...
...
Next Story

T20 World Cup: ద‌క్షిణాఫ్రికా హార్ట్ బ్రేక్‌-మ‌ళ్లీ చోక‌ర్స్‌గా సౌతాఫ్రికా టీమ్‌-అయ్యో పాపం అంటున్న ఇండియ‌న్ ఫ్యాన్స్‌

T20 World Cup: ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ లంటే చాలు ఒత్తిడికి చిత్తయి ఓటమి పాలవడం సౌతాఫ్రికాకు అలవాటుగా మారింది. చోకర్స్ అనే ముద్రను కొనసాగిస్తూ ఆ టీమ్ టీ20 ప్రపంచకప్ సెమీస్ లో ఓడింది. అయ్యో పాపం సౌతాఫ్రికా అంటూ ఇండియన్ ఫ్యాన్స్ సింపతీ చూపిస్తున్నారు.

Published on: Mar 5, 2026, 08:20:38 IST
Advertisement

గ్రూప్ స్టేజీలో అదరగొట్టడం.. సూపర్-8లో సత్తాచాటడం.. కానీ నాకౌట్ మ్యాచ్ ల్లోకి వచ్చేసరికి మాత్రం బొక్కబోర్లా పడటం.. ఐసీసీ ప్రపంచకప్ ల్లో సౌతాఫ్రికా బ్యాడ్ లక్ ఇలాగే కొనసాగుతోంది. కీలక మ్యాచ్ ల్లో ఓడుతున్న దక్షిణాఫ్రికా చోకర్స్ అనే ముద్రను నిలబెట్టుకుంటూనే ఉంటుంది. తాజాగా టీ20 ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో సౌతాఫ్రికా చిత్తయింది.

టీ20 ప్రపంచకప్ 2026

ఓటమి బాధలో దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్ క్రమ్ (PTI)
ఓటమి బాధలో దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్ క్రమ్ (PTI)

సౌతాఫ్రికా టీమ్ ఇప్పటివరకూ ఒక్క ప్రపంచకప్ కూడా గెలవలేదు. ఆ టీమ్ వరల్డ్ కప్ కల కలగానే మిగిలిపోతుంది. ఈ టీ20 ప్రపంచకప్ 2026లో గ్రూప్, సూపర్-8 స్టేజీలో దక్షిణాఫ్రికా అదరగొట్టింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వరుసగా 7 మ్యాచ్ ల్లో గెలిచింది.

గ్రూప్-డిలో ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో విజయాలు సాధించింది. ఈ గ్రూప్ లో న్యూజిలాండ్ ను కూడా ఓడించింది. ఆ తర్వాత సూపర్-8లో వరుసగా ఇండియా, వెస్టిండీస్, జింబాబ్వేను ఓడించింది.

సెమీస్ లో చిత్తు

టీ20 ప్రపంచకప్ 2026లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్ చేరిన టీమ్ సౌతాఫ్రికా మాత్రమే. ఈ సారి పక్కా టైటిల్ గెలుస్తుందేమోనన్న హైప్ ను ఆ టీమ్ క్రియేట్ చేసింది. కానీ నాకౌట్ మ్యాచ్ ల్లో చిత్తయ్యే వీక్ నెస్ ను సౌతాఫ్రికా మరోసారి బయటపెట్టింది. బుధవారం (మార్చి 4) రాత్రి ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన సెమీస్ లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో చిత్తయింది.

ఆ ప్రెషర్

కీలకమైన నాకౌట్ మ్యాచ్ ల్లో ఒత్తిడిని తట్టుకోలేక ఓడిపోయే టీమ్స్ ను చోకర్స్ అని పిలుస్తారు. క్రికెట్లో సౌతాఫ్రికాను అదే పేరుతో పిలుస్తున్నారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో ఈ టీమ్ 1992, 1999, 2007, 2015, 2023లో సెమీస్ లో ఓడింది. 1996, 2011లో క్వార్టర్స్ లో పరాజయం పాలైంది.

టీ20 ప్రపంచకప్ లోనేమో 2009, 2014లో సెమీఫైనల్లో ఇంటి ముఖం పట్టింది. 2024లో ఫైనల్లో ఇండియా చేతిలో ఓడింది.

ఇండియన్ ఫ్యాన్స్

మన ఇండియన్ ఫ్యాన్స్ సపోర్ట్ చేసే క్రికెట్ టీమ్స్ లో సౌతాఫ్రికా కూడా ఒకటి. ఆ టీమ్ మరోసారి ప్రపంచకప్ నాకౌట్లో ఓడిపోవడంతో ‘అయ్యో పాపం’ అంటూ ఆ టీమ్ కు మనవాళ్లు సింపతీ తెలుపుతున్నారు. హార్ట్ బ్రేక్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe