శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 828 పాయింట్లు పెరిగి 77,569 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 244 పాయింట్లు వృద్ధిచెంది 24,207 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 793 పాయింట్లు పెరిగి 58,046 వద్దకు చేరింది.

కాగా.. వారాతంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి! అమెరికా- ఇరాన్ దేశాలు మరోసారి పరస్పర దాడులకు దిగాయి. ఫలితంగా స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్‌ని మూసివేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ప్రపంచ స్టాక్ మర్కెట్లు మరోసారి కుదేలయ్యాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,603.72 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,019.68 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 190 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
నిఫ్టీ50కి 24,500- 24,600 జోన్ వద్ద రెసిస్టెన్స్ ఉందని, 23,000 వద్ద సపోర్ట్ ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే, అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించాలని, బిగినర్లు ట్రేడింగ్‌కే దూరంగా ఉండటం ఉత్తమం అని సూచిస్తున్నారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. కానీ వారాంతంలో పరిస్థితులు మారిపోవడంతో యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ నెగిటివ్‌లో ట్రేడ్ అవుతున్నాయి.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}అమెరికా- ఇరాన్ పరస్పర దాడుల నేపథ్యంలో ముడి చమురు ధర భారీగా పెరిగింది. సోమవారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ 3శాతం పెరిగి బ్యారెల్‌కి 78 డాలర్లు దాటేసింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
రాజ్‌రతన్ గ్లోబల్ వైర్- బై రూ. 482, స్టాప్ లాస్ రూ. 455, టార్గెట్ రూ. 530
జిందాల్ పాలీ ఫిల్స్మ్- బై రూ. 718, స్టాప్ లాస్ రూ. 685, టార్గెట్ రూ. 780
డేటామాటిక్స్ గ్లోబల్ సర్వీసెస్- బై రూ. 900, స్టాప్ లాస్ రూ. 860, టార్గెట్ రూ. 980
చెన్నై పెట్రోలియం కార్పొరేషన్- బై రూ. 1180, స్టాప్ లాస్ రూ. 1125, టార్గెట్ రూ. 1290
గోద్రేజ్ ప్రాపర్టీస్- బై రూ. 2133, స్టాప్ లాస్ రూ. 2025, టార్గెట్ రూ. 2350