మాట్లాడాడు. అనంతరం రోహిత్, కోహ్లీలతో కలిసి మళ్లీ గ్రూప్‌లో చేరాడు. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ కూడా ఈ ముగ్గురితో కలవడంతో... నలుగురూ నవ్వులు, సరదా కబుర్లతో గడిపారు.
రోహిత్ శర్మ సైలెంట్‌గా..
{{/usCountry}}గత దశాబ్దాన్ని శాసించిన ఇద్దరు దిగ్గజాలతో కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ లోతుగా చర్చించడం అక్కడ ఉన్నవారికి ప్రత్యేకంగా అనిపించింది. ఆ తరువాత గిల్ తన మెంటార్ గౌతమ్ గంభీర్‌తో కూడా క్లుప్తంగా మాట్లాడాడు. అనంతరం రోహిత్, కోహ్లీలతో కలిసి మళ్లీ గ్రూప్‌లో చేరాడు. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ కూడా ఈ ముగ్గురితో కలవడంతో... నలుగురూ నవ్వులు, సరదా కబుర్లతో గడిపారు.
రోహిత్ శర్మ సైలెంట్‌గా..
{{/usCountry}}కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ టీమ్ లో అనుభవజ్ఞుడైన రోహిత్ శర్మ మాత్రం చాలా నిశ్శబ్దంగా తన సెషన్ పూర్తి చేశాడు. అతను ఫిట్‌నెస్ డ్రిల్స్, క్యాచ్ ప్రాక్టీస్‌తో పాటు త్రోడౌన్‌లను ఎదుర్కొన్నాడు. అంతకుముందు కెప్టెన్ పాత్రలో కేంద్ర బిందువుగా ఉన్న రోహిత్.. ఇప్పుడు గిల్ జట్టులో సీనియర్ బ్యాటర్ గా మారాడు.
మరోవైపు ఈ సిరీస్‌లో వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్న కేఎల్ రాహుల్ నెట్స్‌కు వచ్చి స్పిన్, పేస్ బౌలింగ్‌ను శ్రద్ధగా ఎదుర్కొన్నాడు. మిడిలార్డర్ భారం మోయనున్న రాహుల్ బ్యాటింగ్ చాలా పదునుగా కనిపించింది.
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఈ ఆదివారం ఆప్టస్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. తదుపరి మ్యాచ్‌లు అక్టోబర్ 23, 25 తేదీల్లో జరుగుతాయి. ఆ తర్వాత అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.