ఫార్మాస్యూటికల్, కెమికల్, బయోటెక్నాలజీ, ఫుడ్ అండ్ బెవరేజెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ పరిశ్రమలకు సమగ్ర ఇంజినీరింగ్ సొల్యూషన్స్ అందించే ప్రముఖ సంస్థ 'స్టాండర్డ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్' (SETL) 2026 సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికం (Q2), అర్ధ వార్షిక (H1) ఆర్థిక ఫలితాలను గురువారం నాడు ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన కంపెనీ ఆదాయం, లాభాలు రికార్డు స్థాయిలో వృద్ధి నమోదు చేసి ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయి.
రెండో త్రైమాసికం (Q2 FY27) ముఖ్యాంశాలు

సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆర్థిక ప్రదర్శన మెరుగైన రీతిలో సాగింది.
మొత్తం ఆదాయం: గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 62.3 శాతం పెరిగి రూ.296.6 కోట్లకు చేరింది.
ఎబిటా (EBITDA): 79.7 శాతం వృద్ధితో రూ.51.4 కోట్లుగా నమోదైంది. ఎబిటా మార్జిన్ 17.3 శాతానికి చేరుకుంది.
నికర లాభం (PAT): గతేడాది కంటే 37.9 శాతం ఎగబాకి రూ.28.2 కోట్లకు చేరింది.
తొలి అర్ధభాగం (H1 FY27) ప్రదర్శన
2026-27 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల (H1) కాలానికి గాను కంపెనీ మెరుగైన ఆపరేటింగ్ గణాంకాలను నమోదు చేసింది.
మొత్తం ఆదాయం: గతేడాది కంటే 53.0 శాతం వృద్ధితో రూ.544.3 కోట్లకు పెరిగింది.
ఎబిటా (EBITDA): 56.5 శాతం పెరిగి రూ.91.0 కోట్లుగా నమోదైంది. మార్జిన్ 16.7 శాతంగా ఉంది.
నికర లాభం (PAT): 32.2 శాతం వృద్ధితో రూ.54.9 కోట్లకు చేరింది.
వ్యాపార విస్తరణ.. ముఖ్యాంశాలు
కంపెనీ తన వ్యాపార విభాగాలలో వేగవంతమైన పురోగతిని సాధించింది.
కోర్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్: ఫార్మా, కెమికల్, ఏఐ డేటా సెంటర్ విభాగాల్లో ఎండ్-టు-ఎండ్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్‌కు డిమాండ్ పెరగడంతో కోర్ బిజినెస్ బలంగా పుంజుకుంది.
సీడీఎంవో (CDMO) అవకాశాలు: కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ (CDMO) కస్టమర్ల నుంచి భారీగా కొత్త ఆర్డర్లు వచ్చాయి. భవిష్యత్తు ఆర్డర్లపై స్పష్టత ఉనట్లు సంస్థ తెలిపింది.
{{/usCountry}}సీడీఎంవో (CDMO) అవకాశాలు: కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ (CDMO) కస్టమర్ల నుంచి భారీగా కొత్త ఆర్డర్లు వచ్చాయి. భవిష్యత్తు ఆర్డర్లపై స్పష్టత ఉనట్లు సంస్థ తెలిపింది.
{{/usCountry}}ఎగుమతుల జోరు: అమెరికా, యూరప్ దేశాల నుంచి ఎగుమతి విచారణలు (Export Enquiries) విపరీతంగా పెరిగాయి. వీటిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.
జీఎల్ హాక్కో భాగస్వామ్యం: గ్లాస్-లైనింగ్ సాంకేతికత, అడ్వాన్స్డ్ ఇంజినీరింగ్ సామర్థ్యాలను బలోపేతం చేసుకునేందుకు గాను 'జిఎల్ హాక్కో'లో 19.19 శాతం వాటాతో తొలి దశ భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంది.
జీస్కేల్ (GScale) - AI డేటా సెంటర్ ప్రాజెక్ట్ అప్డేట్
ఏఐ డేటా సెంటర్ల విభాగంలో కంపెనీ చేపడుతున్న 'జీస్కేల్' ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి.
సెకండరీ ఫ్లూయిడ్ నెట్వర్క్ (SFN): యంత్రాల ఆర్డర్లు పూర్తయ్యాయి. పరికరాల రాక కూడా ప్రారంభమైంది. ఈ విభాగం నుంచి 2026 డిసెంబర్ 15 నాటికి ఆదాయ ఉత్పత్తి ప్రారంభమవుతుంది.
పవర్ ప్రొడక్ట్స్: యంత్రాల ఆర్డర్లు పూర్తయ్యాయి. 2026 నవంబర్ 15 నుంచి డెలివరీలు ప్రారంభం కానుండగా, 2027 జనవరి 15 నాటికి ఉత్పాదన మొదలవుతుంది.
ఆదాయ లక్ష్యం: ముందుగా ప్రకటించిన విధంగానే 2026-27 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4 FY27) నాటికి 'జీస్కేల్' విభాగం నుంచి రూ.250 కోట్లకు పైగా ఆదాయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వ్యాఖ్యలు
Q2, H1 ఫలితాలపై స్టాండర్డ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నాగేశ్వరరావు కందుల ఆనందం వ్యక్తం చేశారు. "మా ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్ బిజినెస్ బలం, ఆర్డర్ల ప్రవాహం, ఎగుమతి అవకాశాలు, జీస్కేల్ ప్రాజెక్టు పురోగతి వల్లనే Q2, H1లలో ఈ స్థాయి ఫలితాలు సాధించగలిగాం. ఫార్మా, ఏఐ డేటా సెంటర్ రంగాలకు సేవలు అందిస్తున్న ప్రముఖ సంస్థగా రాబోయే త్రైమాసికాల్లోనూ ఇదే వృద్ధి వేగాన్ని కొనసాగిస్తామని నమ్మకంతో ఉన్నాం" అని ఆయన స్పష్టం చేశారు.