...
...
Next Story

అమెరికా స్టాక్​ మార్కెట్లు రికార్డు హై వద్ద- సెన్సెక్స్, నిఫ్టీ మాత్రం నేల చూపులు! ఈరోజూ నష్టాలే..

Stocks to buy today : జూన్ 1, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 1, 2026, 08:35:59 IST
Advertisement

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1092 పాయింట్లు పడి 74,776 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 360 పాయింట్లు కోల్పోయి 23,548 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 615 పాయింట్లు పడి 54,239 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్ మార్కెట్​ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్​ లేటెస్ట్ అప్డేట్స్..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 21,105.86 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 16,764.14 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“బెంచ్​మార్క్​ సూచీలు రేంజ్​ బౌండ్​లో కొనసాగే అవకాశం ఉంది. మిడ్​క్యాప్, స్మాల్​క్యాప్​లోని కొన్ని స్టాక్స్ మాత్రం పెరగొచ్చు. మంచి ఆదాయం, డొమెస్టిక్ లిక్విడిటీ ఇందుకు కారణం. కానీ అమెరికా- ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలి,” అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్​కి చెందిన హెడ్​ ఆఫ్​ రీసెర్చ్, వెల్త్ మేనేజ్​మెంట్​ సిద్దార్థ ఖేంక తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు రికార్డు హై లో ముగించాయి. డౌ జోన్స్​ 0.72 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.22శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.21 శాతం పెరిగింది.

అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా చమురు ధరలు మళ్లీ పెరిగాయి. బ్రెంట్​ క్రూడ 2.37శాతం వృద్ధిచెంది బ్యారెల్​కి 93.28 డాలర్లకు చేరింది.

బ్రేకౌట్ స్టాక్స్​ టు బై..

ఆక్మే సోలార్- బై రూ. 310, స్టాప్​ లాస్​ రూ. 298, టార్గెట్​ రూ. 335

కాప్రీ గ్లోబల్ క్యాపిటల్- బై రూ. 198, స్టాప్​ లాస్​ రూ. 189, టార్గెట్​ రూ. 215

సైర్మా ఎస్​జీఎస్ టెక్నాలజీ- బై రూ. 1089, స్టాప్​ లాస్​ రూ. 1035, టార్గెట్​ రూ. 1185

విజయ డయగ్నోస్టిక్ సెంటర్- బై రూ. 1308, స్టాప్​ లాస్​ రూ. 1245, టార్గెట్​ రూ. 1425

నియోజెన్ కెమికల్స్- బై రూ. 1858, స్టాప్​ లాస్​ రూ. 1777, టార్గెట్​ రూ. 2000

స్టాక్స్ టు బై..

లేటెంట్ వ్యూ- బై రూ. 325, స్టాప్​ లాస్​ రూ. 318, టార్గెట్​ రూ. 340

ప్రెసిషన్ కామ్​షాఫ్ట్స్- బై రూ. 155, స్టాప్​ లాస్​ రూ. 151, టార్గెట్​ రూ. 163

ఐఈఎక్స్- బై రూ. 129, స్టాప్​ లాస్​ రూ. 125, టార్గెట్​ రూ. 134

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe