భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మంచి గుర్తింపు ఉన్న స్కోడా ఆటో సంస్థ.. తన పాపులర్ మిడ్‌సైజ్ సెడాన్ 'స్లావియా ఫేస్‌లిఫ్ట్'ని ఆగస్టు 18, 2026న విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే పలుమార్లు రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ కారుకు సంబంధించి కంపెనీ కొన్ని టీజర్లను కూడా విడుదల చేసింది. ప్రస్తుత మోడల్ ఇంజిన్ లైనప్ అయిన 1.0-లీటర్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్లను అలాగే కొనసాగిస్తూనే, డిజైన్, ఫీచర్ల పరంగా అనేక అప్‌డేట్లను ఈ కొత్త వెర్షన్‌లో అందిస్తున్నారు.

లాంచ్ నేపత్యంలో స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్- ఎక్స్టీరియర్..
కొత్త స్లావియా డిజైన్ మరింత షార్ప్‌గా ఉండనుంది. ముందు భాగంలో గ్రిల్ అదే ఆకారంలో ఉన్నప్పటికీ, క్రోమ్ ఫినిషింగ్‌లో మార్పులు చేశారు. హెడ్‌ల్యాంప్‌ల డిజైన్‌ను కూడా కొద్దిగా మార్చారు. ఫ్రంట్ బంపర్, ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌ను సరికొత్తగా తీర్చిదిద్దారు. సైడ్ ప్రొఫైల్ ప్రస్తుత కారును పోలి ఉన్నప్పటికీ, కొత్తగా ఐదు స్పోక్స్ గల అల్లాయ్ వీల్స్ డిజైన్‌ను ఇస్తున్నారు.
వెనుక వైపు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్‌లో మార్పులు చేసి, మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. బూట్ లిడ్ మీద వెలిగేలా 'SKODA' అక్షరాలను ముద్రించే అవకాశం ఉంది. కొత్త ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్లు కూడా ఈ ఫేస్‌లిఫ్ట్ ప్యాకేజీలో అందుబాటులోకి రానున్నాయి.
స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్- కేబిన్, అత్యాధునిక ఫీచర్లు..
కారు లోపలి డాష్‌బోర్డ్ లేఔట్ పరిచయమైనదే అయినప్పటికీ, ట్రిమ్స్, అప్హోలిస్ట్రీలో సరికొత్త మార్పులు చేశారు. అప్‌డేటెడ్ కుషాక్ నుంచి తీసుకున్న 10.25 అంగుళాల పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను ఇందులో అందించనున్నారు. సీటు అప్హోలిస్ట్రీని మార్చడంతో పాటు కొత్త ఇంటీరియర్ కలర్ కాంబినేషన్లను ప్రవేశపెట్టారు. టాప్ వేరియంట్లలో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, రియర్స్ సీట్ మసాజ్ ఫంక్షన్ వంటి సౌకర్యాలు లభించే అవకాశం ఉంది.
10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సింగిల్-పేన్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎనిమిది స్పీకర్ల ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు యథావిధిగా కొనసాగుతాయి. భద్రత విషయానికి వస్తే, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్ఐ, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ వంటి సేఫ్టీ ఫీచర్లు సమగ్రంగా లభిస్తాయి.
స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్- ఇంజిన్..
{{/usCountry}}10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సింగిల్-పేన్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎనిమిది స్పీకర్ల ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు యథావిధిగా కొనసాగుతాయి. భద్రత విషయానికి వస్తే, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్ఐ, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ వంటి సేఫ్టీ ఫీచర్లు సమగ్రంగా లభిస్తాయి.
స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్- ఇంజిన్..
{{/usCountry}}ఈ స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో అత్యంత ముఖ్యమైన మార్పు పవర్‌ట్రెయిన్‌లోనే చోటుచేసుకుంది. 1.0-లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజిన్ (116 bhp పవర్, 178 Nm టార్క్) యథావిధిగా కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు ఉన్న 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కు బదులుగా సరికొత్త 8-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జతచేశారు. ఇది సిటీ డ్రైవింగ్‌లో గేర్ షిఫ్ట్‌లను మరింత స్మూత్‌గా మారుస్తుంది. అలాగే 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.
మరోవైపు 1.5-లీటర్ ఫోర్-సిలిండర్ టీఎస్ఐ ఇంజిన్ (150 bhp పవర్, 250 Nm టార్క్) ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్, 7-స్పీడ్ డీఎస్జీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.
స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్- ధర, పోటీ..
ఆగస్టు 18న జరిగే లాంచ్ ఈవెంట్‌లో స్కోడా సంస్థ వేరియంట్ల వారీగా ధరలను ప్రకటించనుంది. కొత్త ఫీచర్లు, డిజైన్ మార్పుల కారణంగా పాత మోడల్‌తో పోలిస్తే ధర కొద్దిగా పెరిగే అవకాశం ఉంది.
మార్కెట్లో ఈ కొత్త స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్.. ఫోక్స్‌వ్యాగన్ వర్చుస్, హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ కార్లతో గట్టి పోటీ పడనుంది.