...
...
Next Story

Helmet for kids : పిల్లల కోసం స్టీల్​బర్డ్​ డూడుల్​ హెల్మెట్ లాంచ్- అతి తక్కువ ధరకే!

Steelbird Doodle : ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే చిన్న పిల్లల భద్రత కోసం ప్రముఖ హెల్మెట్ల తయారీ సంస్థ ‘స్టీల్‌బర్డ్’ సరికొత్త డూడుల్ సిరీస్‌ని మార్కెట్లోకి తెచ్చింది. ఈ హెల్మెట్​ ఫీచర్లు, ధర సహా ఇతర వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Jul 12, 2026, 11:19:15 IST
Advertisement

భారతదేశంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే బైక్‌లపై పెద్దలతో పాటు ప్రయాణించే చిన్న పిల్లల భద్రతను చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. మార్కెట్లోనూ పిల్లల కోసం ప్రత్యేకమైన, సురక్షితమైన హెల్మెట్లు పెద్దగా అందుబాటులో లేవు. ఈ లోటును భర్తీ చేస్తూ ప్రముఖ రైడింగ్ గేర్ తయారీ సంస్థ ‘స్టీల్‌బర్డ్ హై-టెక్ ఇండియా’ ఒక కొత్త ప్రాడక్ట్​ని తీసుకొచ్చింది. బైక్‌లపై వెనుక కూర్చునే చిన్న పిల్లల (చైల్డ్ పిలియన్ రైడర్స్) కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘డూడుల్’ హెల్మెట్ సిరీస్‌ను తాజాగా ఆవిష్కరించింది.

పిల్లల కోసం ప్రత్యేక డిజైన్.. మెడపై భారం పడదు!

స్టీల్​బర్డ్​ డూడుల్​ హెల్మెట్​..
స్టీల్​బర్డ్​ డూడుల్​ హెల్మెట్​..

చిన్న పిల్లల శారీరక ఆకృతి, వారి భద్రతా అవసరాలపై విస్తృతంగా పరిశోధనలు చేసిన తర్వాతే ఈ డూడుల్ హెల్మెట్లను ఇంజనీరింగ్ చేసినట్లు కంపెనీ తెలిపింది. సాధారణంగా పెద్దలు వాడే హెల్మెట్లు బరువుగా ఉండటం వల్ల పిల్లల మెడపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని డూడుల్ హెల్మెట్ల బరువును కేవలం 700 గ్రాములు (50 గ్రాములు అటు, ఇటు) ఉండేలా డిజైన్ చేశారు. ఇది పిల్లల మెడపై ఎలాంటి ఒత్తిడిని కలిగించదు.

ఈ హెల్మెట్లు స్పాయిలర్, నాన్-స్పాయిలర్ అనే రెండు వేరియంట్లలో లభిస్తాయి. పిల్లల తల పరిమాణాన్ని బట్టి XXXS నుంచి M సైజుల వరకు (50 సెం.మీ నుంచి 58 సెం.మీ వరకు) ఇవి అందుబాటులో ఉంటాయి. పిల్లలు వీటిని ఇష్టంగా ధరించేలా ఆకర్షణీయమైన రంగులు, గ్రాఫిక్స్ డిజైన్లతో వీటిని తీర్చిదిద్దారు.

లగ్జరీ ఫీచర్లు.. అత్యున్నత భద్రత!

రూపాయి తక్కువైనా స్టీల్​బర్డ్​ డూడుల్​ హెల్మెట్​లో నాణ్యతలో రాజీ పడకుండా ఐఎస్ఐ సర్టిఫికేషన్‌తో మార్కెట్లోకి తెచ్చారు.

మన్నికైన మెటీరియల్: అత్యంత బలమైన ఏబీఎస్ షెల్, ప్రమాదాల సమయంలో షాక్‌ను తట్టుకునేలా ఈపీఎస్ లైనర్‌ను వాడారు.

సౌకర్యం: యాంటీ-ఓడర్ లైనర్, గాలి లోపలికి సులువుగా వెళ్లి వచ్చేలా ఎయిర్ వెంట్స్ ఉన్నాయి.

లాకింగ్ సిస్టమ్: ఈ పిల్ల హెల్మెట్​ని సులభంగా లాక్ చేసుకునేందుకు మైక్రోమెట్రిక్ బకిల్ సిస్టమ్ అందించారు.

స్టీల్​బర్డ్​ డూడుల్​ ధర ఎంత? ఎక్కడ దొరుకుతాయి?

చిన్న పిల్లల భద్రత అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో స్టీల్‌బర్డ్ డూడుల్ హెల్మెట్ సిరీస్ ప్రారంభ ధరను కేవలం రూ. 999గా నిర్ణయించారు. ఈ హెల్మెట్లు భారతదేశం అంతటా ఉన్న స్టీల్‌బర్డ్ అధీకృత డీలర్లు, ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంటాయి.

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ ప్లాంట్.. ఐదేళ్ల రోడ్‌మ్యాప్!

కొత్త ప్రాడక్ట్ లాంచ్‌తో పాటు స్టీల్‌బర్డ్ సంస్థ తన వ్యాపార విస్తరణ ప్రణాళికలను కూడా ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని బద్దిలో 22 ఎకరాల భారీ విస్తీర్ణంలో తన 7వ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే పనులను ప్రారంభించింది. సుమారు 15 లక్షల చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాతో రాబోయే ఈ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ద్వారా ఏటా అదనంగా 1 కోటి హెల్మెట్లను తయారు చేయనున్నారు. దీనివల్ల 2032 నాటికి కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.5 కోట్ల యూనిట్ల నుండి 2.5 కోట్ల యూనిట్లకు పెరుగుతుంది.

భవిష్యత్తు అవసరాల కోసం సరికొత్త ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నట్లు సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా ప్రీమియం హెల్మెట్లు, బ్లూటూత్ కనెక్టివిటీ గల స్మార్ట్ హెల్మెట్లు, ఇన్-బిల్ట్ లైటింగ్ సిస్టమ్స్ వంటి అధునాతన ఉత్పత్తులను అంతర్జాతీయ ప్రమాణాలతో తీసుకురానున్నట్లు సంస్థ వెల్లడించింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe