US Iran War news : చమురు ధరలు డౌన్ అవ్వడంతో సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1074 పాయింట్లు పెరిగి 76,489 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 312 పాయింట్లు వృద్ధిచెంది 24,032 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1238 పాయింట్లు పెరిగి 55,294 వద్దకు చేరింది.

కాగా మంగళవారం ఉదయం ఇరాన్‌పై అమెరికా దాడులు జరిపింది. ఫలితంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఈ పరిణామాల మధ్య ముడి చమురు ధర అమాంతం పెరిగింది, స్టాక్ మార్కెట్లలో భయాలు పెరిగాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 821.75 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,856.88 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 కీలక 24000 దాటడమే కాదు.. డైలీ చార్ట్‌లో బలమైన బుల్లిష్ క్యాండిల్ని ఫార్మ్ చేసింది. ఇది సానుకూల సంకేతం. ఇక్కడి నుంచి మరింత పైకి వెళ్లే అవకాశం ఉంది. సూచీకి 24,120 వద్ద రెసిస్టెన్స్ ఉంది. అది దాటితే 24,300 వరకు వళ్లొచ్చు. 23,850 వద్ద కీలక సపోర్ట్ ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మెమోరియల్ డే హాలీడే కారణంగా అమెరికా స్టాక్ మార్కెట్లకు సోమవారం సెలవు. డౌ జోన్స్, ఎస్ అండ్ పీ 500, నాస్డాక్ ఫ్యూచర్స్ మాత్రం స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
{{/usCountry}}మెమోరియల్ డే హాలీడే కారణంగా అమెరికా స్టాక్ మార్కెట్లకు సోమవారం సెలవు. డౌ జోన్స్, ఎస్ అండ్ పీ 500, నాస్డాక్ ఫ్యూచర్స్ మాత్రం స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
చమురు ధర..
అమెరికా- ఇరాన్ మధ్య గత కొన్ని నెలలుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఇరు దేశాల మధ్య శాంతి కోసం చర్చలు జరుగుతున్నట్టు సోమవారం రాత్రి వరకు వార్తలు వచ్చాయి. కానీ మంగళవారం ఉదయం మాత్రం సీన్ రీవర్స్ అయ్యింది! ఇరాన్ బోట్లపై అమెరికా దాడులు చేసింది. మిసైల్ లాంచ్ సైట్లపైనా విరుచుకుపడింది. ఈ పరిణామాలతో చమురు ధరలు జంప్ అయ్యాయి. సోమవారం దాదాపు 7శాతం పతనమైన బ్రెంట్ క్రూడ్.. మంగళవారం 1.5శాతం పెరిగి బ్యారెల్‌కి 97.56కి చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఇండస్ టవర్- బై రూ. 439, స్టాప్ లాస్ రూ. 420, టార్గెట్ రూ. 475
సెనైడర్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్- బై రూ. 1365, స్టాప్ లాస్ రూ. 1305, టార్గెట్ రూ. 1480
భారత్ పెట్రోలియం కార్పొరేషన్- బై రూ. 308, స్టాప్ లాస్ రూ. 294, టార్గెట్ రూ. 333
పంజాబ్ నేషనల్ బ్యాంక్- బై రూ. 106, స్టాప్ లాస్ రూ. 101, టార్గెట్ రూ. 115
యూపీఎల్- బై రూ. 652, స్టాప్ లాస్ రూ. 623, టార్గెట్ రూ. 710