Stock Market Latest news : ఇరాన్- అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు- భారీ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 919 పాయింట్లు పెరిగి 77,550 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 275 పాయింట్లు వృద్ధిచెంది 24,051 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1091 పాయింట్లు పెరిగి 55,913 వద్దకు చేరింది.

కాగా అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం అవ్వడం, ప్రపంచ చమురు సరఫరాకు జీవనాధారంగా భావించే హర్ముజ్ జలసంధిని పూర్తిగా బ్లాక్ చేస్తున్నట్టు (ఒక్క ఓడ కూడా బయటకు వెళ్లకుండా) అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో రక్తపాతం కనిపిస్తోంది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 672.09 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ.410.05 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
“టెక్నికల్స్ పరంగా నిఫ్టీ50కి 23,7450- 23,800 లెవల్స్ సపోర్ట్‌గా ఉన్నాయి. 24,200- 24,250 రెసిస్టెన్స్‌గా ఉంది,” అని చాయిస్ బ్రోకింగ్ సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సుమీత్ బగాడియా తెలిపారు.
కాగా అంతర్జాతీయ అనిశ్చితి నేపథ్యంలో మార్కెట్లలో ఒడుదొడుకులు ఉంటాయని, బిగినర్లు ట్రేడింగ్‌కి దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 333 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.56 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.11శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.35 శాతం డౌన్ అయ్యింది.
{{/usCountry}}శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.56 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.11శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.35 శాతం డౌన్ అయ్యింది.
{{/usCountry}}కాగా స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ బ్లాక్ చేస్తామని ట్రంప్ చేసిన ప్రకటనతో అమెరికా ఫ్యూచర్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ట్రంప్ ప్రకటన, ఇరాన్‌తో అనిశ్చితి నేపథ్యంలో ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధరలు..
హర్ముజ్ జలసంధి చుట్టు ఉన్న అనిశ్చితి కారణంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఏకంగా 7.05శాతం పెరిగి బ్యారెల్‌కు 101.91 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
జిందాల్ స్టెయిన్లెస్- బై రూ. 780.85, స్టాప్ లాస్ రూ. 753, టార్గెట్ రూ. 836
రామకృష్ణ ఫోర్జింగ్స్- బై రూ. 544.05, స్టాప్ లాస్ రూ. 525, టార్గెట్ రూ. 582
ఎన్సీసీ- బై రూ. 153.06, స్టాప్ లాస్ రూ. 147.7, టార్గెట్ రూ. 164
బ్రిగేడ్ ఎటర్‌ప్రైజెస్ లిమిటెడ్- బై రూ. 723.2, స్టాప్ లాస్ రూ. 697, టార్గెట్ రూ. 775
ఫెడరల్ బ్యాంక్- బై రూ. 291.7, స్టాప్ లాస్ రూ. 281, టార్గెట్ రూ. 313