దీపావళి పండుగ సంబరాల వేళ దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు కీలక అలర్ట్. 'దీపావళి-బలిపాడ్యమి' పర్వదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 10 మంగళవారం రోజున దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీని ప్రకారం దేశంలోని ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీల్లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లలో రోజంతా ఈక్విటీ లావాదేవీలు నిలిచిపోనున్నాయి.

సోమవారం తర్వాత స్టాక్ మార్కెట్లు తిరిగిన బుధవారం యథాతథంగా కార్యకలాపాలు సాగిస్తాయి.
ఎంసీఎక్స్, ఎన్‌సీడీఈఎక్స్ కమోడిటీ మార్కెట్ల వేళలు..
స్టాక్ మార్కెట్లు పూర్తిగా మూతపడినప్పటికీ కమోడిటీ మార్కెట్ కొన్ని గంటల పాటు అందుబాటులో ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద కమోడిటీ ఎక్స్ఛేంజ్ అయిన 'మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా' (ఎంసీఎక్స్)లో ఉదయం సెషన్ (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు) ట్రేడింగ్ నిలిచిపోతుంది. తిరిగి సాయంత్రం సెషన్ 5 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు సాధారణ పద్ధతిలో లావాదేవీలు కొనసాగుతాయని యాజమాన్యం స్పష్టం చేసింది.
మరోవైపు నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌సీడీఈఎక్స్) మాత్రం మంగళవారం రోజంతా పూర్తిగా మూతపడనుంది.
దీపావళి నుంచి 4వ రోజు వచ్చే రోజును బలిపాడ్యమి అంటారు. అసుర రాజు బాలి భూమికి తిరిగి వచ్చిన రోజుగా దీనిని పరిగణిస్తారు.
2026లో మిగిలిన స్టాక్ మార్కెట్ సెలవులు..
కాలెండర్ సంవత్సరం 2026లో ప్రకటించిన మొత్తం 16 స్టాక్ మార్కెట్ సెలవుల్లో ఇప్పటికే 13 సెలవులు పూర్తయ్యాయి. నవంబర్ 10 నాటి సెలవు తర్వాత ఈ ఏడాది మిగిలిన ప్రధాన సెలవులు ఇవే:
నవంబర్ 24 (మంగళవారం): ప్రకాష్ గుర్పురబ్ శ్రీ గురునానక్ దేవ్ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు.
{{/usCountry}}నవంబర్ 24 (మంగళవారం): ప్రకాష్ గుర్పురబ్ శ్రీ గురునానక్ దేవ్ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు.
{{/usCountry}}డిసెంబర్ 25 (శుక్రవారం): క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని బిఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ మూతపడతాయి.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఇలా..
ఇత సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 107 పాయింట్లు పెరిగి 81,107 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 58 పాయింట్లు వృద్ధిచెంది 25,045 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 891 పాయింట్లు పెరిగి 59,741 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 7,212.22 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7,172.53 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 95 డాలర్ల దిగువన ట్రేడ్ అవుతోంది. బ్రెంట్ క్రూడ్ 0.6శాతం పడి బ్యారెల్కు 91.9 డాలర్ల వద్ద కొనసాగుతోంది.