నేడే 77వ రిపబ్లిక్ డే- స్టాక్ మార్కెట్లకు సెలవు ఉందా? లేదా?
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరుగుతున్న వేళ, నేడు (జనవరి 26, 2026) భారత స్టాక్ మార్కెట్లు మూతపడనున్నాయి. ఈక్విటీ, కరెన్సీ మార్కెట్లకు సెలవు ప్రకటించగా, కమోడిటీ మార్కెట్ మాత్రం సాయంత్రం సెషన్‌లో అందుబాటులో ఉంటుంది.
భారత స్టాక్ మార్కెట్లకు నేడు, సోమవారం- 2026 జనవరి 26న సెలవు ఉంటుంది. 77వ గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఈ రోజు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ కార్యకలాపాలు జరగవు. అంటే శుక్రవారం తర్వాత సూచీలు తిరిగి మంగళవారమే ఓపెన్ అవుతాయి.

ఈక్విటీ మార్కెట్లతో పాటు కరెన్సీ మార్కెట్ కూడా నేడు మూతపడనుంది. అయితే, కమోడిటీ మార్కెట్ విషయానికి వస్తే.. ఉదయం సెషన్ నిలిపివేసినప్పటికీ, సాయంత్రం సెషన్ మాత్రం ట్రేడింగ్ కోసం తెరుచుకుంటుందని ఎక్స్ఛేంజ్ డేటా వెల్లడించింది. నేటి సెలవు తర్వాత, తదుపరి మార్కెట్ సెలవు మార్చి 3, 2026న హోలీ పండుగ సందర్భంగా ఉండనుంది.
2026 సంవత్సరానికి స్టాక్ మార్కెట్ సెలవుల పూర్తి జాబితా:
జనవరి 15 (గురువారం): మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు.
జనవరి 26 (సోమవారం): గణతంత్ర దినోత్సవం.
మార్చి 3 (మంగళవారం): హోలీ.
మార్చి 26 (గురువారం): శ్రీరామ నవమి.
మార్చి 31 (మంగళవారం): శ్రీ మహావీర్ జయంతి.
ఏప్రిల్ 3 (శుక్రవారం): గుడ్ ఫ్రైడే.
ఏప్రిల్ 14 (మంగళవారం): డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి.
మే 1 (శుక్రవారం): మహారాష్ట్ర దినోత్సవం.
మే 28 (గురువారం): బక్రీద్.
జూన్ 26 (శుక్రవారం): మొహర్రం.
సెప్టెంబర్ 14 (సోమవారం): గణేష్ చతుర్థి.
అక్టోబర్ 2 (శుక్రవారం): మహాత్మా గాంధీ జయంతి.
అక్టోబర్ 20 (మంగళవారం): దసరా.
నవంబర్ 10 (మంగళవారం): దీపావళి - బలిప్రతిపద.
నవంబర్ 24 (మంగళవారం): గురునానక్ జయంతి.
డిసెంబర్ 25 (శుక్రవారం): క్రిస్మస్.
అధికారిక ఎన్ఎస్ఈ డేటా ప్రకారం.. ఈ ఏడాది మహాశివరాత్రి (ఫిబ్రవరి 15), ఈద్-ఉల్-ఫితర్ (మార్చి 21), దీపావళి లక్ష్మీపూజ (డిసెంబర్ 8, 2026) వంటి పండుగలు వారాంతాల్లో (శని, ఆదివారాలు) రావడం వల్ల మార్కెట్‌కు ప్రత్యేకంగా అదనపు సెలవులు ఉండవు.
అయితే, నవంబర్ 9, 2026న ట్రేడింగ్ సెలవు ఉన్నప్పటికీ, ఆ రోజు సాయంత్రం సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఏటా ఒక గంట పాటు జరిగే 'ముహూరత్ ట్రేడింగ్' సెషన్ కోసం మార్కెట్లు ప్రత్యేకంగా తెరుచుకుంటాయి.
సాధారణ రోజుల్లో భారత స్టాక్ మార్కెట్ ఉదయం 9:15 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 3:30 గంటలకు ముగుస్తుంది.
గత వారం మార్కెట్ ముగింపు..
గత వారం చివరి రోజైన జనవరి 23 (శుక్రవారం) నాడు మార్కెట్ సూచీలు నష్టాల బాటలోనే సాగాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, త్వరలో రానున్న 'కేంద్ర బడ్జెట్ 2026'పై మదుపరుల జాగ్రత్త, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మూడో త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు.
ఫలితంగా శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 770 పాయింట్లు పడి 81,538 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 241 పాయింట్లు కోల్పోయి 25,049 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 727 పాయింట్లు పడి 58,473 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో ఎఫ్ఐఐలు రూ. 4,113.38 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,102.56 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ జనవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 40,704.39 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 54,822.71 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












