...
...
Next Story

SSC CGL Job Notification : 12,256 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు - ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ నోటిఫికేషన్‌ విడుదల, ఇదిగో లింక్

SSC CGL Job Notification 2026 : కేంద్ర ప్రభుత్వ విభాగాలు, వాటి అనుబంధ కార్యాలయాల్లో గ్రూప్‌- బి, గ్రూప్‌- సి పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జూన్ 22, 2026 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 12,256 ఖాళీలను భర్తీ చేస్తారు.

Published on: May 22, 2026, 17:30:01 IST
Advertisement

SSC CGL Job Notification 2026 : కేంద్ర ప్రభుత్వ విభాగాలలో గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రతిష్టాత్మకమైన 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్' (CGL) ఎగ్జామినేషన్ 2026 కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను ఎస్ఎస్‌సీ ప్రారంభించింది. డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు ఎస్ఎస్‌సీ అధికారిక కొత్త వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్ఎస్‌సీ సీజీఎల్ నోటిఫికేషన్ విడుదల
ఎస్ఎస్‌సీ సీజీఎల్ నోటిఫికేషన్ విడుదల

నోటిఫికేషన్ ప్రకారం…. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు జూన్ 22, 2026ను చివరి తేదీగా నిర్ణయించారు. 2026 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల లోపు (పోస్టుల వారీగా వయస్సులో స్వల్ప తేడాలు ఉన్నాయి) ఉన్న వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు. కేటగిరీల ఆధారంగా వయో పరిమితిలో సడలింపు కల్పించారు.

దరఖాస్తు ఫారమ్‌లలో తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి అభ్యర్థులకు ఎడిట్ (Correction Window) సదుపాయాన్ని కూడా కల్పించనున్నారు. జూన్ 29, 2026న ఈ కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. జూలై 1, 2026 రాత్రికి క్లోజ్ అవుతుంది.

ఎంపిక విధానం:

ఎస్ఎస్‌సీ సీజీఎల్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా రెండు అంచెల్లో నిర్వహిస్తారు.

  • టైర్-1 పరీక్ష (Tier-I): ఈ పరీక్ష 2026 ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో జరగనుంది.
  • టైర్-2 పరీక్ష (Tier-II): టైర్-1లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు డిసెంబర్ 2026 లో టైర్-2 పరీక్షను నిర్వహిస్తారు.

ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలను షిఫ్టులలో (Multiple Shifts) నిర్వహించినప్పుడు, అభ్యర్థులు సాధించిన మార్కులను నార్మలైజేషన్ (Normalisation) చేస్తారు. ఈ నార్మలైజ్డ్ స్కోర్ ఆధారంగానే తుది మెరిట్ లిస్ట్, కటాఫ్ మార్కులను నిర్ణయిస్తారు.

ఈ పరీక్షకు దరఖాస్తు రుసుముగా రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు, షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), బెంచ్ మార్క్ వైకల్యాలున్న వ్యక్తులు (PwBD) మరియు మాజీ సైనికోద్యోగుల (ESM) కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తుకు చివరి తేదీ: 22.06.2026 (రాత్రి 11:00 గంటల వరకు).
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 23.06.2026.
  • అప్లికేషన్ కరెక్షన్ విండో: 29.06.2026 నుంచి 01.07.2026 వరకు.
  • అధికారిక వెబ్ సైట్ - https://ssc.gov.in/login

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe