గాంధీ జయంతి కారణంగా శుక్రవారం స్టాక్ మార్కెట్లకు సెలవు. ఇక గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 580 పాయింట్లు పడి 71,910 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 199 పాయింట్లు కోల్పోయి 22,422 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 182 పాయింట్లు పడి 54,451 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 9,484.22 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 10,041.84 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.50 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.7శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.2 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి : నిఫ్టీ 22,000 కిందకు పడితే బేర్ల పండుగే: విశ్లేషకుల హెచ్చరిక
ముడి చమురు ధర..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 100 డాలర్ల ఎగువన ట్రేడ్ అవుతోంది. బ్రెంట్ క్రూడ్ 0.79శాతం పడి బ్యారెల్కు 101.3 డాలర్ల వద్ద ఉంది.
స్టాక్స్ టు బై లిస్ట్..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్- బై రూ. 710-720, స్టాప్ లాస్ రూ. 680, టార్గెట్ రూ. 760
{{/usCountry}}హెచ్డీఎఫ్సీ బ్యాంక్- బై రూ. 710-720, స్టాప్ లాస్ రూ. 680, టార్గెట్ రూ. 760
{{/usCountry}}ఇన్ఫోసిస్- బై రూ. 1020- 1040, స్టాప్ లాస్ రూ. 980, టార్గెట్ రూ. 1180
బీఈఎల్- బై రూ. 390- 395, స్టాప్ లాస్ రూ. 380, టార్గెట్ రూ. 410
సాజిలిటీ- బై రూ. 43.17, స్టాప్ లాస్ రూ. 41.50, టార్గెట్ రూ. 46.5
ఉజ్జీవన్ ఎస్ఎఫ్బీ- బై రూ. 65.6, స్టాప్ లాస్ రూ. 62.5, టార్గెట్ రూ. 71
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ- బై రూ. 91, స్టాప్ లాస్ రూ. 87, టార్గెట్ రూ. 99
బజాజ్ హెచ్ఎఫ్ఎల్- బై రూ. 82.9, స్టాప్ లాస్ రూ. 79, టార్గెట్ రూ. 89
జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్- బై రూ. 91.2, స్టాప్ లాస్ రూ. 86.7, టార్గెట్ రూ. 100