శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 331 పాయింట్లు పెరిగి 77,265 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 85 పాయింట్లు వృద్దిచెంది 24,176 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 14 పాయింట్లు పడి 57,496 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 5,039.80 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,183.93 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.018 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.25శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.52 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
ఇరాన్‌పై అమెరికా దాడుల నేపథ్యంలో ముడి చమురు ధర సోమవారం మళ్లీ పెరిగింది. బ్రెంట్ క్రూడ్ 1.23శాతం పెరిగి బ్యారెల్‌కి 89.18 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
టాటా టెక్నాలజీస్- బై రూ. 834, స్టాప్ లాస్ రూ. 795, టార్గెట్ రూ. 900
ఆస్క్ ఆటోమోటివ్- బై రూ. 635, స్టాప్ లాస్ రూ. 604, టార్గెట్ రూ. 685
{{/usCountry}}ఆస్క్ ఆటోమోటివ్- బై రూ. 635, స్టాప్ లాస్ రూ. 604, టార్గెట్ రూ. 685
{{/usCountry}}సాజిలిటీ- బై రూ. 46.34, స్టాప్ లాస్ రూ. 44, టార్గెట్ రూ. 50
రామకృష్ణ ఫోర్జింగ్స్- బై రూ. 751, స్టాప్ లాస్ రూ. 715, టార్గెట్ రూ. 810
టీటీకే హెల్త్‌కేర్- బై రూ. 1134, స్టాప్ లాస్ రూ. 1080, టార్గెట్ రూ. 1225