శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 463 పాయింట్లు పడి 78,491 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 65 పాయింట్లు కోల్పోయి 24,571 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 317 పాయింట్లు పడి 57,746 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 480.24 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 235.56 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 15 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50లో వీక్నెస్ కనిపిస్తోంది. 24,400- 24,300 లెవల్స్ వద్ద కీలక సపోర్ట్ ఉంది. 24,700 వద్ద కీలక రెసిస్టెన్స్ ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.28 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.62శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.3 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అమెరికా- ఇరాన్ మధ్య అనిశ్చితులు కొనసాగుతున్న వేళ ముడి చమురు ధర పెరుగుతోంది. బ్రెంట్ క్రూడ్ 1.09శాతం పెరిగి బ్యారెల్‌కి 84.46 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}అమెరికా- ఇరాన్ మధ్య అనిశ్చితులు కొనసాగుతున్న వేళ ముడి చమురు ధర పెరుగుతోంది. బ్రెంట్ క్రూడ్ 1.09శాతం పెరిగి బ్యారెల్‌కి 84.46 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}ఫిజిక్స్‌వాలా- బై రూ. 131.5, స్టాప్ లాస్ రూ. 127, టార్గెట్ రూ. 140
గ్రాసిమ్ ఇండస్ట్రీస్- బై రూ. 3323, స్టాప్ లాస్ రూ. 3200, టార్గెట్ రూ. 3555
ఫోర్టిస్ హెల్త్‌కేర్- బై రూ. 955, స్టాప్ లాస్ రూ. 920, టార్గెట్ రూ. 1020
బీఈఎంఎల్- బై రూ. 1788, స్టాప్ లాస్ రూ. 1725, టార్గెట్ రూ. 1913
హొనాసా కన్జ్యూమర్- బై రూ. 478, స్టాప్ లాస్ రూ. 460, టార్గెట్ రూ. 512