తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా, మెజారిటీకి 118 సీట్లు అవసరం. ప్రస్తుతం విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పరిస్థితి ఇలా ఉంది:

టీవీకే గెలిచిన స్థానాలు: 108
కాంగ్రెస్ మద్దతు: 05
మొత్తం బలం: 113
కావాల్సిన అదనపు సీట్లు: 05
విజయ్ ఇప్పటికే గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కోరారు. అయితే, స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో గవర్నర్ న్యాయ నిపుణుల సలహా కోరారు. ఈ లోపు రాజ్‌భవన్‌లో ‘వెయిట్ అండ్ వాచ్’ పర్వం నడుస్తోంది.
స్టాలిన్ ఏమన్నారంటే..? “ఆరు నెలలు డిస్టర్బ్ చేయం!”
విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తాము ఆటంకాలు సృష్టించబోమని స్టాలిన్ స్పష్టం చేశారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే:
"ప్రజలు ఎన్నుకున్న పార్టీగా టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు మేము వేచి చూస్తాం. కనీసం ఆరు నెలల పాటు వారిని ఇబ్బంది పెట్టకుండా గమనిస్తాం. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం రావడం మాకు ఇష్టం లేదు."
అయితే, ఇదే సమయంలో విజయ్ ఇచ్చిన హామీలపై స్టాలిన్ సెటైర్లు వేశారు. ముఖ్యంగా మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామన్న హామీ ఆచరణ సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. "మేము ఇచ్చిన రూ. 1,000 కనీసం అమలు చేయండి చాలు" అంటూ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాఠశాల విద్యార్థుల ఉచిత అల్పాహార పథకం, మహిళల నెలవారీ భృతి వంటి పథకాలను కొత్త ప్రభుత్వం కూడా కొనసాగించాలని ఆయన సూచించారు.
గవర్నర్ నిర్ణయంపైనే సర్వత్రా ఆసక్తి
సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న విజయ్ను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలా? లేక మద్దతు ఉన్న ఎమ్మెల్యేలందరినీ వ్యక్తిగతంగా హాజరుపరచమని కోరాలా? అనే అంశంపై గవర్నర్ తర్జనభర్జన పడుతున్నారు. టీవీకే మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యేల జాబితాను విజయ్ ఇప్పటికే సమర్పించినప్పటికీ, మరో ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు ఎక్కడి నుండి వస్తుందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.
{{/usCountry}}సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న విజయ్ను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలా? లేక మద్దతు ఉన్న ఎమ్మెల్యేలందరినీ వ్యక్తిగతంగా హాజరుపరచమని కోరాలా? అనే అంశంపై గవర్నర్ తర్జనభర్జన పడుతున్నారు. టీవీకే మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యేల జాబితాను విజయ్ ఇప్పటికే సమర్పించినప్పటికీ, మరో ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు ఎక్కడి నుండి వస్తుందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.
{{/usCountry}}మరోవైపు, అన్నాడీఎంకే తమకు మద్దతు ఇవ్వడం లేదని ఖచ్చితంగా చెప్పేయడం, లెఫ్ట్ పార్టీలు డీఎంకే వెంటే ఉంటామని ప్రకటించడంతో విజయ్ ఆ ఐదు సీట్ల కోసం స్వతంత్రులు లేదా ఇతర చిన్న పార్టీల వైపు చూస్తున్నారు.
ఆ 5 తేలాలి
విజయ్ రాజకీయాల్లోకి రావడం ఒక ఎత్తు అయితే, రాగానే ద్రవిడ కోటలను బద్దలు కొట్టడం మరో ఎత్తు. కానీ, అధికారం దక్కించుకోవడానికి కావాల్సిన ఆ 5 సీట్ల లెక్క తేలితేనే చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో విజయ్ ‘ప్రమాణ స్వీకారం’ సాధ్యమవుతుంది. స్టాలిన్ చెప్పినట్లు డీఎంకే ఆరు నెలలు ‘సైలెంట్’గా ఉన్నా, గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇక్కడ అత్యంత కీలకం.