దివంగత బాలీవుడ్ నటి శ్రీదేవి కుటుంబానికి చెందిన చెన్నైలోని విలువైన భూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 1988 సేల్ డీడ్ ద్వారా శ్రీదేవి సొంతం చేసుకున్న 2.7 ఎకరాల స్థలంపై దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఇరు వర్గాలు కూర్చుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది. వివాద పరిష్కారం కోసం విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తిని మధ్యవర్తిగా నియమిస్తామని స్పష్టం చేసింది. జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేసింది.
ఏంటి ఈ 2.7 ఎకరాల వివాదం?

1988లో చెన్నై షోలింగనల్లూర్ పరిధిలో శ్రీదేవి 2.7 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 2018లో శ్రీదేవి మరణించిన తర్వాత, ఈ ఆస్తిని ఆమె భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌ల పేర్లపైకి మార్చారు. ఆ స్థలం అసలు యజమాని ఎంసీ చంద్రశేఖరన్ అని, తామే ఆయన చట్టబద్ధ వారసులమని పేర్కొంటూ ముగ్గురు వ్యక్తులు రంగంలోకి దిగారు. శ్రీదేవి పేరిట ఉన్న 1988 సేల్ డీడ్‌ను రద్దు చేయాలని కోరుతూ వారు 2025 జనవరిలో చెన్నైలోని విచారణ కోర్టును ఆశ్రయించారు.
ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు..
ఈ కేసును కొట్టివేయాలని బోనీ కపూర్ వేసిన పిటిషన్‌ను విచారణ కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం, 2026 ఏప్రిల్‌లో మద్రాస్ హైకోర్టు బోనీ కపూర్‌కు అనుకూలంగా తీర్పునిస్తూ, పిటిషనర్ల దావాను రద్దు చేసింది. శ్రీదేవి మరణాంతరం 2023లో టైటిల్ మార్పు సమయంలోనే ఈ కొనుగోలు గురించి తెలిసిందనడం నమ్మశక్యంగా లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ చంద్రశేఖరన్ వారసులుగా చెప్పుకుంటున్న వ్యక్తులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు.
సుప్రీంకోర్టులో వాదనలు
బోనీ కపూర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. ఎంసీ సంబంధ ముదలియార్ కుటుంబానికి షోలింగనల్లూర్ గ్రామంలో 206 ఎకరాలకు పైగా భూమి ఉండేదని తెలిపారు. అందులో 2.7 ఎకరాలు మినహా మిగిలిన స్థలాన్ని ఉమ్మడి కుటుంబానికి ఇచ్చేశారని, ఆ 2.7 ఎకరాలను అనుభవిస్తున్న ముదలియార్ కుమారుల్లో ఒకరైన నిత్యానందం 1988లో శ్రీదేవికి విక్రయించారని వివరించారు.
{{/usCountry}}బోనీ కపూర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. ఎంసీ సంబంధ ముదలియార్ కుటుంబానికి షోలింగనల్లూర్ గ్రామంలో 206 ఎకరాలకు పైగా భూమి ఉండేదని తెలిపారు. అందులో 2.7 ఎకరాలు మినహా మిగిలిన స్థలాన్ని ఉమ్మడి కుటుంబానికి ఇచ్చేశారని, ఆ 2.7 ఎకరాలను అనుభవిస్తున్న ముదలియార్ కుమారుల్లో ఒకరైన నిత్యానందం 1988లో శ్రీదేవికి విక్రయించారని వివరించారు.
{{/usCountry}}1995లో చంద్రశేఖరన్ మరణించే వరకు ఈ విక్రయాన్ని సవాలు చేయలేదని, దాదాపు 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు కేసు వేయడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని సింఘ్వి పేర్కొన్నారు. చంద్రశేఖరన్‌కు ఆ స్థలంలో ఐదో వంతు వాటా ఉందా అనే అంశమే ఇక్కడ కీలకమని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ, మధ్యవర్తి ద్వారా సమస్యను ముగించాలని ఇరువర్గాలకు సూచించింది.