ప్రపంచ అంతరిక్ష పరిశోధనా రంగంలో దశాబ్దాలుగా సాగుతున్న కల ఎట్టకేలకు నిజమైంది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ‘స్పేస్ఎక్స్’ సంస్థ శనివారం (స్థానిక కాలమానం ప్రకారం) మునుపెన్నడూ జరగని అద్భుతాన్ని ఆవిష్కరించింది. అంతరిక్ష యాత్ర ముగించుకుని భూమి వైపు దూసుకొచ్చిన భారీ 'స్టార్‌షిప్' వ్యోమనౌకను, నేలను తాకకముందే గాల్లోనే సురక్షితంగా ఒడిసిపట్టుకుంది! తద్వారా పూర్తిస్థాయిలో మళ్లీ మళ్లీ వాడుకోగలిగే (రాకెట్ వ్యవస్థల రూపకల్పనలో ఒక చారిత్రక మైలురాయిని అధిగమించింది.

రాకెట్ ప్రయోగాల ఖర్చును తగ్గించి, విమాన ప్రయాణాల తరహాలో అంతరిక్ష యాత్రలను సులభతరం చేయడానికి ప్రపంచ దేశాలు పోటీపడుతున్నాయి. ఈ తరుణంలో స్పేస్ఎక్స్ సాధించిన ఈ విజయం అంతర్జాతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థతో పాటు భవిష్యత్తులో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్న స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు కొత్త ఊపునివ్వనుంది.
నిప్పులు చెరుగుతూ దిగొచ్చి.. వాలిపోయింది!
రాయిటర్స్ కథనం ప్రకారం.. టెక్సాస్‌లోని అమెరికా-మెక్సికో సరిహద్దుకు సమీపంలో ఉన్న స్పేస్ఎక్స్ ‘స్టార్‌బేస్’ ప్రయోగ కేంద్రం వద్ద ఈ అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. దట్టమైన మేఘాలను చీల్చుకుంటూ 171 అడుగుల ఎత్తయిన స్టార్‌షిప్ వ్యోమనౌక కిందికి దూసుకొచ్చింది. నేలను తాకే కొన్ని క్షణాల ముందు తన ఇంజిన్లను మళ్లీ మండించి నిలువుగా మారింది. అనంతరం ఇంజిన్లు గర్జిస్తుండగానే నెమ్మదిగా కిందికి దిగుతూ, లాంచ్ టవర్‌కు అమర్చిన ‘మెకాజిల్లా’ అనే భారీ యంత్రపు చేతుల మధ్యలోకి కచ్చితంగా ఒదిగిపోయింది. అంతరిక్షం నుంచి తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు ఎదురైన తీవ్రమైన వేడికి వ్యోమనౌక బయటి భాగం నల్లగా కాలిపోయినప్పటికీ, ఇంజిన్లను ఆపివేసి నిశ్చలంగా గాల్లో వేలాడుతూ నిలిచింది.
22 గంటల సుదీర్ఘ ప్రయాణం.. 26 స్టార్‌లింక్ ఉపగ్రహాల ప్రయోగం
ప్రపంచంలోనే అత్యంత పెద్దది, శక్తివంతమైనదిగా పేరుగాంచిన 124 మీటర్ల భారీ రాకెట్ శుక్రవారం సాయంత్రం స్టార్‌బేస్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. తొలి దశ బూస్టర్ నుంచి విడిపోయిన తర్వాత, పైభాగంలోని స్టార్‌షిప్ వ్యోమనౌక విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. అక్కడ 26 అధునాతన స్టార్‌లింక్ ఉపగ్రహాలను కక్ష్యలోకి విడిచిపెట్టింది. భూమికి 265 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ, స్టార్‌లింక్ ద్వారా తనను తాను, భూమి దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేసింది. గత మిషన్‌లో కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే భూమి చుట్టూ తిరిగిన స్టార్‌షిప్, ఈసారి ఏకంగా 22 గంటల పాటు ప్రయాణించి భూమి చుట్టూ 14 చక్కర్లు పూర్తి చేయడం విశేషం.
అంతరిక్ష యాత్రలో ఇదే అసలైన విజయం.. బూస్టర్ విఫలమైనా!
{{/usCountry}}ప్రపంచంలోనే అత్యంత పెద్దది, శక్తివంతమైనదిగా పేరుగాంచిన 124 మీటర్ల భారీ రాకెట్ శుక్రవారం సాయంత్రం స్టార్‌బేస్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. తొలి దశ బూస్టర్ నుంచి విడిపోయిన తర్వాత, పైభాగంలోని స్టార్‌షిప్ వ్యోమనౌక విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. అక్కడ 26 అధునాతన స్టార్‌లింక్ ఉపగ్రహాలను కక్ష్యలోకి విడిచిపెట్టింది. భూమికి 265 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ, స్టార్‌లింక్ ద్వారా తనను తాను, భూమి దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేసింది. గత మిషన్‌లో కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే భూమి చుట్టూ తిరిగిన స్టార్‌షిప్, ఈసారి ఏకంగా 22 గంటల పాటు ప్రయాణించి భూమి చుట్టూ 14 చక్కర్లు పూర్తి చేయడం విశేషం.
అంతరిక్ష యాత్రలో ఇదే అసలైన విజయం.. బూస్టర్ విఫలమైనా!
{{/usCountry}}ఈ సుదీర్ఘ ప్రయాణంలో వ్యోమనౌకలోని కీలకమైన హీట్ షీల్డ్ (వేడిని తట్టుకునే కవచం) సహా అన్ని వ్యవస్థలు అద్భుతంగా పనిచేశాయని స్పేస్ఎక్స్ వెల్లడించింది. "అంతరిక్ష ప్రయాణాల్లో ఇదే అసలైన మైలురాయి. అగ్నిగోళంలా దూసుకొస్తున్న వ్యోమనౌకను గాల్లోనే ఉక్కు చేతులతో ఒడిసిపట్టుకున్నాం. స్టార్‌షిప్‌ను పట్టుకోవడంతో ఇకపై అంతరిక్ష రంగంలో సమీకరణాలన్నీ మారిపోతాయి," అని స్పేస్ఎక్స్ ప్రతినిధి డాన్ హువోట్ ఉద్వేగంగా పేర్కొన్నారు.
నిజానికి శుక్రవారం రాకెట్ నింగిలోకి ఎగిరిన కొద్దిసేపటికే మొదటి దశ బూస్టర్ పేలిపోయింది. అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం, ఆ బూస్టర్ శకలాలు గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్ర జలాల్లో పడిపోగా, చుట్టూ హెచ్చరిక వలయాన్ని ఏర్పాటు చేశారు. గతంలో మూడుసార్లు బూస్టర్లను స్పేస్ఎక్స్ విజయవంతంగా పట్టుకున్నప్పటికీ, ఈసారి బూస్టర్ రికవరీ విఫలమైంది. అయినప్పటికీ, అసలైన స్టార్‌షిప్ వ్యోమనౌకను సురక్షితంగా పట్టుకోవడం ద్వారా రాకెట్ వ్యవస్థ పూర్తిస్థాయి పునర్వినియోగ సామర్థ్యాన్ని కంపెనీ నిరూపించుకుంది.
జనావాసాలకు దూరంగా.. గాల్లోనే అద్భుత విన్యాసం
భూమికి తిరిగి వచ్చే క్రమంలో జనావాసాలకు ఎలాంటి ముప్పు కలగకుండా స్టార్‌షిప్ ప్రయాణ మార్గాన్ని అత్యంత జాగ్రత్తగా రూపొందించారు. జనసంచారం తక్కువగా ఉండే ఎడారి ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తూ, పట్టణాలను తప్పించుకుని, చివరి దశలో టెక్సాస్‌లోని రియో గ్రాండే వ్యాలీ నగరాల చుట్టూ ఒక భారీ మలుపు తిరిగి తూర్పు దిశగా ల్యాండింగ్ సైట్‌కు చేరుకుందని స్పేస్ఎక్స్ సీనియర్ ఇంజనీర్ లార్స్ బ్లాక్‌మోర్ వివరించారు.
2023 నుంచి ఇప్పటివరకు పూర్తిస్థాయి స్టార్‌షిప్‌కు ఇది 15వ ప్రయోగం కాగా, కక్ష్యలోకి వెళ్లడం ఇది రెండోసారి మాత్రమే. బూస్టర్లతో పోలిస్తే స్టార్‌షిప్ వ్యోమనౌక చాలా ఎక్కువ ఎత్తు నుంచి, అత్యంత వేగంగా కిందికి దూసుకొస్తుంది కాబట్టి దీనిని గాల్లో పట్టుకోవడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ!
వాణిజ్య విమానాల మాదిరిగానే రాకెట్లు కూడా అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి వచ్చి, తక్కువ ఖర్చుతో వెంటనే తదుపరి ప్రయాణానికి సిద్ధమయ్యే రోజును తీసుకురావాలన్న ఎలాన్ మస్క్ లక్ష్యం ఈ విజయంతో మరింత చేరువైంది.