బంగారం బాటలోనే వెండి కూడా రికార్డుల వేట మొదలుపెట్టింది. దేశీయ కమోడిటీ మార్కెట్ (MCX) చరిత్రలో సోమవారం (జనవరి 19) ఒక కీలక ఘట్టం నమోదైంది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో, పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే వెండి వైపు మొగ్గు చూపడంతో ధర కేజీకి రూ. 3,00,000 మార్కును అధిగమించింది.
ఒక్కరోజే భారీ జంప్

ఎంసీఎక్స్‌లో మార్చి 2026 కాంట్రాక్టుకు సంబంధించిన వెండి ట్రేడింగ్ రూ. 2,93,100 వద్ద ప్రారంభమైంది. మార్కెట్ గమనాన్ని బట్టి చూస్తే, ఇంట్రాడేలో ఇది గరిష్టంగా రూ. 3,01,315 స్థాయిని తాకింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లోనూ వెండి ధర 4.4 శాతం పెరిగి ఔన్సు ధర 93.85 డాలర్లకు చేరుకుంది. ఒక దశలో ఇది 94.08 డాలర్ల ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకడం విశేషం.
వెండికి ఎందుకింత డిమాండ్?
గ్రీన్ ల్యాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి.
గ్రీన్ ల్యాండ్ కొనుగోలుకు సహకరించని పక్షంలో ఐరోపా మిత్రదేశాలపై భారీగా సుంకాలు (Tariffs) విధిస్తామని ట్రంప్ శనివారం హెచ్చరించారు. దీనికి ప్రతిచర్యగా ఐరోపా సమాఖ్య (EU) కూడా ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది.
ఈ పరిణామాలతో అమెరికా డాలర్ విలువ, స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. దీంతో పెట్టుబడిదారులు తమ సొమ్మును సురక్షితంగా ఉంచుకోవడానికి బంగారం, వెండి, జపనీస్ యెన్ వంటి వాటి వైపు మళ్లుతున్నారు.
ధరలు ఇంకా పెరుగుతాయా?
వెండి ధరల భవిష్యత్తుపై నిపుణులు ఆశాజనకంగా ఉన్నారు. పారిశ్రామికంగా వెండికి ఉన్న డిమాండ్, సరఫరాలో ఉన్న లోటు ధరలకు మద్దతునిస్తున్నాయని ఎన్రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్. విశ్లేషించారు. ఎంసీఎక్స్‌లో రూ. 2,95,000 పైన ధర స్థిరపడితే.. అది రూ. 3,05,000 నుంచి రూ. 3,20,000 వరకు వెళ్లే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
మరోవైపు టెక్నికల్ అంశాలను వివరిస్తూ.. "అంతర్జాతీయంగా వెండి ధర 93 డాలర్ల పైన స్థిరంగా కొనసాగితే, త్వరలోనే 95 డాలర్లను, ఆ తర్వాత కొద్ది కాలంలోనే 100 డాలర్ల మార్కును కూడా చేరుకోవచ్చు’’ అని కమోడిటీ నిపుణుడు అనుజ్ గుప్తా వివరించారు.
{{/usCountry}}మరోవైపు టెక్నికల్ అంశాలను వివరిస్తూ.. "అంతర్జాతీయంగా వెండి ధర 93 డాలర్ల పైన స్థిరంగా కొనసాగితే, త్వరలోనే 95 డాలర్లను, ఆ తర్వాత కొద్ది కాలంలోనే 100 డాలర్ల మార్కును కూడా చేరుకోవచ్చు’’ అని కమోడిటీ నిపుణుడు అనుజ్ గుప్తా వివరించారు.
{{/usCountry}}ప్రస్తుతానికి వెండి 'బుల్లిష్' ట్రెండ్‌లో (పెరుగుదల బాటలో) ఉన్నందున, ధరలు తగ్గిన ప్రతిసారీ కొనుగోలు చేయడం లాభదాయకంగా ఉంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.
(గమనిక: ఈ వార్త కేవలం అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించండి.)