భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి గ్లోబల్ వేదికపై అరుదైన గౌరవం దక్కింది. విక్రమ్-1 రాకెట్ విజయవంతమైన స్వల్ప కాలంలోనే, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ప్రైవేట్ రాకెట్ తయారీ సంస్థ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ అంతర్జాతీయ స్థాయిలో భారీ వాణిజ్య కాంట్రాక్ట్‌ను కైవసం చేసుకుంది. అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక స్పేస్ టెక్ సంస్థ 'రిఫ్లెక్ట్ ఆర్బిటాల్' తమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు స్కైరూట్‌తో రెండు ప్రత్యేక రాకెట్ ప్రయోగ ఒప్పందాలు కుదుర్చుకుంది!
అంతరిక్షంలో 'స్పేస్ బల్బ్స్'.. కొత్త విప్లవం

అమెరికాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ సంస్థ అంతరిక్షంలో భారీ అద్దాలను (ఆర్బిటల్ రిఫ్లెక్టర్స్) ఏర్పాటు చేయడంపై పరిశోధనలు చేస్తోంది. నింగిలో అమర్చే ఈ అద్దాల ద్వారా సూర్యకాంతిని ప్రతిబింబించి, రాత్రి వేళల్లో కూడా భూమిపై ఉన్న నిర్దిష్ట ప్రాంతాలకు కాంతిని పంపడం ఈ సాంకేతికత ప్రధాన ఉద్దేశం! దీనివల్ల రాత్రి వేళల్లో కూడా సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంచవచ్చు. అంతేకాకుండా ప్రకృతి విపత్తుల సమయంలో, చీకటిగా ఉండే మారుమూల ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలకు వెలుతురు అందించేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఒక రకంగా చెప్పాలంటే అంతరిక్షంలో 'స్పేస్ బల్బ్‌లు' అమర్చే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు భారత రాకెట్లే ఊపిరి పోయనున్నాయి.
గ్లోబల్ మార్కెట్లో రాకెట్ల కొరత..
ఈ ఒప్పందం సందర్భంగా రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ కో-ఫౌండర్, సీఈఓ బెన్ నోవాక్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
"ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు రాకెట్ ప్రయోగ సేవలకు తీవ్రమైన కొరత ఉంది. ఇలాంటి సమయంలో అత్యంత నమ్మకమైన నూతన భాగస్వామిగా ఉన్న స్కైరూట్‌తో చేతులు కలపడం ఎంతో సంతోషాన్నిస్తోంది. ఇది మా స్పేస్ మిషన్లకు అవసరమైన వేగం, కచ్చితమైన సమయాన్ని అందిస్తుంది," అని ఆయన పేర్కొన్నారు.
అసమాన ప్రయాణం: ఐస్రో నుంచి అంతర్జాతీయ వేదికకు..
ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగ భారత్ డాకా 2018లో స్థాపించిన స్కైరూట్ ఏరోస్పేస్ ప్రయాణం భారత స్పేస్ టెక్ రంగానికి నిలువెత్తు నిదర్శనం. 2022లో 'విక్రమ్-ఎస్' రాకెట్‌తో భారత్‌లో తొలి ప్రైవేట్ రాకెట్‌ను విజయవంతంగా పరీక్షించి చరిత్ర సృష్టించిన ఈ సంస్థ, 2026 జులైలో చేపట్టిన 'మిషన్ ఆగమన్'తో మరో మైలురాయిని చేరుకుంది. తమ మొదటి ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1'ను తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టి, ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగాన్ని ఆకర్షించింది.
{{/usCountry}}ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగ భారత్ డాకా 2018లో స్థాపించిన స్కైరూట్ ఏరోస్పేస్ ప్రయాణం భారత స్పేస్ టెక్ రంగానికి నిలువెత్తు నిదర్శనం. 2022లో 'విక్రమ్-ఎస్' రాకెట్‌తో భారత్‌లో తొలి ప్రైవేట్ రాకెట్‌ను విజయవంతంగా పరీక్షించి చరిత్ర సృష్టించిన ఈ సంస్థ, 2026 జులైలో చేపట్టిన 'మిషన్ ఆగమన్'తో మరో మైలురాయిని చేరుకుంది. తమ మొదటి ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1'ను తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టి, ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగాన్ని ఆకర్షించింది.
{{/usCountry}}"రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ చేపడుతున్న ప్రాజెక్ట్ గ్లోబల్ స్పేస్ రంగానికి ఎంతో ముఖ్యం. విక్రమ్ శ్రేణి రాకెట్ల సామర్థ్యానికి ఈ ప్రాజెక్ట్ తగిన వేదిక. బెన్ నోవాక్ బృందంతో కలిసి రెండు ప్రత్యేక మిషన్లను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం," అని స్కైరూట్ సీఈఓ పవన్ కుమార్ చందన హర్షం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ విశ్వసనీయతకు నిదర్శనం..
దశాబ్దాల తరబడి భారత అంతరిక్ష రంగానికి ఇస్రో మాత్రమే ఏకైక చిరునామాగా ఉంటూ వచ్చింది. కానీ, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన అంతరిక్ష విధానాల వల్ల నేడు భారత్‌కు చెందిన ప్రైవేట్ సంస్థలు అంతర్జాతీయ విపణిలో అమెరికా వంటి అగ్రదేశాల కంపెనీలతో పోటీపడుతూ వాణిజ్య ఆర్డర్లను సాధిస్తున్నాయి.
స్కైరూట్ సాధించిన ఈ విజయం భారత ప్రైవేట్ స్పేస్ రంగానికి మరిన్ని గ్లోబల్ అవకాశాలకు తలుపులు తట్టనుంది.