గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 304 పాయింట్లు పడి 74,346 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 78 పాయింట్లు కోల్పోయి 23,406 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 471 పాయింట్లు పెరిగి 54,186 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 5,616.56 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,740.89 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 170 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 మళ్లీ రేంజ్ బౌండ్లోకి జారుకుంది. 24,000 లెవల్ వద్ద రెసిస్టెన్స్ ఉంది. అక్కడే 50-ఈఎంఏ కూడా ఉంది. అది దాటితే అప్‌ట్రెండ్ కనిపించవచ్చు. 23,200 జోన్ వద్ద బలమైన సపోర్ట్ ఉంది,” అని ప్రభుదాస్ లిల్లధేర్కి చెందిన వైస్ ప్రెసిడెంట్- టెక్నికల్ రీసెర్చ్ వైషాలీ పరేఖ్ అభిప్రాయపడ్డారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.21 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.74శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.89 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
చమురు ధర..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ దాదాపు 0.7శాతం పడి బ్యారెల్‌కి 95.4 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}గురువారం ట్రేడింగ్ సెషన్లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ దాదాపు 0.7శాతం పడి బ్యారెల్‌కి 95.4 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}పీఎన్బీ- బై రూ. 105, స్టాప్ లాస్ రూ. 102, టార్గెట్ రూ. 110
ఓస్వాల్ పంప్స్- బై రూ. 373, స్టాప్ లాస్ రూ. 360, టార్గెట్ రూ. 385
జేకే టైర్- బై రూ. 387, స్టాప్ లాస్ రూ. 378, టార్గెట్ రూ. 405
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
సంధర్ టెక్నాలజీస్- బై రూ. 718, స్టాప్ లాస్ రూ. 685, టార్గెట్ రూ. 770
జిందాల్ సా- బై రూ. 250, స్టాప్ లాస్ రూ. 237, టార్గెట్ రూ. 270
టీడీ పవర్ సిస్టెమ్స్- బై రూ. 1286, స్టాప్ లాస్ రూ. 1222, టార్గెట్ రూ. 1390
ఫెడరల్ బ్యాంక్- బై రూ. 301, స్టాప్ లాస్ రూ. 289, టార్గెట్ రూ. 322
ఎయిరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్- బై రూ. 434, స్టాప్ లాస్ రూ. 413 టార్గెట్ రూ. 465