సరికొత్త హంగులతో స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్- ఫీచర్లు అదుర్స్
స్కోడా ఆటో తన పాపులర్ ఎస్‌యూవీ కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌ను ఈ వారం భారత్‌లో విడుదల చేయనుంది. అదిరిపోయే ఎల్‌ఈడీ లైటింగ్, అధునాతన అడాస్ ఫీచర్లతో వస్తున్న ఈ ఎస్‌యూవీ టీజర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఎస్‌యూవీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
భారతీయ రోడ్లపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్కోడా కుషాక్, ఇప్పుడు సరికొత్త రూపంలో మన ముందుకు వచ్చేస్తోంది. స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఈ వారంలోనే లాంచ్ కానుంది. ఈ నేపథ్యంలో స్కోడా సంస్థ ఈ ఎస్‌యూవీకి సంబంధించి వరుసగా టీజర్లను విడుదల చేస్తూ అందరిలో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే, కుషాక్ లుక్ మునుపటి కంటే మరింత షార్ప్‌గా, ప్రీమియంగా మారినట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ విశేషాలు..
2026 కుషాక్ టీజర్‌ను స్కోడా చాలా సృజనాత్మకంగా డిజైన్ చేసింది. బాలీవుడ్ క్లాసిక్ సినిమా 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే'లోని బ్యాక్‌డ్రాప్‌ను గుర్తుచేస్తూ, ఆకుపచ్చని ముసుగులో ఉన్న కారును చూపించింది. "ప్రేమలో పడటానికి సిద్ధంగా ఉండండి" అనే ట్యాగ్‌లైన్‌ని ఈ పోస్టుకు ఇచ్చింది. కేవలం ఒక అప్‌డేట్ లాగా కాకుండా, కస్టమర్లతో ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకోవాలనేది కంపెనీ ఉద్దేశమని అర్థమవుతోంది.
స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్- డిజైన్‌లో భారీ మార్పులు
బయటి వైపు జరిగిన మార్పులను గమనిస్తే, ఈ ఎస్‌యూవీ ముందు భాగంలో వెడల్పు మొత్తం విస్తరించి ఉన్న ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ స్ట్రిప్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీనికి తోడు పదునైన ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్, కొత్త గ్రిల్ డిజైన్ కారుకు మరింత అగ్రెసివ్ లుక్‌ను ఇస్తున్నాయి. వెనుక భాగంలో కూడా కనెక్టెడ్ ఎల్‌ఈడీ లైట్ బార్‌తో పాటు 'స్కోడా' అనే అక్షరాలు వెలిగే విధంగా ఏర్పాటు చేశారు. స్కోడా గ్లోబల్ డిజైన్ స్టైల్‌కు అనుగుణంగా ఈ మార్పులు ఉన్నాయి.
స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్- ఫీచర్ల జాతర.. టెక్నాలజీ అదుర్స్!
ఎస్‌యూవీ సెగ్మెంట్లో పోటీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కుషాక్ లోపల కూడా భారీ అప్‌డేట్స్ ఉండబోతున్నాయి. ముఖ్యంగా:
పనోరమిక్ సన్‌రూఫ్.
ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.
మెరుగైన గ్రాఫిక్స్‌తో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్.
స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్- మెకానికల్ మార్పులు, సేఫ్టీ..
ఇంజిన్ పరంగా పెద్ద మార్పులు లేకపోయినా, 2026 స్కోడా కుషాక్ పర్ఫార్మెన్స్ విషయంలో కొన్ని అప్‌గ్రేడ్స్ కనిపిస్తున్నాయి. 1.5 లీటర్ టీఎస్ఐ వేరియంట్లలో ఇకపై వెనుక చక్రాలకు కూడా డిస్క్ బ్రేకులు లభించే అవకాశం ఉంది. అలాగే, భద్రత కోసం లెవల్-2 అడాస్ ఫీచర్లను ఈ ఎస్‌యూవీకి సంస్థ జోడిస్తోంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీపింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లు డ్రైవింగ్‌ను మరింత సురక్షితం చేస్తాయి. అయితే
ఒక చిన్న చేదు వార్త ఏమిటంటే, 1.5 లీటర్ ఇంజిన్ కేవలం డీఎస్‌జీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తోనే వచ్చే అవకాశం ఉంది. మ్యాన్యువల్ ఆప్షన్‌ను బహుశా తొలగించవచ్చు.
కొత్తదనంతో పాటు అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు కోరుకునే ఎస్‌యూవీ ప్రియులకు ఈ కుషాక్ ఫేస్‌లిఫ్ట్ కచ్చితంగా నచ్చుతుందని సంస్థ అభిప్రాయపడుతోంది.
ఈ 2026 స్కోడా కుషాక్ లాంచ్, ధర సహా ఇతర ఫీచర్స్‌కి సంబంధించిన వివరాలు ఇంకొన్ని రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


